iDreamPost

ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ కి మంచి టైం

ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ కి మంచి టైం

చాలా కాలంగా ఛలో తర్వాత ఆ స్థాయి సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న నాగ శౌర్య కొత్త సినిమా వరుడు కావలెను ఈ నెల 15 విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. అదే రోజు అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో పాటు శ్రీకాంత్ కొడుకు రోషన్ పెళ్లిసందడి కూడా రానుండటంతో ఇది వాయిదా పడొచ్చనే అనుమానాలు లేకపోలేదు. 29కి వెళ్లొచ్చనే టాక్ ఉంది కానీ టీమ్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. రీతూ వర్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మ్యూజిక్ మంచి ట్రెండింగ్ లో ఉంది. ముఖ్యంగా తమన్ కంపోజ్ చేసిన దిగుదిగు నాధ పాట వివాదాలు తెచ్చినా కూడా బాగానే దూసుకుపోయింది. నిన్న వచ్చిన మరో ట్రాక్ కూడా ఆకట్టుకుంది.

నిజానికి దీనికి మరీ భారీ హైప్ లేదు. కానీ స్లో పాయిజన్ లాగా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకర్షించే దిశగా వెళ్తోంది. టీజర్ చూశాక అలాంటి అభిప్రాయమే కలిగింది. లవ్ స్టోరీకి కుటుంబ ప్రేక్షకులు ఇచ్చిన కలెక్షన్లు చూశాక అందరికీ ధైర్యం వచ్చేసింది. కంటెంట్ ఎలా ఉన్నా మెప్పించే అంశాలు ఓ నాలుగైదు పర్ఫెక్ట్ గా సెట్ చేసుకుని, మంచి బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఒకటి రెండు కంపోజ్ చేయించుకుంటే చాలు ఆటోమేటిక్ గా ప్రొడ్యూసర్ సేఫ్ అయిపోతున్నాడు. ఎస్ఆర్ కళ్యాణ మండపానికి జరిగింది కూడా ఇదే. సో వరుడు కావలెను కూడా ఇదే తరహా టాక్ తెచ్చుకుంటే మాత్రం నాగ శౌర్య అకౌంట్ లో హ్యాపీగా ఒక హిట్టు పడిపోతుంది.

లాక్ డౌన్ అయ్యాక కమర్షియల్ సినిమాల కన్నా ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ బాగా పే చేస్తున్నాయి. థియేటర్లు తెరిచాక మొదట్లో కొంత నిర్లిప్తత కనిపించినప్పటికీ తర్వాత పరిస్థితి కుదుటపడుతూ వచ్చింది. ఈ విషయంలో దేశంలో అందరికన్నా ముందు చొరవ తీసుకున్నది టాలీవుడ్ మాత్రమే. ఆ తర్వాతే హిందీ తమిళ పరిశ్రమలు కోలుకుని రిలీజ్ డేట్ల దిశగా అడుగులు వేశాయి. కరోనా థర్డ్ వేవ్ వచ్చే సూచనలు క్రమంగా తగ్గుతూ ఉండటంతో ఇకపై జనాన్ని కంటిన్యూ గా సినిమా హాళ్లకు రప్పించే సినిమాలు చాలా అవసరం. వరుడు కావలెను మరి పోటీకి సై అని 15కే కట్టుబడుతుందా లేక 29కి షిఫ్ట్ అవుతుందా వేచి చూడాలి

Also Read : 5 ఏళ్ళ తర్వాత వస్తున్న సినిమా ఏం చేస్తుందో

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి