iDreamPost

Hanuman 3D version: క్రేజీ న్యూస్.. థియేటర్లలోకి హనుమాన్ 3D వెర్షన్! రిలీజ్ ఎప్పుడంటే?

ఓ క్రేజీ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. థియేటర్లలోకి హనుమాన్ 3D వెర్షన్ ను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ఇంతకీ రిలీజ్ ఎప్పుడంటే?

ఓ క్రేజీ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. థియేటర్లలోకి హనుమాన్ 3D వెర్షన్ ను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ఇంతకీ రిలీజ్ ఎప్పుడంటే?

Hanuman 3D version: క్రేజీ న్యూస్.. థియేటర్లలోకి హనుమాన్ 3D వెర్షన్! రిలీజ్ ఎప్పుడంటే?

‘హనుమాన్’.. ప్రస్తుతం ఇండియా వైడ్ గా థియేటర్లలో దద్దరిల్లుతున్న పేరు. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సూపర్ హీరో ఫిల్మ్ అఖండ విజయం సాధించింది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన గుంటూరు కారం సినిమాను ఢీ కొట్టి మరీ సంపూర్ణ విజయం సాధించింది. దీంతో సంక్రాంతి తొలి విన్నర్ గా నిలిచింది హనుమాన్. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే? థియేటర్లలోకి హనుమాన్ 3D వెర్షన్ ను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

హనుమాన్ మూవీని త్వరలోనే త్రీడీ వెర్షన్ లో రిలీజ్ చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఆల్రెడీ చూసిన సినిమాను ప్రేక్షకులు మరోసారి చూస్తారా? అంటే కాస్త సందేహపడాల్సిందే. కానీ హనుమాన్ మేకర్స్ మాత్రం ధైర్యంగా ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం గ్రాఫిక్స్ పరంగా అద్భుతమైన రెస్పాన్స్ ను దక్కించుకుంది. అతి తక్కువ బడ్జెట్ లో ఇంత క్వాలిటీ పిక్చర్ ను తెరకెక్కించడంలో హనుమాన్ టీమ్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఇక మరో సక్సెస్ కోసం ప్లాన్ చేస్తోంది ఈ టీమ్. త్రీడీలో ఈ చిత్రాన్ని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్. మూవీ చూసిన వాళ్లు, చూడని వాళ్లు రికమండ్ చేసే స్థాయిలో త్రీడీ విజువల్స్ ఉంటాయని మూవీ యూనిట్ చెప్పుకొస్తున్నారు.

hanuman movie in 3d

కాగా.. ఈ వేసవి కాలంలో దాదాపు వెయ్యి స్క్రీన్స్ లో హనుమాన్ త్రీడీ వెర్షన్ ను రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. ఇందుకు సంబంధించిన పనులను ప్రారంభించినట్లు కూడా తెలుస్తోంది. సమ్మర్ లో పిల్లలకు స్కూల్స్ ఉండవు కాబట్టి.. వారిని టార్గెట్ చేసుకుని మేకర్స్ హనుమాన్ త్రీడీని తీసుకొస్తున్నారు. త్రీడీలో ఈ చిత్రాన్ని చూస్తే కళ్లు జిగేల్ మనడం ఖాయమంటూ మేకర్స్ పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా.. హనుమాన్ థియేటర్ రన్ క్లోజింగ్ దగ్గర పడుతున్నా.. ఇంకా హౌస్ ఫుల్ కలెక్షన్లు సాధిస్తుండటం విశేషం. ఇప్పటి వరకు దాదాపు రూ. 250 కోట్లకు పైగా వసూళ్లు సాధించి.. 300 కోట్ల క్లబ్ లో చేరేందుకు దగ్గరపడుతోంది. మరి హనుమాన్ క్రేజ్ ను కంటిన్యూ చేయడానికి త్రీడీ వెర్షన్ తీసుకురావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి