iDreamPost

టీవీ స్టూడియోలో లైవ్.. తుపాకులతో ఎంట్రీ ఇచ్చిన దుండగులు.. అసలు ఏమైందంటే?

ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదులు, డ్రగ్స్ వ్యాపారస్తులు, అక్రమాయుధాలు సరఫరా చేసేవారు తమ కార్యాకలాపాలను యేదేచ్చగా కొనసాగిస్తున్నారు. ఆఫ్ఘన్ దేశాల్లో ఎక్కడో అక్కడ బాంబు దాడులు జరుగుతూనే ఉన్నాయి.

ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదులు, డ్రగ్స్ వ్యాపారస్తులు, అక్రమాయుధాలు సరఫరా చేసేవారు తమ కార్యాకలాపాలను యేదేచ్చగా కొనసాగిస్తున్నారు. ఆఫ్ఘన్ దేశాల్లో ఎక్కడో అక్కడ బాంబు దాడులు జరుగుతూనే ఉన్నాయి.

టీవీ స్టూడియోలో లైవ్.. తుపాకులతో ఎంట్రీ ఇచ్చిన దుండగులు.. అసలు ఏమైందంటే?

ప్రపంచంలో కొంతకాలంగా ఉగ్రమూకలు రెచ్చిపోతున్నారు. ఎంతోమంది అమాయకుల ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. తమ లక్ష్యం కోసం విధ్వంసాలు సృష్టిస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. టీవీ స్టూడియో అంటే సెక్యూరిటీ సిస్టమ్ బాగానే ఉంటుంది. అలాంటిది సాయుధులైన కొందరు దుండగులు ప్రత్యక్ష ప్రసారం జరుగుతున్న సమయంలో స్టూడియోలోకి ప్రవేశించి తీవ్ర కలకలం సృష్టించారు. దీంతో స్టూడియోలో ఉన్నవారంతా ఒక్కసారే షాక్ కి గురయ్యారు.. ఏం జరుగుతుందో అని భయంతో వణికి పోయారు. ఈ ఘటన లాటిన్ అమెరికా ఈక్వెడార్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే..

అమెరికాలోని ఈక్వెడార్ లో మంగళవారం పోర్ట్ సిటీ గుయాక్విల్ లోని టీసీ టెలివిజన్ ఛానల్ సెట్ లో ప్రత్యక్ష ప్రసారం జరుగుతుంది. అంతలోనే 13 మంది సాయుధులు ముసుకు ధరించి స్టూడియోలోకి ప్రవేశించారు. లైవ్ లోనే కొంతమందిని కింద కూర్చోబెట్టి పాయింట్ బ్లాక్ లో గన్ గురిపెట్టారు. తమ వద్ద బాంబులు ఉన్నాయని.. పోలీసులకు సమాచారం ఇస్తే అందరినీ చంపేస్తామని, అందరూ ప్రశాంతంగా ఉండాలి.. లేదంటే బాంబులు వేసి, కాల్చి చంపేస్తామని కొందరు సాయుధులు బెదిరించారు. అంలేకాదు కొంతమంది ముష్కరులు గాల్లోకి కాల్పులు కూడా జరిపారు. దాదాపు ఇరవై నిమిషాల పాటు ఉత్కంఠ కొనసాగింది. అక్కడ ఉన్నవాళ్లంతా ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని గజ గజ వణికిపోయారు. ఇదంతా టీవీలో ప్రత్యక్ష ప్రసారం జరిగింది.

A gun was pointed at a news anchor live

సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం పదమూడు మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఏం కాలేదని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనను ఉగ్రవాద చర్యల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ముష్కరుల నుంచి తుపాకులు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇప్పటి వరకు ఈ దాడి వెనుక ఎవరు అన్న విషయం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇటీవల ఇద్దరు గ్యాంగ్ స్టర్లు జైలు నుంచి తప్పించుకున్నారు.. ఆ తర్వాత నుంచి ఇలాంటి ఘటనలు తరుచూ జరుగుతున్నాయని.. త్వరలో వారిని పట్టుకుంటామని అన్నారు. బహుషా ఇది కూడా వారి పనే అయి ఉండవొచ్చు అన్న అనుమానాలు వస్తున్నాయని తెలిపారు. ఈ ఘటన తర్వాత ఏడుగురు పోలీసులు కిడ్నాప్ కి గురయ్యారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. దేశంలో జరుగుతున్న పరిణామాలపై స్పందించిన అధ్యక్షులు డేనియల్ నోబోవా జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించారు. దేశంలో పనిచేస్తున్న 20 డ్రగ్స్ ముఠాటలను ఉగ్రవాద గ్రూపులుగా గుర్తించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి