iDreamPost
android-app
ios-app

Hanuman Movie OTT: OTT కంటే ముందే టీవీలో ‘హనుమాన్’ మూవీ.. ఏ చానెల్‌ అంటే

  • Published Mar 09, 2024 | 10:51 AM Updated Updated Jul 16, 2024 | 1:32 AM

Hanuman Movie OTT Release Date & Streaming Platform: హనుమాన్‌ సినిమా ఓటీటీ రిలీజ్‌ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తోన్న ప్రేక్షకులకు ఊహించని ట్బిస్ట్‌ ఇచ్చింది. ఓటీటీలో కన్నా ముందు టీవీలో రానుంది. ఆ వివరాలు..

Hanuman Movie OTT Release Date & Streaming Platform: హనుమాన్‌ సినిమా ఓటీటీ రిలీజ్‌ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తోన్న ప్రేక్షకులకు ఊహించని ట్బిస్ట్‌ ఇచ్చింది. ఓటీటీలో కన్నా ముందు టీవీలో రానుంది. ఆ వివరాలు..

  • Published Mar 09, 2024 | 10:51 AMUpdated Jul 16, 2024 | 1:32 AM
Hanuman Movie OTT: OTT కంటే ముందే టీవీలో ‘హనుమాన్’ మూవీ.. ఏ చానెల్‌ అంటే

సంక్రాంతికి రిలీజైన సినిమాల్లో ప్రశాంత్‌ వర్మ డైరెక్షన్‌లో వచ్చిన హనుమాన్‌ సినిమా భారీ విజయం సాధించింది. మన దేశంలోనే కాక.. విదేశాల్లో సైతం భారీ వసూళ్లను సాధించి.. రికార్డుల మీద రికార్డులు క్రియేట్‌ చేస్తోంది. తక్కువ బడ్జెట్‌తో తెర కెక్కి.. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇక ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రెండు, మూడు సార్లు హనుమాన్‌ ఓటీటీ రిలీజ్‌ వాయిదా పడుతూ వస్తోంది. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన సైంధవ్, గుంటూరు కారం, నా సామిరంగ చిత్రాలు ఎప్పుడో ఓటీటీలోకి వచ్చేశాయి. కానీ హనుమాన్ మాత్రం రావడం లేదు. శివరాత్రికి వస్తుందని భావించారు.. కానీ వాయిదా పడింది. ఈ క్రమంలో హనుమాన్‌ గురించి ఓ ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది.

హనుమాన్‌ సినిమా ఓటీటీలో కన్నా ముందు.. టీవీలోకి రానుంది. అయితే అది తెలుగులో కాదు. హిందీ టీవీ చానెల్స్‌లో ప్రసారం కానుంది. మార్చి 16న రాత్రి 8 గంటలకు కలర్స్‌ సినీప్లెక్స్‌ ఛానల్‌, జియో సినిమాలో కేవలం హిందీలో మాత్రమే హనుమాన్ మూవీ టెలికాస్ట్‌ అవుతుంది. ఈ వివరాలను కలర్స్‌ సినీప్లెక్స్‌ సంస్థ తమ సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ట్వీట్‌ను డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రీట్వీట్‌ చేయడంతో ఇది అఫిషియల్‌ అయ్యింది. నిజానికి మొదట్లో మార్చి 2 నుంచి ‘జీ 5’లో హనుమాన్‌ స్ట్రీమింగ్‌ అవుతుందంటూ ప్రచారం జరిగింది. ఆ తర్వాత మార్చి 8న పోస్ట్‌ పోన్‌ అయ్యింది. శివరాత్రి సందర్భంగా హనుమాన్‌ సినిమా ఓటీటీల్లో వస్తుందని భావిస్తే.. మళ్లీ  వాయిదా పడింది. దాంతో అభిమానులు చాలా నిరాశ పడ్డారు.

ఇక కొందరు అభిమానులైతే సోషల్‌ మీడియాలో ‘జీ5’ను ట్యాగ్‌ చేస్తూ హనుమాన్ సినిమా స్ట్రీమింగ్‌ ఎప్పుడంటూ కామెంట్స్‌ చేశారు. దీనిపై జీ5 స్పందిస్తూ.. హనుమాన్‌ విడుదల తేదీపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని చెప్పుకొచ్చింది. దాంతో హనుమాన్‌ ఓటీటీ స్ట్రీమింగ్‌ ఎప్పుడనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. కానీ ఈలోపే ఈ సినిమా టీవీల్లో వస్తుండటం.. అందునా హిందీలో రానుండటంతో.. ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇక ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదలైన సినిమాల్లో.. హనుమాన్‌ బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్‌ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా పాన్‌ ఇండియా వైడ్‌గా మంచి విజయం దక్కించుకుంది. కేవలం రూ.40 కోట్లతో తీసిన హనుమాన్‌ ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.330 కోట్లకి పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు హిందీలో కూడా ఈ చిత్రం వసూళ్ల సునామీ సృష్టించింది.

ఇక ఈ చిత్రానికి సీక్వెల్‌గా జై హనుమాన్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్ర స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని షూట్ చేసి వచ్చే ఏడాది రిలీజ్ చేయాలనుకుంటున్నట్లు ప్రశాంత్ చెప్పారు. ఇక ఈ చిత్రంలో హనుమాన్ పాత్రను ఓ స్టార్ హీరో చేయబోతున్నట్లు కూడా ప్రకటించారు.