iDreamPost

అందరూ పోగా ఒక్కడు మిగిలాడు! లోటున్నా ప్రూవ్ చేసుకోవాల్సిందే!

  • Author ajaykrishna Published - 02:49 PM, Wed - 13 September 23
  • Author ajaykrishna Published - 02:49 PM, Wed - 13 September 23
అందరూ పోగా ఒక్కడు మిగిలాడు! లోటున్నా ప్రూవ్ చేసుకోవాల్సిందే!

ఇటీవల రిలీజ్ డేట్స్ విషయంలో పాన్ ఇండియా మూవీస్ నుండి చిన్న సినిమాల వరకు అన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాయి. ఎప్పుడో డేట్ ఫిక్స్ చేసుకున్నా.. తీరా రిలీజ్ టైమ్ కి చాలా సినిమాలు పోటీగా వస్తున్నాయి. దీంతో ఒక్కసారిగా బాక్సాఫీస్ వద్ద థియేటర్స్, కలెక్షన్స్ డివైడ్ అయిపోతున్నాయి. ఒక వీక్ లో ఒకే సినిమా రిలీజ్ అనేది చాలా కష్టం అయిపోయింది. ఏదో లక్ బాగుండి.. పోటీగా వచ్చిన సినిమాలు వాయిదా పడితే గానీ సింగల్ రిలీజ్ అనేది కుదరట్లేదు. ఈ నెలలో హీరో విశాల్ కి అలాంటి అదృష్టం దక్కింది. ముందుగా పోటీ వస్తున్నాయని అనుకున్న పెద్ద సినిమాలన్నీ వాయిదా పడి ముందుకెళ్లిపోయాయి.

దీంతో ఇప్పుడు విశాల్ మార్క్ ఆంటోనీకి మంచి అవకాశం దొరికిందని చెప్పవచ్చు. ఇదివరకు సెప్టెంబర్ 15న రామ్ – బోయపాటిల స్కంద మూవీ పాన్ ఇండియా రిలీజ్ అనౌన్స్ అయ్యింది. దానితో పాటు లారెన్స్ హీరోగా చంద్రముఖి 2 కూడా పాన్ ఇండియా రిలీజ్ అనౌన్స్ జరిగింది. కానీ.. సెప్టెంబర్ 28 నుండి సలార్ వాయిదా పడటంతో ఒక్కసారిగా స్కంద.. సలార్ డేట్ కి షిఫ్ట్ అయిపోయింది. తీరా రిలీజ్ కి వారం ముందు చంద్రముఖి 2 సీజీ వర్క్ ప్రాబ్లెమ్ తో.. సెప్టెంబర్ 28కే వాయిదా పడింది. దీంతో సెప్టెంబర్ 15న ఉండాల్సిన క్లాష్.. సెప్టెంబర్ 28కి చేరింది. ఎందుకంటే.. ఆ డేట్ లో స్కంద, చంద్రముఖిలతో పాటు పెదకాపు కూడా రిలీజ్ అవుతోంది.

కట్ చేస్తే.. ఇప్పుడు మార్క్ ఆంటోనీకి పాన్ ఇండియా రిలీజ్ కాస్త ఈజీ అయినట్లే. ముఖ్యంగా తెలుగులో పెద్దగా పోటీనిచ్చే సినిమాలు లేవు. రామన్న యూత్, చాంగురే బంగారు రాజా.. ఈ రెండు సినిమాలు మార్క్ ఆంటోనీతో రిలీజ్ అవుతున్నాయి. కానీ.. ఉన్నవాటిలో మార్క్ ఆంటోనీకే బజ్ ఎక్కువగా ఉంది. ఒకే ఒక్క ట్రైలర్ తో విశాల్ ఆడియన్స్ దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. గ్యాంగస్టర్ యాక్షన్ కామెడీ జానర్ లో ఈ సినిమాని అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించగా.. ఎస్.జే. సూర్య కీలకపాత్ర పోషించాడు. కాగా.. మార్క్ ఆంటోనీ సౌత్ భాషలలో సెప్టెంబర్ 15న రిలీజ్ అవుతుండగా.. హిందీ వెర్షన్ మాత్రం సెప్టెంబర్ 22న రిలీజ్ అవుతున్నట్లు ప్రకటించారు. కోర్టు స్టే నుండి బయటపడిన ఈ సినిమాతో.. ఖచ్చితంగా సింగిల్ రిలీజ్ ని సరిగ్గా వాడుకొని, ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మార్క్ అబటోనీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి