iDreamPost

Google Pay: గూగుల్ పే యూజర్లకు ఒకటి కాదు.. రెండు శుభవార్తలు!

Google Pay: గూగుల్ పే యూజర్లకు ఒకటి కాదు.. రెండు శుభవార్తలు!

ప్రస్తుతం భారతదేశంలో నగదు రహిత లావాదేవీలు ఎంతగా పెరిగిపోయాయో చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రతి చిన్న అవసరానికి కూడా యూపీఐ యాప్స్ ద్వారానే పేమెంట్స్ చేస్తున్నారు. యూపీఐ యాప్స్ లో గూగుల్ పే బాగా ఆదరణ పొందింది. ఈ యాప్ ఎంట్రీనే ఒక సంచలనంగా చెప్పచ్చు. మొదట్లో ప్రతి ట్రాన్సాక్షన్ కు ఒక్క రూపాయి నుంచి వెయ్యి రూపాయల వరకు క్యాష్ బ్యాక్ ఇస్తూ.. నేరుగా అకౌంట్లలోనే డిపాజిట్ చేశారు. అలా గూగు ల్ పే ఎంతో మంది యూజర్లను సొంతం చేసుకుంది. ఇప్పుడు తమ యూజర్ల కోసం రెండు శుభవార్తలను తీసుకొచ్చింది.

ఒకటి మీరు గూగుల్ పే ద్వారా మీరు ఎలాంటి పిన్ ఎంటర్ చేయకుండానే డబ్బుని ట్రాన్స్ ఫర్ చేయచ్చు. అదే యూపీఐ లైట్ ఫీచర్ ను గూగుల్ పే కూడా తీసుకువచ్చింది. దీని ద్వారా మీరు మీ గూగుల్ పే వాలెట్ కి 2000 యాడ్ చేసుకుని పేమెంట్స్ చేయచ్చు. ఎలాంటి పిన్ లేకుండా మీరు గరిష్టంగా రూ.200 వరకు పే చేయచ్చు. ఇందుకోసం మీరు గూగుల్ పే యాప్ ఓపెన చేసిన తర్వాత మీ ప్రొఫైల్ పిక్ పై క్లిక్ చేయాలి.

ఆ తర్వాత మీరు యాక్టివేట్ యూపీఐ లైట్ మీద క్లిక్ చేయాలి. అలా చేసిన తర్వాత మీకు డబ్బు యాడ్ చేసుకునే ఆప్షన్ వస్తుంది. అలా మీరు యూపీఐ లైట్ ద్వారా పిన్ లేకుండా పేమెంట్స్ చేయచ్చు. రెండో శుభవార్త ఏంటంటే.. గూగుల్ పే ద్వారా మీరు మీ సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవచ్చు. అది కూడా ఎలాంటి రుసుము చెల్లించకుండానే చూడచ్చు. సాధారణంగా సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవాలి అంటే మీరు ఎంతో కొంత చెల్లించాల్సి ఉంటుంది.

గూగుల్ పేలో సిబిల్ స్కోర్ చెక్ చేసుకునేందుకు.. గూగుల్ పే యాప్ లో ఆఖరకు స్క్రోల్ చేయండి. అక్కడ చెక్ యూవర్ సిబిల్ స్కోర్ అని ఉంటుంది. అక్కడ క్లిక్ చేశాక మీరు పేరును ఎంటర్ చేయమని అడుగుతుంది. పాన్ కార్డ్ లో ఉన్న మీ పేరును ఎంటర్ చేయాలి. తర్వాత క్లిక్ చేయగానే మీ సిబిల్ స్కోర్ వస్తుంది. నిజానికి సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవాలని ఎంతో మందికి ఉంటుంది. కానీ, మనీ కట్టాలని చాలా మంది ఆ విషయం జోలికి వెళ్లరు. ఇప్పుడు గూగుల్ పే ద్వారా ఫ్రీగా సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి