iDreamPost

Gujarat:ప్రపంచ రికార్డు.. ఏకకాలంలో 108 ప్రాంతాల్లో..!

  • Published Jan 01, 2024 | 5:22 PMUpdated Jan 01, 2024 | 5:22 PM

ప్రస్తుతం ఎక్కడ చూసిన న్యూ ఇయర్ సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. చాలా మంది ఎవరికి తోచిన విధంగా వారు కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్తున్నారు. ఈ క్రమంలో గుజరాత్ కు చెందిన కొంతమంది తమదైన శైలిలో.. కొత్త సంవత్సరంలో అరుదైన రికార్డును సృష్టించారు. ప్రధాని నరేంద్ర మోడీ సైతం దీనిపై స్పందించి ప్రశంసలు కురిపించారు.

ప్రస్తుతం ఎక్కడ చూసిన న్యూ ఇయర్ సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. చాలా మంది ఎవరికి తోచిన విధంగా వారు కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్తున్నారు. ఈ క్రమంలో గుజరాత్ కు చెందిన కొంతమంది తమదైన శైలిలో.. కొత్త సంవత్సరంలో అరుదైన రికార్డును సృష్టించారు. ప్రధాని నరేంద్ర మోడీ సైతం దీనిపై స్పందించి ప్రశంసలు కురిపించారు.

  • Published Jan 01, 2024 | 5:22 PMUpdated Jan 01, 2024 | 5:22 PM
Gujarat:ప్రపంచ రికార్డు.. ఏకకాలంలో 108 ప్రాంతాల్లో..!

భారతీయ జీవన వ్యవస్థలో యోగ సాధనకు ప్రత్యేక స్థానం ఉంది. అందులో ముఖ్యంగా సూర్య నమస్కారాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ప్రతి రోజు ఉదయం లేవగానే ఈ సూర్య నమస్కారాలు చేయడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ సూర్యనమస్కారాలలో సర్వ రోగాలను నయం చేసే అద్భుతమైన శక్తులు ఉన్నాయట. అయితే, సాధారణంగా యోగ కేంద్రాలలో ఈ ఆసనాలను వేయిస్తూ ఉంటారు. యోగాలో పట్టు ఉన్నవారు వీటిని తరచూ వేస్తూ ఉండడం సహజం. కానీ, ఒకేసారి రాష్ట్రానికి చెందిన 108 ప్రాంతాల్లో.. ఏకంగా నాలుగు వేల మంది ఈ ఆసనాలను వేసి.. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుని, ఇప్పుడు యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించారు.. గుజరాత్ కు చెందిన కొందరు.

న్యూ ఇయర్ సందర్బంగా గుజరాత్ లోని ప్రసిద్ధ మోధేరా సూర్య దేవాలయంతో పాటు.. మరి కొన్ని ప్రాంతాలలో నాలుగు వేలకు మందికి పైగా.. ఈ సూర్య నమస్కార ప్రక్రియను ప్రదర్శించారు. వీరిలో చిన్న వయస్సు వారి నుంచి పెద్ద వయస్సు వారి వరకు అందరూ పాలు పంచుకున్నారు. మునుపెన్నడూ ఇటువంటి ఓ సామూహిక సూర్య నమస్కార కార్యక్రమం జరగలేదు. కాగా, 51 విభిన్న కేటగిరీల్లో అది కూడా ఇన్ని వేల మందితో సూర్యనమస్కారాలను ప్రదర్శించడం ఇదే మొదటి సారి. ఈ కార్యక్రమానికి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌, హోం మంత్రి హర్ష సంఘవి, వరల్డ్ రికార్డ్స్‌ ప్రతినిధి స్వప్నిల్ తదితరులు హాజరయ్యారు.

ఈ విషయమై స్వప్నిల్ మాట్లాడుతూ.. సూర్య నమస్కారాల విషయంలో గుజరాత్ సరికొత్త ప్రపంచ రికార్డ్ నమోదు చేసిందని పేర్కొన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఈ విషయమై వారిని ప్రశంసించారు. దీనికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ.. ”ఒక అరుదైన ఘనతతో 2024 సంవత్సరాన్ని గుజరాత్ రాష్ట్రం స్వాగతించింది. 108 వేదికలపై ఏకకాలంలో అత్యధిక మంది సూర్య నమస్కారాలు చేసి.. గుజరాత్ గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించింది. మన సంస్కృతిలో 108 సంఖ్యకు విశిష్ట ప్రాముఖ్యత ఉందన్న విషయం అందరికీ తెలుసు. ఐకానిక్ మోధేరా సూర్య దేవాలయం వేదికగా ఎంతోమంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యోగాలో, మన సాంస్కృతిక వారసత్వం పట్ల మనకున్న నిబద్ధతకు ఇది నిజమైన నిదర్శనం” అంటూ.. తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ చేశారు.

అంతే కాకుండ రోజు వారి దినచర్యలో ప్రతిఒక్కరు వీటిని అనుసరించాలని చెప్పారు. ఏదేమైనా, ఏక కాలంలో సామూహికంగా ఇటువంటి ఓ కార్యక్రమం చేపట్టడం అనేది అభినందించ తగిన విషయంగా భావించాలి. ప్రస్తుతం దీనికి సంబందించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇక వీటిని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మరి, అరుదైన ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి