iDreamPost

Group-2 అభ్యర్థులకు శుభవార్త.. పోస్టుల సంఖ్య 750కి పైగా పెరిగే ఛాన్స్‌!

గ్రూప్ 2 ఉద్యోగాల కోసం ఎదురు చూసే నిరుద్యోగులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ లో త్వరలో గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నది. దీనికి సంబంధించిన ప్రక్రియపై సంబంధిత అధికారులు కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

గ్రూప్ 2 ఉద్యోగాల కోసం ఎదురు చూసే నిరుద్యోగులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ లో త్వరలో గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నది. దీనికి సంబంధించిన ప్రక్రియపై సంబంధిత అధికారులు కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

Group-2 అభ్యర్థులకు శుభవార్త.. పోస్టుల సంఖ్య 750కి పైగా పెరిగే ఛాన్స్‌!

గ్రూప్ 2 ఉద్యోగాల కోసం ఎదురు చూసే నిరుద్యోగులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ లో త్వరలో గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నది. దీనికి సంబంధించిన ప్రక్రియపై సంబంధిత అధికారులు కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గ్రూప్‌-1, గ్రూప్‌-2 నోటిఫికేషన్ల కోసం అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఆగస్టు నెలలో గ్రూప్ 2 నోటిఫికేషన్ ద్వారా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి 508 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా ఈ పోస్టుల సంఖ్య 750కి పెరగనున్నట్లు ఏపీపీఎస్సీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.

నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు జగన్ సర్కార్ శీగ్రగతిన చర్యలు తీసుకుంటోంది. త్వరలో టీచర్ ఉద్యోగాలకు సంబంధించి డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు సన్నద్ధమవుతోంది. దీంతో పాటు గ్రూప్ 2, గ్రూప్ 1 నోటిఫికేషన్లు సైతం విడుదల చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం ఆమోదం తెలిపిన 508 గ్రూప్ 2 పోస్టులను పెంచాలని ఉద్యోగార్థులు కోరుతుండడంతో సీఎం జగన్ ఆ దిశగా చర్యలు చేపట్టారు. మరికొన్ని పోస్టులను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ సంఖ్య 750 కి పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా గ్రూప్‌- 1 విభాగంలో డిప్యూటీ కలెక్టర్లు, డీఎస్పీ కేటగిరీ-II, అసిస్టెంట్‌ కమిషనర్‌, అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌ పోస్టులతో సహా పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. గ్రూప్‌-2 కేటగిరీ కింద డిప్యూటీ తహసీల్దార్లు, అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌, ఎక్సైజ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌-III, సబ్‌ రిజిస్ట్రార్‌ తో పాటు మరికొన్ని ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. దీంతో ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చేందుకు ఏపీపీఎస్సీ కసరత్తు చేస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి