iDreamPost

గుంటూరు: కారులో వచ్చి కూరగాయలు అమ్ముతోన్న వ్యాపారి.. ఐడియా సూపర్‌!

  • Published Aug 21, 2023 | 11:35 AMUpdated Aug 21, 2023 | 11:35 AM
  • Published Aug 21, 2023 | 11:35 AMUpdated Aug 21, 2023 | 11:35 AM
గుంటూరు: కారులో వచ్చి కూరగాయలు అమ్ముతోన్న వ్యాపారి.. ఐడియా సూపర్‌!

ఎంత కష్టపడ్డా.. ఎన్ని లక్షల కోట్లు సంపాదించినా.. మనిషి బతకడానికి కావాల్సింది.. కడుపుకు పట్టెడన్నం. అందుకే మన పెద్దలు.. కూటి కోసం కోటి విద్యలు అన్నారు. డబ్బు సంపాదన కోసం కొందరు విపరీతంగా కష్టపడితే.. చాలా కొద్ది మంది మాత్రం స్మార్ట్‌గా ఆలోచించి.. పని సులువు చేసుకుని.. అధిక ఆదాయం ఆర్జిస్తారు. వీరు ముఖ్యంగా ట్రెండ్‌ని ఫాలో అవుతారు. దానికి తగ్గట్టే.. వినూత్న ఐడియాలతో జనాల్లోకి వెళ్లి సక్సెస్‌ అవుతారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కూడా ఈ కోవకు చెందిన వార్తే. ఓ వ్యక్తి అంబాసిడర్‌ కారులో.. కూరగాయాలు అమ్ముతూ.. అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఆ వివరాలు..

పొన్నూరుకు చెందిన షేక్ రషీద్‌ కూరగాయాల వ్యాపారం చేయాలనుకున్నాడు. అయితే వ్యాపారం కోసం ఆటో కొనుగోలు చేసేంత ఆర్థిక పరిస్థితి లేదు. ఈ విషయాన్ని స్నేహితులకు చెప్పుకుని బాధ పడ్డాడు. వ్యాపారం గురించి ఆలోచిస్తుండగానే.. అతడికి ఓ వినూత్న ఐడియా వచ్చింది ఆలోచన వచ్చింది. జనాలను ఆకర్షించడం కోసం కారులో కూరగాయాలు అమ్మాలని భావించాడు. ఈ క్రమంలో తన దగ్గరున్న పాత అంబాసిడర్‌ కారును షెడ్‌కు తరలించాడు. అక్కడ కారును రీ మోడల్ చేయించాడు షేక్‌ రషీద్‌. కారు వెనుక సీటుపై భాగాన్ని, సీటును తొలగించి అవసరమైన మార్పులు, చేర్పులు చేయించాడు. వెనుక భాగంలో కూరగాయల బుట్టలు ఉంచేలా ఒక ప్లాట్‌ఫామ్‌ తయారు చేయించాడు రషీద్‌.

ఆ తర్వాత కారులో కూరగాయలు తీసుకెళ్లి వ్యాపారం చేయడం ప్రారంభించాడు. కారు డ్రైవ్‌ చేసుకుంటూ.. పొన్నూరులోని వివిధ ప్రాంతాలకు వెళ్తూ కూరగాయలు అమ్మతున్నాడు షేక్‌ రషీద్‌. తనకు అవసరమైన చోట కొద్ది సేపు వాహనాన్ని నిలిపి వ్యాపారం చేసుకుంటున్నాడు. అక్కడ కూరగాయలు అమ్మిన తర్వాత మరో సెంటర్ కు వెళ్లి అక్కడ కూరగాయాలు. ఈ ఆలోచన బాగా క్లిక్‌ అయ్యిందని.. వ్యాపారం కూడా బాగా సాగుతుందని తెలిపాడు రషీద్‌. ఐడియా కూడా సూపర్‌ అంటున్నారు జనాలు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి