iDreamPost
android-app
ios-app

ఈ చిన్నారిని గుర్తుపట్టారా? 20 ఏళ్లుగా ఇండస్ట్రీని ఏళుతున్న హీరోయిన్‌!

  • Published Dec 31, 2023 | 1:15 PM Updated Updated Dec 31, 2023 | 1:15 PM

Guess This Famous Heroine: పై ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి దాదాపు 20 ఏళ్లకు పైగా చిత్ర పరిశ్రమలో హీరోయిన్‌గా కొనసాగుతున్నారు. సౌత్‌లో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందుతున్నారు.

Guess This Famous Heroine: పై ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి దాదాపు 20 ఏళ్లకు పైగా చిత్ర పరిశ్రమలో హీరోయిన్‌గా కొనసాగుతున్నారు. సౌత్‌లో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందుతున్నారు.

  • Published Dec 31, 2023 | 1:15 PMUpdated Dec 31, 2023 | 1:15 PM
ఈ చిన్నారిని గుర్తుపట్టారా? 20 ఏళ్లుగా ఇండస్ట్రీని ఏళుతున్న హీరోయిన్‌!

 ఇండస్ట్రీలో హీరోయిన్‌గా అవకాశాలు రావటమే చాలా కష్టం. అలాంటిది వచ్చిన అవకాశాలను సరిగ్గా అందిపుచ్చుకుంటూ.. స్టార్‌ హీరోయిన్‌గా మారటం అన్నది మామూలు విషయం కాదు. అందం, అభినయంతో పాటు అదృష్టం కూడా ఉండాలి. ఇలా అన్ని చక్కగా ఉండి స్టార్‌ హీరోయిన్‌గా మారినా .. ఎక్కువ కాలం ఇండస్ట్రీలో కొనసాగుతామన్న గ్యారెంటీ లేదు. ఎందుకంటే.. ప్లాపులు, వయసుతో పాటు అవకాశాలు కూడా తగ్గిపోతాయి. అలా చాలా మంది హీరోయిన్లు పరిశ్రమకు దూరం అయ్యారు కూడా.

అయితే, కోటికి ఒక్కరు అన్నట్లు కొంతమంది మాత్రం. ప్లాపులు, వయసుతో సంబంధం లేకుండా ఏళ్లు గడిచినా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా కొనసాగుతున్నారు. అలాంటి వారిలో పై ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి కూడా ఒకరు. ఆమె తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సినిమాలు చేశారు. 1999లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి.. ఇప్పుడు 2023లో కూడా హీరోయిన్‌గా కొనసాగుతున్నారు. వయసు నాలుగు పదులు దాటినా మొదటి సినిమాలో ఉన్నట్లే అందంగా కనిపిస్తున్నారు.

heroine child pics

ఇప్పటికే ఆమె ఎవరో మీకు అర్థం అయిపోయి ఉంటది. పై ఫొటోలో ఉన్న చిన్నారి ప్రముఖ హీరోయిన్‌ త్రిష. ఆమె తండ్రిలో ఉన్నపుడు తీసిన ఫొటో అది. 1999లో వచ్చిన ‘ జోడి ’ మూవీతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. సినిమాలో హీరోయిన్‌ ఫ్రెండ్‌ క్యారెక్టర్‌ చేశారు. తర్వాత 2002లో వచ్చిన ‘‘ మౌనమ్‌ పెసియదే’’ అనే మూవీతో హీరోయిన్‌గా మారారు. వర్షం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి వచ్చారు. హీరోయిన్‌గా మారిన తక్కువ టైంలోనే అన్ని భాషల్లో స్టార్‌గా మారిపోయారు.

మధ్యలో సరైన హిట్లు లేక ఇబ్బంది పడ్డారు. అలాంటి సమయంలో 96 సినిమా ఆమెకు మళ్లీ బూస్ట్‌ అప్‌ ఇచ్చింది. మళ్లీ హీరోయిన్‌గా అవకాశాలు పెరిగిపోయాయి. త్రిష తాజాగా లియో మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇప్పుడు ఆమె తమిళంలో ఓ సినిమా.. మలయాళంలో రెండు సినిమాలు చేస్తున్నారు. ‘విడా ముయర్చి’ అనే చిత్రం శరా వేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. రామ్‌ అనే మూవీ పోస్టు ప్రొడక్షన్‌ పనుల్లో ఉంది. ఐడెంటిటీ అనే మలయాళ సినిమా కూడా చిత్రీకరణ జరుపుకుంటోంది.

ఇక, త్రిష పెళ్లి విషయంలో చాలా ఏళ్ల నుంచి ఓ చర్చ జరుగుతూనే ఉంది. ఆమె గతంలో ఓ బిజినెస్‌ మ్యాన్‌తో ఎంగేజ్‌మెంట్‌ చేసుకుంది. అనుకోని కారణాల వల్ల పెళ్లి జరగలేదు. ఇప్పుడు కూడా తరచుగా ఆమె పెళ్లిపై పుకార్లు షికార్లు చేస్తూ ఉన్నాయి. మరి, త్రిష సినిమా కెరీర్‌పై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişbetparkGrandpashabetgrandpashabetGrandpashabetMeritkingCasibomCasibomcasibomjojobet girişjojobetdeneme bonusu veren sitelerjojobetMadridbetMadridbetJojobet girişgrandpashabetJojobetjojobetgrandpashabetjojobetcasibomjojobetjojobetcasibomcasibom girişgrandpashabetholiganbetgrandpashabet güncel girişjojobetjojobet girişjojobet