iDreamPost

హనుమాన్‌ రికార్డుల మోత.. వారంలో ఊహించని కలెక్షన్లు!!

హనుమాన్‌ సినిమా ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం అంచనాలకు మించి వసూళ్లను సాధిస్తోంది. వారం రోజుల్లోనే స్టార్‌ హీరో సినిమాను మించి కలెక్షన్లు రాబట్టింది.

హనుమాన్‌ సినిమా ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం అంచనాలకు మించి వసూళ్లను సాధిస్తోంది. వారం రోజుల్లోనే స్టార్‌ హీరో సినిమాను మించి కలెక్షన్లు రాబట్టింది.

హనుమాన్‌ రికార్డుల మోత.. వారంలో ఊహించని కలెక్షన్లు!!

ప్రశాంత్‌ వర్మ – తేజ సజ్జా కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ హనుమాన్‌’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల అయింది. విడుదల అయిన అ‍న్ని భాషల్లో హనుమాన్‌ బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ అయింది. సాధారణ ప్రేక్షకులతో పాటు రివ్యూవర్లు కూడా మూవీకి మంచి రివ్యూలు ఇస్తున్నారు. ఇక, ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాలతో సమానంగా హిందీలోనూ కలెక్షన్లు వస్తున్నాయి.

హనుమాన్‌ మొదటి రోజు ఏకంగా.. 20 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దాదాపు 30 కోట్ల రూపాయలతో తెరకెక్కిన ఈ మూవీ రెండు రోజుల్లోనే బ్రేక్‌ ఈవెన్‌ను క్రాస్‌ చేసింది. మూడు రోజుల్లో 60 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. మూవీ విడుదల అయి ఎనిమిది రోజులు అవుతున్నా థియేటర్లు హౌస్‌ ఫుల్‌ బోర్డులతో నడుస్తున్నాయి. కలెక్షన్ల విషయంలో హనుమాన్‌ స్టార్‌ హీరో సినిమాలకు ఏ మాత్రం తీసిపోవటం లేదు. వారం రోజుల్లోనే 150 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది.

Hanuman who looted huge collections!

ఈ మేరకు మైత్రి మూవీ మేకర్‌ సంస్థ ఈ విషయాన్ని తమ అధికారిక ట్విటర్‌ ఖాతాలో తెలియజేసింది. ‘‘ తిరుగేని ప్రేమ, ఆతిథ్యంతో హనుమాన్‌ అందనంత ఎత్తులో నిలుచుంది. మొదటి వారం ప్రపంచ వ్యాప్తంగా 150 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది. ప్రపంచం నలుమూలలనుంచి మంచి స్పందన వస్తోంది. హనుమాన్‌ను థియేటర్లలో చూడండి’’ అని పేర్కొంది. కాగా, హనుమాన్‌ సినిమాలో హీరో తేజ సజ్జకు జంటగా అమృత అయ్యర్‌ నటించారు.

వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, వినయ్‌ రాయ్‌, వెన్నెల కిశోర్‌, సముద్రఖని, గెటప్‌ శ్రీను కీలక పాత్రల్లో కనిపించారు. మొదట ఈ మూవీ కోసం దాదాపు 15 కోట్ల రూపాయల బడ్జెట్‌ కేటాయించారట. టీజర్‌కు వచ్చిన స్పందనతో గ్రాఫిక్స్‌పై ఎక్కువ దృష్టి పెట్టారు. బడ్జెట్‌ 30 కోట్లకు వెళ్లింది. మొత్తానికి హనుమాన్‌ గ్రాఫికల్‌ వండర్‌గా మారిపోయింది. మంచి అవుట్‌ పుట్‌ వచ్చింది. సినిమాలోని చివరి 20 నిమిషాలు గూస్‌బమ్స్‌ తెప్పిస్తున్నాయని మూవీ చూసిన ప్రతీ ఒక్కరు అంటున్నారు. మరి, వారం రోజుల్లోనే హనుమాన్‌ 150 కోట్లకు పైగా వసూళ్లు సాధించటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి