iDreamPost

ముస్లిం మైనారిటీల అభివృద్దికి 126 కోట్లు విడుదల

ముస్లిం మైనారిటీల అభివృద్దికి  126 కోట్లు విడుదల

మైనారిటీల సంక్షేమానికి పెద్ద పీట వేస్తు, వారి అభ్యుదయానికి పాటుపడుతున్న ముఖ్యమంత్రి జగన్ మరోసారి రాష్ట్రంలోని మైనారిటీలకు తీపి కబురు అదించారు. రాష్ట్రంలోని నాలుగు జిల్లాల మైనారిటీల అభివృద్ది కోసం 126 కోట్లు విడుదల చేస్తున్నట్టు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి మహమద్ ఇలియాజ్ రిజ్వీ ఉత్తర్వులు జారీ చేశారు. 2019-20 సంవత్సరానికి గాను ఇవి మొదట విడత నిధులుగా విడుదల చెస్తునట్టు చెప్పుకొచ్చారు. ప్రధాన మంత్రి జన్ వికాస్ కార్యక్రమం పధకం కింద ఈ నిధులు వినియోగించనున్నట్లు తెలిపారు.

ఈ పథకం క్రింద కేంద్ర ప్రభుత్వ వాటా 75 కోట్లు కాగా , రాష్ట్ర ప్రభుత్వ వాట 51 కోట్లు ఉనట్ట్లు చెప్పుకొచ్చారు. మైనారిటి సంక్షేమ శాఖ ప్రత్యక కమీషనర్ నిధులు డ్రా చేసి ప్రభుత్వ మార్గ దర్శకాలకు అనుగుణంగా వినియోగించాలని వీటి పై సంబంధిత జిల్లా కలక్టర్లు పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రథమంగా ఈ నిధులు రాష్ట్రంలో అనంతపురం , కర్నూలు, చిత్తూరు , నెల్లురు జిల్లాల మైనారిటీల అభివృద్ది కోసం ఖర్చుపెట్టాలని సూచించారు. ఏది ఏమైనా కేంద్ర ప్రభుత్వం నుండి మైనారిటి సంక్షేమం కోసం ముఖ్యమంత్రి జగన్ నిధులు రాబట్టడం లో సఫలీకృత అయ్యారనే చెప్పాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి