iDreamPost

వీడియో: కోహ్లీని ఆటపట్టించిన మ్యాక్స్‌వెల్‌! అచ్చం దింపేశాడు!

  • Published Mar 21, 2024 | 12:56 PMUpdated Mar 21, 2024 | 12:56 PM

Glenn Maxwell, Virat Kohli: శుక్రవారం నుంచి స్టార్ట్‌ అయ్యే ఐపీఎల్‌ 2024 సీజన్‌ తొలి మ్యాచ్‌లో సీఎస్‌కేతో ఆర్సీబీ తలపడనుంది. అయితే.. ఈ మ్యాచ్‌ కోసం కోహ్లీ తీవ్రంగా శ్రమిస్తుంటే.. మ్యాక్స్‌వెల్‌ మాత్రం కోహ్లీని ఆటపట్టిస్తున్నాడు. అదేంటో ఇప్పుడు​ చూద్దాం..

ఐపీఎల్‌ 2024 సీజన్‌ రేపటి నుంచి ప్రారంభం కానుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో శుక్రవారం చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్‌ పండుగకు తెరలేవనుంది. ఎప్పటిలాగే ఈ సీజన్‌ కోసం కూడా క్రికెట్‌ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాదాపు రెండున్నర నెలల పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానులకు అసలు సిసలైన క్రికెట్‌ మజాను అందించే ఐపీఎల్‌ ఫీవర్‌ అప్పుడే ఇండియన్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌కు ఎక్కేసింది. ఈ సీజన్‌లో సత్తా చాటేందుకు అన్ని టీమ్స్‌ కూడా నెట్స్‌ విపరీతంగా ప్రాక్టీస్‌ చేస్తున్నాయి.

తొలి మ్యాచ్‌ ఆడబోతున్న ఆర్సీబీ టీమ్‌ కూడా నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. స్టార్‌ ఆటగాళ్లైన విరాట్‌ కోహ్లీ, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ సైతం తమ బ్యాటింగ్‌కు మరింత పదును పెడుతున్నారు. ఈ క్రమంలో మ్యాక్స్‌వెల్‌ ఫుల్‌ కామెడీతో విరాట్‌ కోహ్లీని ఆటపట్టించాడు. విరాట్‌ కోహ్లీ, మ్యాక్స్‌వెల్‌ ఎంతో సరదాగా ఉంటారనే విషయం తెలిసిందే. టీమిండియాలో ఆడుతున్న సమయంలో కానీ, ఐపీఎల్‌ ఆడుతున్నప్పుడు కానీ కోహ్లీ ఆఫ్‌ ది ఫీల్డ్‌ చాలా సరదాగా ఉంటాడు. అందరిని ఆటపట్టిస్తూ.. కొంతమంది ఆటగాళ్లను ఇమిటేట్‌ చేస్తూ.. ఫన్నీ ఫన్నీగా ఉంటాడు. అయితే.. ఈ సారి ఆ రోల్‌ను మ్యాక్సీ తీసుకున్నాడు.

అందరిని ఇమిటేట్‌ చేసే విరాట్‌ కోహ్లీని తాను ఇమిటేట్‌ చేసి అదరగొట్టాడు. విరాట్‌ కోహ్లీ నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలో నెట్స్‌ వెనుక నిల్చున్న మ్యాక్స్‌వెల్‌.. కోహ్లీ బ్యాటింగ్‌ స్టైల్‌తో పాటు అతని బాడీ లాంగ్వేజ్‌, వాకింగ్‌ స్టైల్‌ను అద్బుతంగా ఇమిటేట్‌ చేసి.. అచ్చం కోహ్లీలానే కనిపించాడు. ముఖ్యంగా ఛాతీ ముందు పెట్టి నడిచే సీన్‌ అయితే సూపర్‌ అనే చెప్పాలి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన క్రికెట్‌ ఫ్యాన్స్‌ తెగ నవ్వుకుంటున్నారు. కోహ్లీని భలే ఇమిటేట్‌ చేశాడంటూ మెచ్చుకుంటున్నారు. మరి కోహ్లీని మ్యాక్సీ ఇమిటేట్‌ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి