iDreamPost

కోటీశ్వరులకు అడ్డాగా రిచ్‌మండ్ విల్లాస్! లడ్డుకే కోట్లు ఖర్చు!

కోటీశ్వరులకు అడ్డాగా రిచ్‌మండ్ విల్లాస్! లడ్డుకే కోట్లు ఖర్చు!

వినాయక చవితి అంటే లడ్డూ చాలా ఫేమస్. ఆ లడ్డూని వేలంపాటలో దక్కించుకోవడానికి చాలా మంది ప్రయత్నిస్తారు. కానీ డబ్బున్న కొందరికే ఆ అదృష్టం వరిస్తుందని అంటారు. ఇది ధనవంతుల పండుగ అని కూడా అంటారు. కానీ డబ్బు ఉంది కాబట్టి కొంటారు, కొనగలుగుతారు అని వేరు చేయడానికి లేదు. డబ్బు ఉంటే సరిపోదు.. దాన్ని బయటకు తీయడానికి చాలా ధైర్యం కావాలి. దానికి భక్తి, నిస్వార్ధం, సేవాగుణం వంటివి తోడైతేనే అది సాధ్యమవుతుంది. ఇక గణేష్ లడ్డూని అన్ని లక్షలు పెట్టి దక్కించుకోవడం కూడా భక్తే. దీని వల్ల వారికి ఎంత డబ్బు ఉంది అన్న దానికంటే కూడా ఎంత భక్తి ఉందో అనేది బయటపడుతుంది. నిజానికి డబ్బు అనేది ఒక చోట ఆగిపోకూడదు. ఏదో ఒక రూపంలో బయటపడుతూ ఉండాలి. ఈ ఏడాది హైదరాబాద్ లోని గణేష్ నిమర్జన వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. మరోవైపు లడ్డూల వేలంపాట కూడా అంతకంటే ఘనంగానే జరుగుతుంది. రియల్ ఎస్టేట్ భూముల మాదిరి లడ్డూ ధరలు రికార్డులు సృష్టిస్తోంది. ఎంతో విశిష్ట చరిత్ర కలిగిన బాలాపూర్ లడ్డూ ఈ ఏడాది రూ. 27 లక్షలు పలికింది.

ఇక రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలోని కీర్తి రిచ్‌మండ్ విల్లాస్ లోని సన్ సిటీలో అయితే లడ్డూ ధర ఏకంగా కోటి 26 లక్షల రూపాయలు పలికింది. తెలంగాణ చరిత్రలో లడ్డూ ఇంత ధర పలకడం ఇదే తొలిసారి. దీంతో ఇప్పుడు ఎవరీ రిచ్‌మండ్ కిడ్స్ అని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. గణేష్ లడ్డూ వేలంపాటతో రిచ్‌మండ్ విల్లాస్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అయిపోయింది. కోటి 26 లక్షలు పెట్టి లడ్డూ కొన్నారంటే వాళ్ళు ఎంత రిచ్ కిడ్స్ అయి ఉంటారు అని అనిపిస్తుంది కదూ. నిజమే వాళ్ళు రిచ్ కిడ్సే మరి. లడ్డూకే అంత రేటు పెట్టారంటే వాళ్ళు ఉంటున్న విల్లాలకి ఎంత రేటు పెట్టారో అన్న సందేహం మీకు వచ్చే ఉంటుంది. అవును బండ్లగూడ జాగీర్ లో ఉన్న కీర్తి రిచ్‌మండ్ విల్లాస్ లో ఒక్కో విల్లా రెండున్నర కోట్ల నుంచి 4 కోట్ల వరకూ ఉంటుంది. లగ్జరీ విల్లాలు అవి. అత్యాధునిక సదుపాయాలు, సౌకర్యాలు ఉంటాయి.

అన్నీ 4BHK విల్లాలే. 3400 చదరపు అడుగుల నుంచి 5400 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ విశాలమైన విల్లాలను రిచ్ పీపుల్ మాత్రమే సొంతం చేసుకోగలరు. ఒక్కసారి ఈ విల్లా కొనుగోలు చేస్తే జిమ్ కోసం ఊరి బయటకో, రోడ్డు మీదకో పోవాల్సిన పని లేదు. పిల్లలకి, పెద్దలకి సెపరేట్ గా స్విమ్మింగ్ పూల్స్, ఆటవిడుపు కోసం బ్యాడ్మింటన్ కోర్టు, టెన్నిస్, బాస్కెట్ బాల్ కోర్టులు, టేబుల్ టెన్నిస్, జాగింగ్, సైకిల్ ట్రాక్ వంటి సదుపాయాలు ఉన్నాయి. లైబ్రరీ, క్లబ్ హౌస్, కాన్ఫిరెన్స్ రూమ్ కూడా ఉన్నాయి. అంతేకాదు.. ఈ రిచ్‌మండ్ విల్లాస్ లోనే ఒక సూపర్ మార్కెట్, రెస్టారెంట్, మెడికల్ సదుపాయం వంటివి ఉన్నాయి. ఒక గెస్ట్ హౌస్ కూడా ఉంది. పవర్ బ్యాకప్ ఉంది.

ఇక భద్రత విషయానికొస్తే 24×7 ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. వర్షం నీరు నిల్వ చేయడం, మురికినీటిని శుభ్రం చేసే ప్లాంట్, గ్రీన్ పార్క్, సోలార్ లైటింగ్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఇన్ని సౌకర్యాలు, సదుపాయాలు ఉంటే అంతకు మించి ఇంకేం కావాలి చెప్పండి. అందుకే చాలా మంది వీటిని కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్నారు. పిల్లలకు ప్లే ఏరియా, పెద్దలకు ఆటవిడుపు, ఫుల్ సెక్యూరిటీ, చాలా వరకూ అక్కడే దొరుకుతుండడం వంటి కారణాల వల్ల విల్లాల మీద ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే 4,5 కోట్లు పెట్టి ఈ లగ్జరీ విల్లాలని సొంతం చేసుకుంటున్నారు.

ఇంత సౌండ్ పార్టీలు కాబట్టే గణేష్ లడ్డూని కోటి 26 లక్షలు పెట్టి కొన్నారు. అయితే ఇది ఒక వ్యక్తి కొన్నది మాత్రం కాదు. కొంతమంది వ్యక్తులు కలిసి కొన్నది. అది కూడా మహిళలే. ఆర్వీ దియా ఛారిటీ వాలంటీర్లే ఈ లడ్డూని కొనుగోలు చేశారు. మరి కోటి 26 లక్షలను ఏం చేస్తారు? ఈ ఏడాది అయిన ఖర్చుల్లో జమేసుకుంటారా? వచ్చే ఏడాది వినాయక చవితి ఉత్సవాలకు దాస్తారా? అంటే అదేమీ లేదు. వినాయక చవితి ఉత్సవాలకు, గణేష్ లడ్డూకి వచ్చిన డబ్బుకి అస్సలు సంబంధమే లేదు. వేరే ఎక్కడైనా అయితే వేలంపాటలో విక్రయించిన లడ్డూ డబ్బుని కమిటీ సభ్యులు తీసుకుంటారు. కానీ రిచ్‌మండ్ విల్లాస్ కి చెందిన వారు మాత్రం ఉత్సవాలకు సొంత డబ్బు పెట్టుకుంటారు. లడ్డూకి వచ్చిన డబ్బుని సేవా కార్యక్రమాలకు ఖర్చు పెడతారు. రిచ్‌మండ్ విల్లాస్ సొసైటీకి చెందిన మహిళలే ఈ ఏడాది కోటి 26 లక్షలు పెట్టి గణేష్ లడ్డూని కొనుగోలు చేశారు.

ఆర్వీ దియా ఛారిటబుల్ ట్రస్ట్ పేరుతో ఎన్జీవోలకు ఆర్థిక సహకారం అందజేస్తుంటారు. ఆర్వీ దియా ఛారిటబుల్ ట్రస్ట్ కి ఎన్జీవోలను రోజూవారీ ఆపరేషన్స్ ని సపోర్ట్ చేయడంలో ఘన చరిత్ర ఉంది. ఫండ్స్ రైజ్ చేసి ఆర్థికంగా ఎన్జీవోలకు అండగా నిలుస్తుంది. ఈ ట్రస్టులో సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు, పారిశ్రామికవేత్తలు, ప్రొఫెషనల్స్, వ్యాపారవేత్తలు, వ్యవసాయదారులు, సామాజిక కార్యకర్తలు, సీనియర్ సిటిజన్స్ వంటివారు వాలంటీర్లుగా ఉన్నారు. వీరంతా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డవారు. గత కొన్నేళ్లుగా వీరంతా గణేష్ లడ్డూని వేలంపాటలో వేస్తున్నారు.

బయట వ్యక్తులను కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తున్నారు. ఏటా గణేష్ లడ్డూని కొనుగోలు చేసి ఆ డబ్బుతో ఎన్జీవోలకి ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తున్నారు. ఆ డబ్బుతో పేదలకు మెడికల్ సపోర్ట్, పేద విద్యార్థులకు చదువు, నెలవారీ కిరాణా సరుకులు అందజేస్తారు. రిచ్‌మండ్ అంటే రిచ్ కిడ్స్ అనే కాదు.. మానవత్వం చూపడంలో కూడా రిచ్ కిడ్స్ అని నిరూపించుకున్నారు. మరి కోటి 26 లక్షలతో గణేష్ లడ్డూ కొనుగోలు చేసి ఆ డబ్బుని సేవాకార్యక్రమాలకు వినియోగిస్తున్న ఈ మహిళలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి