iDreamPost

ఫస్ట్ టైమ్ సింగర్ గా మారిన హీరో విశాల్! ఏం సాంగ్ పాడాడో తెలుసా?

  • Author ajaykrishna Published - 10:30 AM, Fri - 14 July 23
  • Author ajaykrishna Published - 10:30 AM, Fri - 14 July 23
ఫస్ట్ టైమ్ సింగర్ గా మారిన హీరో విశాల్! ఏం సాంగ్ పాడాడో తెలుసా?

హీరోలన్నాక సినిమాలలో నటించడం వరకే మనకు తెలుసు. వాళ్లలో వాళ్లకే తెలియకుండా దాగి ఉండే టాలెంట్ ఏదొక రోజు బయటపెట్టే సమయం వస్తుంది. ఆ టైమ్ వచ్చిందంటే.. వాళ్ళను ఎవరు ఆపలేరు. ఇప్పటిదాకా ఇండస్ట్రీలో హీరోలుగా వెలుగుతున్నవారు సింగర్స్ గా అవతారం ఎత్తి.. సూపర్ హిట్ సాంగ్స్ పాడటం చూశాం. ధనుష్.. జూనియర్ ఎన్టీఆర్.. ఇలా చాలామంది ఒక్కసారి అయినా గొంతు సవరించారు. ఇప్పుడీ జాబితాలోకి హీరో విశాల్ చేరిపోయాడు. దాదాపు ఇరవై ఏళ్లుగా ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపుతో కొనసాగుతున్న విశాల్.. మొదటిసారి తన కొత్త సినిమా కోసం సాంగ్ పాడాడు.

ఆ సాంగ్ కూడా తమిళంలో కాకుండా తెలుగులో పాడటం విశేషం. యాక్షన్ హీరోగా విశాల్ కి మంచి పేరుంది. ఇప్పుడు ‘మార్క్ ఆంథోనీ’ పేరుతో మరో గ్యాంగ్ స్టర్ యాక్షన్ మూవీని సిద్ధం చేస్తున్నాడు. డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా.. వినాయకచవితి ఫెస్టివల్ సందర్బంగా సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. కాగా.. ఈ సినిమా నుండి ఫస్ట్ సింగల్ రిలీజ్ చేయడానికి రెడీ అయిపోయారు మేకర్స్. జులై 15న మొదటి పాటను రిలీజ్ చేయనుండగా.. దీనికి సంబంధించి క్రేజీ వీడియో షేర్ చేశాడు విశాల్. ఈ సినిమాకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ‘అదరదా మామ..’ అంటూ సాగే మాస్ సాంగ్ ని విశాల్ తో పాడించారు.

ఇదిలా ఉండగా.. ఇన్నేళ్ల కెరీర్ లో మొదటిసారి విశాల్ సాంగ్ పాడటం ఫ్యాన్స్ కి కూడా సర్ప్రైజింగ్ గా ఉంది. అందులోనూ డైరెక్ట్ తెలుగు సాంగ్. ఈ సాంగ్ గురించి విశాల్ ట్వీట్ చేస్తూ.. నేను ఫస్ట్ టైమ్ ఓ పాట పాడి మార్క్ ఆంథోనీ వరల్డ్ లో సింగర్ గా మారాను. తెలుగులో పాడటం ఆనందంగా ఉంది. మీ అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను అని విశాల్ చెప్పుకొచ్చాడు. ఇక ఫుల్ సాంగ్ జులై 15న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో రితూ వర్మ, ఎస్ జే సూర్య, సునీల్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమా.. తమిళ తెలుగు భాషలలో ఒకేసారి రిలీజ్ చేయనున్నారు. మరి విశాల్ మొదటిసారి సింగర్ గా పాడిన ప్రైమో వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి