iDreamPost

చరణ్ తారక్ ఫ్యాన్స్ కు శుభవార్త

చరణ్ తారక్ ఫ్యాన్స్ కు శుభవార్త

ఇంకెప్పుడు అయిపోతుందో అసలు ఈ ఏడాది అయినా గుమ్మడికాయ కొడతారో లేదో అని టెన్షన్ తో ఎదురు చూస్తున్న జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ అభిమానులకు ఆర్ఆర్ఆర్ టీమ్ ఒక శుభవార్త చెప్పింది. రెండు పాటలు మినహా మొత్తం షూట్ అయిపోయిందని, ఆ సాంగ్స్ మాత్రమే బ్యాలన్స్ ఉన్నాయని క్లారిటీ ఇచ్చింది. ఇద్దరు హీరోలు డబ్బింగ్ కూడా చెప్పేశారట. మిగిలింది కూడా వీలైనంత వేగంగా ఫినిష్ చేస్తామని ఇందాక ట్విట్టర్ వేదికగా హామీ ఇచ్చింది. ఒక సంవత్సర కాలంగా చూసుకుంటే ఆర్ఆర్ఆర్ నుంచి వచ్చిన బెస్ట్ అప్ డేట్ ఇదేనని చెప్పొచ్చు. ముఖ్యమైన అనుమానాలకు దీంతో చెక్ పెట్టినట్టే

ఇదంతా ఒకే కానీ ముందు చెప్పిన అక్టోబర్ కి రిలీజ్ చేస్తారా లేదా అనేది మాత్రం ఇంకా తేలలేదు. రెండు పాటలు అన్నారు. అవి ఏ స్థాయిలో ఎవరెవరి కాంబినేషన్ లో తీయాలో ఎన్ని రోజులు ప్లాన్ చేసుకున్నారో చెప్పలేదు. కమర్షియల్ సినిమా కాదు కాబట్టి రాజమౌళి ఆషామాషీగా వీటిని తీయడు. చాలా పెద్ద తతంగమే ఉంటుంది. అక్టోబర్ ఎంతో దూరంలో లేదు. కేవలం మూడు నెలలు అంతే. వాస్తవిక కోణంలో ఆలోచిస్తే అది మీట్ కావడం అసాధ్యం. పైగా పోస్ట్ ప్రొడక్షన్ అయ్యాక ప్రమోషన్ చేయాలి. అన్ని బాషలకు ఒకేలా అంటే సరిపోదు. లాంగ్ టర్మ్ ప్లానింగ్ కావాలి. సో ఆర్ఆర్ఆర్ 2021లో రావడం డౌటే

నెక్స్ట్ కనిపించే బెస్ట్ ఆప్షన్ 2022 సంక్రాంతి. ఎలాగూ హరిహర వీర మల్లు రేస్ నుంచి తప్పుకుంది. అయ్యప్పనుం కోశియుమ్ రీమేక్ వచ్చినా పెద్దగా టెన్షన్ అక్కర్లేదు. సర్కారు వారి పాట రావడం కూడా డౌటే. సో ఆర్ఆర్ఆర్ కు పండగ సీజన్ బాగా కలిసి వస్తుంది. ఆలోగా కరోనా మొత్తం వెళ్ళిపోయి ఉంటుంది కాబట్టి దేశవ్యాప్తంగా థియేటర్లు వంద శాతం ఆక్యుపెన్సీతో నడుస్తాయి. ఇవన్నీ ఆలోచిస్తే అదే బెటర్ డేట్ అవుతుంది. జక్కన్న మనసులో ఏముందో ఇంకా తెలియదు. ఇప్పటికే శాటిలైట్, డిజిటల్, థియేట్రికల్ డీల్స్ అన్ని పూర్తి చేసుకున్న ఆర్ఆర్ఆర్ లాంటి విజువల్ గ్రాండియర్ ని ఎప్పడెప్పుడు చూస్తామా అనే ఆతృతను ఫ్యాన్స్ ఇంకొన్నాళ్ళు భరించక తప్పదు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి