iDreamPost

కల్కి నుండి మాస్ ట్విస్ట్! ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే వార్త!

Update From Kalki 2898 AD: ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగలాంటి వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఈ విషయం తెలిస్తే సంబరాలు చేసుకుంటారు.

Update From Kalki 2898 AD: ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగలాంటి వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఈ విషయం తెలిస్తే సంబరాలు చేసుకుంటారు.

కల్కి నుండి మాస్ ట్విస్ట్! ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే వార్త!

పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్ బేస్ గురించి, ఆయన స్టామినా గురించి ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల సలార్ సినిమాతో గట్టిగా కొట్టేశాడు. మరోసారి తన దెబ్బ ఎలా ఉంటుందో బాక్సాఫీస్ కి రుచి చూపించాడు. ఇప్పటివరకు ప్రభాస్ నుంచి వచ్చిన సినిమాలు ఒకెత్తు.. ఇప్పుడు రాబోతున్న కల్కి 2898ఏడీ సినిమా ఒకెత్తు అని చెప్పాలి. ఎందుకంటే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక కంప్లీట్ ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ కథతో రాబోతున్నారు. అందుకే ఈ సినిమాపై అంచనాలు మాత్రమే కాకుండా.. అభిమానులకు కొన్ని భయాలు కూడా ఉన్నాయి. వాటిని పటాపంచలు చేసే ఒక క్రేజీ వార్త అయితే ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలను ఊపేస్తోంది.

ప్రభాస్ కెరీర్ లో దాదాపు ఆరేళ్ల తర్వాత సలార్ సినిమాతో బాక్సాఫీస్ ని షేక్ చేశాడు. ఫ్యాన్స్ అందరికీ ఒక ఫుల్ మీల్స్ అందించినట్లు అయ్యింది. అయితే అక్కడికే సంతృప్తి చెందితే సరిపోదు. రాబోయే మూవీ దానికి రెట్టింపు సౌండ్ క్రియేట్ చేస్తుందని చెబుతున్నారు. కల్కి సినిమాపై ఫ్యాన్స్ లోనే కాకుండా మూవీ లవర్స్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీతో హాలీవుడ్ మార్కెట్ మీద కన్నేశారని గట్టిగానే టాక్ వినిపిస్తోంది. ఇండియన్ సినిమాని హాలీవుడ్ రేంజ్ కి తీసుకెళ్లే మూవీ అవుతుందని ఎప్పటి నుంచో అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ మూవీ ఎంతో టెక్నాలజీ మీద ఆధారపడి తీస్తున్నారు కాబట్టి.. చెప్పిన సమయానికి రిలీజ్ అవుతుందనే నమ్మకాలు అభిమానుల్లో లేవు.

A mass twist from Kalki

ఎక్కడ మళ్లీ వాయిదా అంటారో అనే భయంతో ఉన్నారు. ఇప్పటికీ కల్కీ మెగా షెడ్యూల్ జరుగుతోందని.. మూవీలో ఉన్న సూపర్ స్టార్స్ అందరూ షూటింగ్ లో పాల్గొంటున్నారనే వార్తలు విన్నాం. ఇంకా షూటింగ్ జరుగుతోంది అంటే.. చెప్పిన సమయానికి రిలీజ్ జరుగుతుందా? అని ప్రశ్నిస్తున్నారు. కానీ, ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకునే రేంజ్ లో ఒక క్రేజీ వార్త వినిపిస్తోంది. అదేంటంటే కల్కి సినిమా షూటింగ్ జరుగుతున్న మాట వాస్తవమే. అయితే అది పార్ట్ 1 షూటింగ్ కాదంట. పార్ట్ 2కి సంబంధించిన షూటింగ్ ఇప్పుడు జరుగుతోంది. అసలు పార్ట్ 1 సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తై పోయిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అంటే మొదటి భాగం షూటింగ్ ఎప్పుడో పూర్తైతే రిలీజ్ ని కచ్చితంగా చెప్పిన సమయానికే చేస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇప్పుడు జరుగుతోంది పార్ట్ 2 షూటింగ్ అంటున్నారంటే.. ఫస్ట్ పార్ట్ కి మించి పార్ట్ 2 ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మహానటి తర్వాత నాగ్ అశ్విన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కిస్తున్న మూవీ ఇది. ఇందులో ఎంతో గొప్ప టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ప్రభాస్ కూడా ఈ మూవీ కోసం గట్టిగానే కష్టపడ్డాడు. కల్కి పార్ట్ 1 ని ఎలా ముగిస్తారు అనే విషయంపై కూడా పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. అయితే కమల్ హాసన్ ఎంట్రీతో పార్ట్ 1 ముగుస్తుందని చెబుతున్నారు. అంటే పార్ట్ 2 మీద అంచనాలు రెట్టింపు చేసేలా ఒక మంచి పాయింట్ తో క్లోజ్ చేస్తారని చెబుతున్నారు. ఇప్పటికే పార్ట్ 2 సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యిందంటే.. రెండో భాగం కూడా త్వరగానే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. మరి.. కల్కి నుంచి వచ్చిన ఈ క్రేజీ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి