iDreamPost

Cashless Treatment: కేంద్ర ప్రభుత్వ కొత్త పథకం..ఇకపై రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత చికిత్స..!

దేశంలో నిత్యం వందల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక ఈ ప్రమాదాల్లో ఎంతో మంది మరణిస్తున్నారు. మరెందరో తీవ్రంగా గాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాద మరణాల సంఖ్యను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది.

దేశంలో నిత్యం వందల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక ఈ ప్రమాదాల్లో ఎంతో మంది మరణిస్తున్నారు. మరెందరో తీవ్రంగా గాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాద మరణాల సంఖ్యను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది.

Cashless Treatment: కేంద్ర ప్రభుత్వ కొత్త పథకం..ఇకపై రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత చికిత్స..!

నిత్యం ఏదో ఒక్క ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు అనేవి జరగుతుంటాయి. అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, మద్యం తాగి వాహనం నడపడం, ట్రాఫిక్ రూల్స్ ను ఉల్లంఘించడం వంటి కారణాలతో ఈ ప్రమాదలు జరుగుతుంటాయి. ఈ ప్రమాదాల్లో నిత్యం ఎంతో మంది ప్రాణాలు కోల్పోతుంటారు. మరెంతో మంది అంగవైకల్యం పొందుతున్నారు. ఇది ఇలాంటే రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులకు చికిత్స అందకపోవడం కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి చేరిస్తే.. చికిత్సకు అవరసమైన డబ్బులు చెల్లిచకపోవడంతో ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఇలాంటి వాటిని నివారించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు కొందరు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు సమయానికి చికిత్స అందక ప్రాణాలు కోల్పోతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో రోడ్డు భద్రతను, ప్రజల ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారి ప్రాణాలు కాపాడేందుకు కొత్త పథకాన్ని తీసుకొచ్చింది.  ఈ కొత్త స్కీమ్ ద్వారా బాధితులకు వెంటనే వైద్య సేవలు అందనున్నాయి. అలా ప్రమాదంలో గాయపడిన వారి కోసం క్యాష్ లెస్ ట్రీట్మెంట్ గా ఓ పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ స్కీమ్ ద్వారా రోడ్డు ప్రమాదాల్లో గాయాలైన వారికి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా చికిత్స పొందవచ్చు.

Free treatment for road accident victims

కేంద్రం ఈ పథకాన్ని ప్రస్తుతం పైలట్ ప్రాజెక్ట్‌గా మాత్రమే ప్రవేశపెట్టబడుతోంది. పైలట్‌ ప్రాజెక్ట్ లో భాగంగా తొలుత చండీగఢ్‌లో ఈ స్కీమ్స్ ను తీసుకువస్తోంది. ఈ ఇక్కడ ప్రారంభించడం ద్వారా ఈ స్కీమ్ అనేది ఎలా పనిచేస్తుందో పర్యవేక్షించిన అనంతరం దేశవ్యాప్తంగా విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఏమైనా చిన్న చిన్న పొరపాటు ఉంటే సరి చేసుకుని మరింత ప్రణాళికతో ఈ ప్రాజెక్టను కొనసాగిస్తారు. మొత్తంగా ఈ  ప్రాజెక్టు విజయవంతమైతే.. దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల కారణంగా సంభవించే మరణాల గణనీయంగా తగ్గించవచ్చు. పలు నివేదికల ప్రకారం.. 2022లో దేశ వ్యాప్తంగా 4.61 లక్షల  రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో 1.68 లక్షల మరణిస్తుండగా…4.43 లక్షల మందికి తీవ్ర గాయాలు అవుతున్నాయి.

ఈ పథకం అమలులోకి వచ్చినట్లు అయితే రోడ్డు ప్రమాదాల బారిన పడిన వారికి తక్షణ చికిత్స అందడంతో పాటు వారి ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.ఈ పథకం ప్రకారం, ఇండియాలోని పౌరులు ఎవరైనా ప్రమాదానికి గురైతే వెంటనే వారిని సమీపంలోని ఏదైనా ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ బాధితుల ప్రాణాలను కాపాడటమే ప్రధాన లక్ష్యంగా ఆ ఆస్పత్రి వైద్యులు చికిత్స అందించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆ బాధితుడి  దగ్గర నుంచి కానీ, సాయం చేసిన వ్యక్తి దగ్గర నుంచి వైద్యులు ఒక్క రూపాయి కూడా వసూలు చేయకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆర్థిక పరమైన సమస్యలు నివారించేందుకు  ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది.

రోడ్డు  ప్రమాదాల గురించి మనం కాస్తా చర్చించినట్లు అయితే.. ఈ ప్రమాదాలు జరిగిన తరువాత కొన్ని గంటలు అత్యంత కీలకమైనవి. వీటినే గోల్డెన్ అవర్ అంటారు. ఈ  గోల్డెన్ అవర్ లో గాయపడిన వారికి చికిత్స అందించడం ద్వారా ప్రాణాలు నిలపెట్ట వచ్చు. ఈ గోల్డెన్‌ అవర్‌ దాటి ఆస్పత్రికి చేరుకోవడంలో ఆలస్యం అయితే.. వ్యక్తి చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి బాధితులందరూ ఒక్క రూపాయి కూడా చెల్లించే అవసరం లేకుండా వైద్యం పొందేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సరికొత్త పథకాన్ని తీసుకొచ్చింది.  మరి.. కేంద్రం తీసుకొచ్చిన ఈ కొత్త స్కీమ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి