iDreamPost

హనుమాన్‌ ఫస్ట్‌ డే కలెక్షన్‌.. ఎంత రాబట్టిందంటే..

Hanuman Day 1/First Day Collection: హనుమాన్‌ భారీ అంచనాల నడుమ విడుదలై బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌గా నిలిచింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సూపర్‌ హిట్‌ అయింది.

Hanuman Day 1/First Day Collection: హనుమాన్‌ భారీ అంచనాల నడుమ విడుదలై బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌గా నిలిచింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సూపర్‌ హిట్‌ అయింది.

హనుమాన్‌ ఫస్ట్‌ డే కలెక్షన్‌.. ఎంత రాబట్టిందంటే..

అన్ని అడ్డంకులు దాటుకుని హనుమాన్‌ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా జనవరి 12 తేదీన విడుదల అయింది. తెలుగులో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజైంది. విడుదలైన అన్ని భాషల్లో సినిమాకు బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ టాక్‌ వచ్చింది. సౌత్‌లో కంటే నార్త్‌లో మూవీకి ఎక్కువ క్రేజ్‌ వచ్చింది. హిందీ ప్రేక్షకులు సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఇక, హనుమాన్‌ హౌస్‌ ఫుల్‌ కలెక్షన్లతో దూసుకుపోతోంది.

ఈ సినిమా మొదటి రోజు ఎంత కలెక్ట్‌ చేసిందంటే.. ప్రస్తుత అంచనాల ప్రకారం ఈ మూవీ దేశ వ్యాప్తంగా పది కోట్ల రూపాయల నెట్‌ కలెక్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా 8 కోట్ల రూపాయలు.. హిందీ నెట్‌లో రెండు కోట్ల రూపాయలు.. మిగిలిన భాషల్లో ఆరు లక్షలు కలెక్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఇవి కేవలం అంచనాలు మాత్రమే.. సినిమా టీం నుంచి కలెక్షన్లపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఆ ప్రకటన వస్తే గానీ, కలెక్షన్లపై క్లారిటీ ఉండదు.

hanuman day1 collections

కాగా, హనుమాన్‌ సినిమాలో తేజ సజ్జ హీరోగా నటించాడు. తేజ సజ్జకు జంటగా అమృత అయ్యర్‌ నటించింది. వరలక్ష్మీ శరత్‌కుమార్‌, వినయ్‌ రాయ్‌, సముద్ర ఖని, వెన్నెల కిషోర్‌, గెటప్‌ సీనులు కీలక పాత్రల్లో నటించారు. ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు నిరంజన్‌ రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు. అనుదీప్ దేవ్, గౌరహరి, కృష్ణ సౌరభ్‌లు సంగీతం అందించారు. ఇక, ఈ మూవీ 30 కోట్ల రూపాయలతో తెరకెక్కినట్లు తెలుస్తోంది. తక్కువ బడ్జెట్‌లో అద్భుతమైన గ్రాఫిక్స్‌ చూపించాడంటూ ప్రశాంత్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి.

ఆదిపురుష్‌ 500 కోట్లతో తెరకెక్కినా.. హనుమాన్‌ 30 కోట్లతో తెరకెక్కినా.. హనుమాన్‌ గ్రాఫిక్స్‌ ఆదిపురుష్‌ గ్రాఫిక్స్‌ కంటే 100 రెట్లు మేలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చివరి 20 నిమిషాల క్లైమాక్స్‌తో గూస్‌బమ్స్‌ రావటం ఖాయం అంటున్నారు. హనుమాన్‌ సీక్వెల్‌ కూడా ఉండనుంది. సీక్వెల్‌ కోసం ప్రశాంత్‌ ఓ ట్విస్ట్‌ను కూడా పెట్టాడు. ‘ రాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట ఏమిటి?’ అన్న క్వశ్చన్‌ మార్కును ప్రేక్షకుల్ల మెదుళ్లలో పడేశాడు. మరి, హనుమాన్‌ సినిమా డే 1 కలెక్షన్లపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 ఏపీ, తెలంగాణ లెక్కలు :

  • నిజాం : 3.1 కోట్లు
  • ఉత్తరాంధ్ర : 0.8 కోట్లు
  • సీడెడ్‌ : 0.8 కోట్లు
  • ఈస్ట్‌ : 0.76 కోట్లు
  • గుంటూరు 0.55 కోట్లు
  • వెస్ట్‌ : 0.42 కోట్లు
  • క్రిష్ణ : 0.28 కోట్లు
  • నెల్లూరు : 0.21 కోట్లు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి