iDreamPost

టానిక్ లిక్కర్ గ్రూప్స్ పై GST అధికారుల సోదాలు.. సంచలన విషయాలు వెలుగులోకి

హైదరాబాద్ నగరంలో జీఎస్టీ అధికారుల సోదాలు సంచలనం సృష్టిస్తున్నాయి. టానిక్ లిక్కర్ గ్రూప్స్ పై అధికారులు దాడులు చేయగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

హైదరాబాద్ నగరంలో జీఎస్టీ అధికారుల సోదాలు సంచలనం సృష్టిస్తున్నాయి. టానిక్ లిక్కర్ గ్రూప్స్ పై అధికారులు దాడులు చేయగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

టానిక్ లిక్కర్ గ్రూప్స్ పై GST అధికారుల సోదాలు.. సంచలన విషయాలు వెలుగులోకి

రాష్ట్ర ప్రభుత్వం మద్యం పాలసీని ప్రవేశ పెట్టి ఆ రూల్స్ ప్రకారంగా మద్యం షాపులకు అనుమతులు ఇస్తూ ఉంటుంది. ఎక్సైజ్ శాఖలో అక్రమాలు జరగడం మనం చూస్తూనే ఉంటాం. నిబంధనలకు విరుద్దంగా అనుమతులు ఇస్తూ పాలసీ విధానాలను తుంగలో తొక్కుతుంటాయి. ఇలాంటి వైన్ షాపులపై అధికారులు కొరఢా ఝుళిపిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్(జీఎస్టీ) అదికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తాజాగా టానిక్ లిక్కర్ గ్రూప్స్ పై దాడులు చేసిన అధికారులకు సంచలన విషయాలను వెలుగు చూశారు. ఏ మద్యం షాపుకు లేని వెసులుబాటును టానిక్ లిక్కర్ గ్రూప్ కు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

హైదరాబాద్ లో టానిక్ లిక్కర్ గ్రూప్ కు 11 ప్రాంచైజీలు రన్ అవుతున్నాయి. క్యూ బై టానిక్ పేరుతో మద్యం విక్రయాలు చేస్తోంది. అయితే వీటికి గత ప్రభుత్వం ఏ4 ఎలైట్ కింద లైసెన్స్ జారీ చేసిందని అదికారులు గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా లేని అనుమతులు టానిక్ బ్రాండ్ కు ఉన్నట్లు గుర్తించారు. ఇది ఎక్సైజ్ పాలసీకి విరుద్దంగా ఉందని జీఎస్టీ అధికారులు వెల్లడిస్తున్నారు. ఎక్సైజ్ పాలసీలో ఇటువంటి అనుమతి నోటిఫై చేయలేదని మద్యం షాపుల యజమానులు వెల్లడిస్తున్నారు. 11 క్యూ టానిక్ సిండికేట్లను అనిత్ రెడ్డి, అఖిల్ రెడ్డి అనే వ్యక్తులు నడిపించినట్లు జీఎస్టీ అధికారులు గుర్తించారు.

టానిక్‌ లిక్కర్ గ్రూప్స్‌ సిండికేట్‌కు సంబంధించి బోడుప్పల్, గచ్చిబౌలి, మాదాపూర్‌లో ముగ్గురు ఉన్నతాధికారుల కుటుంబ సభ్యుల పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ సీఎంవో అధికారి కుమారుడు, ఎక్స్‌జ్ ఉన్నతాధికారి కూతురు, మరో అడిషనల్ ఎస్పీ కూతురులకు టానిక్‌ లిక్కర్ గ్రూప్స్‌ సిండికేట్‌‌లో భాగస్వామ్యం ఉన్నట్లు జీఎస్టీ అధికారులు గుర్తించారు. కాగా లాటరీ ప్రక్రియ, పోటీ లేకుండా ఏ4 కేటగిరీ వైన్ షాపులకు నేరుగా లైసెన్సులు ఇచ్చే విధానమే ఏ4 ఎలైట్ లైసెన్స్. అయితే ఈ విధమైన ప్రత్యేక అనుమతులు మద్యం పాలసీలో లేకున్నప్పటికీ టానిక్ లిక్కర్ గ్రూపులకు ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి