iDreamPost

ఓటేసిన 104 ఏళ్ల పెద్దాయన.. ఈయనను చూసైనా మారండి!

సాధారణంగా ఎన్నికల విషయంలో అధికారులు ప్రత్యేక దృష్టి సారించే అంశాల్లో పోలింగ్ శాతం పెంచడం ఒకటి. కొందరు ఓటింగ్ రోజు.. ఓటు వేయడం బాధ్యత అనే విషయం మర్చి.. హాలిడేగా ఎంజాయ్ చేయాలని భావిస్తుంటారు. అలాంటి వారు 104 ఏళ్ల ఈ పెద్దాయన చూసి మారాలి.

సాధారణంగా ఎన్నికల విషయంలో అధికారులు ప్రత్యేక దృష్టి సారించే అంశాల్లో పోలింగ్ శాతం పెంచడం ఒకటి. కొందరు ఓటింగ్ రోజు.. ఓటు వేయడం బాధ్యత అనే విషయం మర్చి.. హాలిడేగా ఎంజాయ్ చేయాలని భావిస్తుంటారు. అలాంటి వారు 104 ఏళ్ల ఈ పెద్దాయన చూసి మారాలి.

ఓటేసిన 104 ఏళ్ల పెద్దాయన.. ఈయనను చూసైనా మారండి!

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. మొత్తం ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. ఇప్పటికే రెండు విడుతల్లో పలు రాష్ట్రాల్లో పోలింగ్ పూర్తైంది. మూడో విడత పోలింగ్ కు రంగం సిద్ధమైంది. అలానే నాలుగో విడత పోలింగ్ లో ఇంటి నుంచి ఓటు వేసే వారికి పోలింగ్ ప్రారంభమైంది. నాలుగో విడత పోలింగ్ లో రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఏపీకి చెందిన ఓ 104 ఏళ్ల తాత ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయనకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓటును వినియోగించుకునే విషయంలో ఆయనకు ఉన్న డెడికేషన్ కి అందరూ హ్యాట్సాఫ్ చెబుతున్నారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

సాధారణంగా ఎన్నికల విషయంలో అధికారులు ప్రత్యేక దృష్టి సారించే అంశాల్లో పోలింగ్ శాతం పెంచడం ఒకటి. అయితే కొన్ని ప్రాంతాల్లో నమోదు అవుతోన్న పోలింగ్ శాతం అధికారులను ఆందోళనకు గురి చేస్తోంది. పెద్ద ఎత్తున యువ ఓటర్ల పుట్టుకొస్తున్నా..పోలింగ్ బూత్ వరకు వచ్చి ఓటేసే వారి సంఖ్య తగ్గిపోతుంది. ఇది ముఖ్యంగా పట్టణాల్లో ఎక్కువగా ఉంది. ఓటింగ్ రోజు.. ఓటు వేయడం బాధ్యత అనే విషయం మర్చి.. హాలిడేగా ఎంజాయ్ చేయాలని భావిస్తుంటారు కొందరు. అయితే అలాంటి వారు ఓ తాతగారిని చూసి అంతా నేర్చుకోవాలి.. 104 ఏళ్ల వయస్సులోనూ ఓటేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. 18వ సారి ఓటు హక్కు వినియోగించుకుని తన ప్రత్యేకత చాటుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన రొంగల రాముడు అనే 104 ఏళ్ల పెద్దాయన ఓటును వినియోగించుకున్నారు. వయోవృద్ధులకు కేటాయించిన ఇంటి నుంచి ఓటు ద్వారా ఆయన తన ఓటును వినియోగించుకున్నారు. నిడదవోలులోని ఆయన ఇంటికి  పోలింగ్ అధికారులు బ్యాలెట్ బాక్సులు తీసుకొచ్చారు. దీంతో రాముడు ఇంటి నుంచి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈసారి  ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్  ఇంటి నుంచి ఓటు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. వయోవృద్ధులు అంటే 85 ఏళ్లు పైబడినవారికి, ఇతర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓటు ఎట్ హోమ్ కార్యక్రమం ప్రారంభమైంది.

ఈ నేపథ్యంలోనే ఈ 104 ఏళ్ల రాముడు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇలా మొత్తంగా ఆయన 18 సార్లు ఓటు హక్కు వినియోగించుకుని తన బాధ్యతను నిర్వర్తించాడు. అంతేకాక ఓటుపై తనకు ఉన్న డెడికేషన్ చూపించి.. ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ తాతయ్య. ఆయనకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. చాలా మంది ప్రశంస వర్షం కురిపిస్తున్నారు. అంతేకాక ఓటు వేయడంపై ఆసక్తి చూపించని వారు  ఆయనను చూసైన మారండి అంటూ పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఓటు ఎట్ హోం గురువారం నుంచే ప్రారంభమైంది.. ఇక,  మే13వ తేదీన పోలింగ్ జరగనుండగా.. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. మరి.. ఓటు విషయంలో తన బాధ్యతను నిర్వర్తించిన ఈ తాతపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి