iDreamPost

Adipurush: వీడియో: ఆదిపురుష్ సినిమా చూడ్డానికి వచ్చిన మారుతి! హనుమాన్ నిజంగానే వచ్చాడా?

  • Author Soma Sekhar Published - 11:29 AM, Fri - 16 June 23
  • Author Soma Sekhar Published - 11:29 AM, Fri - 16 June 23
Adipurush: వీడియో: ఆదిపురుష్ సినిమా చూడ్డానికి వచ్చిన మారుతి! హనుమాన్ నిజంగానే వచ్చాడా?

కొన్ని నమ్మకాలు నిజం కావొచ్చు.. కొన్ని నిజాలే నమ్మకాలు కావొచ్చు. ఇక మనం ఏది బలంగా నమ్మితే అదే జరుగుతుంది అని చాలా మంది తత్వవేత్తలు తమ తమ పుస్తకాల్లో చెప్పకనే చెప్పారు. అయితే ఈ విషయాలు అన్ని కొంతమంది నమ్ముతారు, మరికొంతమంది కొట్టిపారేస్తారు. కానీ తాజాగా జరిగిన ఓ సంఘటన గురించి తెలిస్తే మీ మైండ్ బ్లాంక్ అయిపోయిద్ది. ఆదిపురుష్ సినిమా చూడడానికి హనుమంతుడు వస్తాడని మూవీ యూనిట్ ఈ సినిమా ప్రదర్శించబడే అన్ని థియేటర్లలో ఓ సీట్ ను హనుమాన్ కు కేటాయించింది. ఇప్పుడు వారి నమ్మకమే నిజం అయ్యింది. ఆదిపురుష్ ప్రదర్శింపబడుతున్న ఓ థియేటర్ లోకి మారుతి వచ్చింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరిన్ని వివరాల్లోకి వెళితే..

ఆదిపురుష్.. జై శ్రీరామ్.. ప్రస్తుతం ఏ సినిమా హాల్ దగ్గర చూసినా ఈ రెండు పేర్లే దద్దరిల్లుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా జూన్ 16 శుక్రవారం ఆదిపురుష్ సినిమా రిలీజ్ అయ్యింది. ఇక ట్విట్టర్ రివ్యూ చూసుకుంటే సినిమా సూపర్, డూపర్ హిట్ అంటూ చెప్పుకొస్తున్నారు ప్రేక్షకులు. అయితే ఇవన్ని కాసేపు పక్కన పెడితే.. ఆదిపురుష్ సినిమా చూడడానికి హనుమంతుడు వస్తాడని మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రదర్శింపబడే ప్రతి థియేటర్లో ఓ సీట్ ను హనుమంతుడికి కేటాయించింది. దీనిపై ఎన్నో విమర్శలు కూడా వచ్చాయి. మరికొందరు ప్రశంసలు కూడా కురిపించారు.

ఈ క్రమంలోనే తాజాగా రిలీజ్ అయిన ఆదిపురుష్ సినిమాను చూడడానికి థియేటర్ కు మారుతి వచ్చింది. దాంతో ఒక్కసారిగా ప్రేక్షకులు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. నిజంగానే హనుంతుడు ఆదిపురుష్ సినిమా చూడటానికి వచ్చాడు అంటూ ప్రేక్షకులు చెప్పుకొస్తున్నారు. థియేటర్ గొడపై నుంచి మారుతి ఆదిపురుష్ సినిమా చూస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మారుతిని హనుంతుడిగా కొలవడం అనాదిగా వస్తున్న సంప్రదాయం అని మనందరికి తెలిసిందే. ఇక థియేటర్ల దగ్గర రచ్చ, అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే తొలి రోజే డార్లింగ్ ప్రభాస్ రూ. 100 కోట్లు కొల్లగొట్టడం ఖాయం అంటున్నారు సినీ పండితులు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి