iDreamPost

GPay యూజర్లకు గుడ్ న్యూస్.. ఇక విదేశాల్లోనూ పేమెంట్స్ చేయొచ్చు!

గూగుల్ పే యూజర్లకు శుభవార్త. ఆన్ లైన్ పేమెంట్స్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి విదేశాల్లోను పేమెంట్స్ చేసేలా వీలు కల్పించేందుకు ఎన్పీసీఐతో ఒప్పందం కుదుర్చుకుంది.

గూగుల్ పే యూజర్లకు శుభవార్త. ఆన్ లైన్ పేమెంట్స్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి విదేశాల్లోను పేమెంట్స్ చేసేలా వీలు కల్పించేందుకు ఎన్పీసీఐతో ఒప్పందం కుదుర్చుకుంది.

GPay యూజర్లకు గుడ్ న్యూస్.. ఇక విదేశాల్లోనూ పేమెంట్స్ చేయొచ్చు!

ప్రముఖ ఆన్ లైన్ పేమెంట్ సేవల సంస్థ గూగుల్ పే తమ యూజర్లకు శుభవార్తను అందించింది. కోట్లాది మంది యూజర్లను కలిగిన గూగుల్ పే ద్వారా రోజూ వేల ట్రాక్షన్స్ జరుగుతున్నాయి. చిన్న మొత్తాల నుంచి పెద్ద మొత్తాల వరకు కస్టమర్లు గూగుల్ పే ద్వారానే ట్రాక్షన్ చేస్తున్నారు. ఈ క్రమంలో గూగుల్ పే మరో కీలక నిర్ణయం తీసుకుంది. గూగుల్ పే తీసుకున్న ఈ నిర్ణయంతో కస్టమర్లకు ఆ కష్టాలు తీరనున్నాయి. ముఖ్యంగా విదేశాలకు వెళ్లే వారికి ఇది ఊరటనిచ్చే అంశం. తాజాగా గూగుల్ పే విదేశాల్లోను పేమెంట్స్ చేసేలా ఎన్పీసీఐతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నిర్ణయంతో విదేశాల్లో కూడా ఇబ్బందులు లేకుండా పేమెంట్స్ చేయొచ్చు.

ఆన్ లైన్ చెల్లింపుల సంస్థ గూగుల్ పే ఇక నుంచి విదేశాల్లోను యూపీఐ పేమెంట్స్ చేసేలా వీలు కల్పించనుంది. ఇందుకోసం నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఇంటర్నేషనల్‌ పేమెంట్స్‌ లిమిటెడ్‌ తో గూగుల్‌ పే అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంతో భారత్ నుంచి విదేశాలకు ఆన్ లైన్ పేమెంట్ చేసుకోవచ్చు. విదేశాల నుంచి భారత్ కు మనీ సెండ్ చేసుకోవచ్చు. ఈ సదుపాయం విదేశాల్లో స్థిరపడిన వారికి ఎంతో ఉపపయోగకరంగా ఉంటుంది. ఈ ఒప్పందం ద్వారా స్వదేశంలోని తమ వారికి సులువుగా డబ్బులు పంపుకునే వీలును గూగుల్ పే కల్పించింది.

ఈ ఒప్పందంతో విదేశాలకు వెళ్లే భారతీయులు నగదును వెంట తీసుకెళ్లే అవసరం తగ్గుతుందని గూగుల్ పే తెలిపింది. ఇంటర్నేషనల్‌ గేట్‌ వే ఛార్జీల భారం నివారించేందుకు సైతం ఈ ఒప్పందం సహాయపడుతుందని గూగుల్ పే వెల్లడించింది. గూగుల్ పే తీసుకున్న ఈ నిర్ణయంతో విదేశాల్లో చెల్లింపుల ప్రక్రియ సులభతరం అవుతుందని గూగుల్ పే వెల్లడించింది. గూగుల్ పే ద్వారా భారత్ వెలుపల పేమెంట్స్ చేయొచ్చని ఇంటర్నేషనల్‌ పేమెంట్స్‌ లిమిటెడ్‌ వెల్లడించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి