iDreamPost

Guntur Kaaram: గుంటూరు కారం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ డేట్ ఫిక్స్?

  • Published Mar 18, 2024 | 11:07 AMUpdated Mar 18, 2024 | 11:07 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటించిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గుంటూరు కారం.. పండగ సెలవులలో మంచి వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద మంచి ఎబోవ్ యావరేజ్ గా నిలిచింది. ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌ ద్వారా టీవీలో కూడా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది.

ప్రముఖ రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటించిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గుంటూరు కారం. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుండి కాస్త మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకున్నా.. మహేష్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. పండగ సెలవులలో మంచి వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద మంచి ఎబోవ్ యావరేజ్ గా నిలిచింది. తాజాగా ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌ ద్వారా టీవీలో కూడా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నట్లు గట్టి టాక్ వినిపిస్తుంది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఉగాది పండుగ సందర్భంగా, గుంటూరు కారం సినిమా ఏప్రిల్ 9, 2024న ప్రముఖ జెమినీ టీవీ ఛానెల్‌లో ప్రసారం కానుందని తెలుస్తోంది. త్వరలోనే జెమినీ టీవీ ఛానెల్ సంబంధిత ప్రకటన ఇవ్వనుందట. ఈ చిత్రంలో మహేష్ బాబుకి జోడీగా లేటెస్ట్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల నటించగా, హీరో తల్లి పాత్రలో రమ్యకృష్ణ నటించారు. పదేళ్ల వయస్సులోనే అనుకోకుండా తల్లికి దూరమైన రమణ, పెరిగి పెద్దయ్యాక విలన్ల భరతం పట్టి తన తల్లికి మళ్ళీ ఎలా దగ్గరయ్యాడు అనేదే ఈ సినిమా ప్రధాన కథ.

జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలయిన గుంటూరు కారం… ఆ తరువాత నాలుగు వారాలకే ఓటీటీలో విడుదలై అక్కడ కూడా రికార్డులు సృష్టించింది. చాలా రోజులుగా ఓటీటీ టాప్ లిస్టులో చోటు సంపాదించుకోవడమే కాకుండా హిందీ వెర్షన్ లో కూడా అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. రమణ వంటి మాస్ క్యారెక్టర్ లో మహేష్ బాబు మ్యానరిజమ్స్, బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకున్నాయి. అలానే థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ప్రేక్షకులని అలరించింది. మరి గుంటూరు కారం సినిమాకి బుల్లితెర పై ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. అక్కడ కూడా తమ అభిమాన హీరో సినిమా రికార్డులు క్రియేట్ చేస్తుందని మహేష్ బాబు అభిమానులు అంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి