iDreamPost

Salaar Teaser: సునామీకి సిద్ధమేనా? సలార్ టీజర్ సిద్ధం.. రిలీజ్ ఎప్పుడంటే?

Salaar Teaser: సునామీకి సిద్ధమేనా? సలార్ టీజర్ సిద్ధం.. రిలీజ్ ఎప్పుడంటే?

పాన్ ఇండియా లెవల్లోనే కాకుండా.. గ్లోబల్ స్థాయిలో ప్రభాస్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రభాస్ సినిమా వస్తోంది అంటే భారీ అంచనాలు ఏర్పడతాయి. అయితే ఇటీవల విడుదలైన రెండు సినిమాలు ప్రభాస్ అభిమానులను నిరాశ పరిచిన విషయం తెలిసిందే. రాధేశ్యామ్, ఆదిపురుష్ అంచనాలను అందుకోలేకపోయాయి. అయితే ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ప్రశాంత్ నీల్ మీదే ఆశలు పెట్టుకున్నారు. ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న సలార్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మళ్లీ ప్రభాస్ ను బాక్సాఫీస్ బాద్ షా చేసే చిత్రం సలారే అవుతుందని నమ్ముతున్నారు.

ఈ సినిమా నుంచి ఏ చిన్న అప్ డేట్ వచ్చినా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి పోస్టర్స్, స్టార్ కాస్ట్ కి సంబంధించిన అప్ డేట్స్ మాత్రమే వచ్చాయి. కానీ, ఇప్పుడు టీజర్ కి సంబంధించి చిత్ర బృందం అప్ డేట్ తీసుకొచ్చేసింది. 90 సెకన్ల సునామీని ఎదుర్కోవడానికి సిద్ధంగ ఉండండి అంటూ చెప్పుకొచ్చింది. టీజర్ ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నాం అని చెప్పేందుకు కౌంట్ డౌన్ పెట్టి మరీ అప్ డేట్ ఇచ్చారు. సలార్ టీజర్ ను జులై 6వ తేదీ తెల్లవారుజామున 5.12 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

ఈ వార్త వినగానే ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎందుకంటే ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సలార్ సినిమా టీజర్ ఎట్టకేలకు విడుదల కాబోతోంది. సలార్ సినిమా రికార్డుల వేట టీజర్ తోనే ప్రారంభం కానుంది అంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రభాస్ హీరో కావడం, కేజీఎఫ్ లాంటి అద్భుతమైన సినిమాలు తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ డైరెక్టర్ కావడంతో పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ, ఈ సినిమా స్టోరీకి సంబంధించి ఒక చిన్న క్లూ కూడా లేదు. ప్రశాంత్ నీల్ అయితే ఈ కథకు సంబధించిన ఏ చిన్న విషయం కూడా బయటకు పొక్కకుండా చూసుకున్నాడు.

ఇప్పటి వరకు వచ్చిన పోస్టర్స్, స్టార్ కాస్ట్ ని బట్టి చూస్తే.. ఇది ఒక హైవోల్టేజ్ సినిమా అని మాత్రం చెప్పచ్చు. ప్రశాంత్ నీల్ యూనివర్స్ తో సలార్ కి కూడా లింక్ ఉంటుంది అని మాత్రం గట్టి టాక్ నడుస్తోంది. కేజీఎఫ్ల్ లో రైడ్ సమయంలో బంగారాన్ని మైసూర్ కి షిఫ్ట్ చేశాం అని చెబుతారు. ఇక్కడ సలార్ లో ప్రభాస్ బండి నంబర్ చూస్తే మైసూరు రిజిస్ట్రేషన్ ఉంటుంది. అలా కేజీఎఫ్- సలార్ లింక్డ్ స్టోరీస్ అంటూ ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా అసలు కథ తెలియాలి అంటే.. సెప్టెంబర్ 28 వరకు ఆగాల్సిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి