iDreamPost

ఒకరితో ప్రేమ.. మరొకరితో పెళ్లి.. చివరికి దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన ప్రియురాలు!

పెళ్లి మండపంలో ప్రియుడికి షాకిచ్చింది ప్రియురాలు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. ఒకరిని ప్రేమించి.. మరొకరితో పెళ్లికి సిద్ధమైన ప్రియుడికి పెళ్లి మండపంలో దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది ప్రేయసి.

పెళ్లి మండపంలో ప్రియుడికి షాకిచ్చింది ప్రియురాలు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. ఒకరిని ప్రేమించి.. మరొకరితో పెళ్లికి సిద్ధమైన ప్రియుడికి పెళ్లి మండపంలో దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది ప్రేయసి.

ఒకరితో ప్రేమ.. మరొకరితో పెళ్లి.. చివరికి దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన ప్రియురాలు!

ప్రేమ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు కొందరు యువకులు. ముందు పరిచయం చేసుకుని ఆ తర్వాత ప్రేమ పేరుతో నమ్మించి శారీరకంగా వాడుకుని ముఖం చాటేస్తున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ద్రోహానికి పాల్పడుతున్నారు. ప్రేయసి ఉండగానే మరొకరితో పెళ్లికి సిద్ధమవుతున్నారు. చివరికి ఈ విషయం తెలిసి ప్రియురాలు ఎంటర్ కావడంతో ఆ ప్రియుడికి దిమ్మతిరిగే షాక్ తగులుతోంది. ఈ తరహా ఘటనే కేరళలో చేటుచేసుకుంది. కోజిక్కోడ్ కు చెందిన అక్షయ్ అనే యువకుడు మంగళూరుకు చెందిన యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. పెళ్లి జరుగుతుండగా మాజీ ప్రియురాలు ప్రవేశించడంతో ప్రియుడు షాక్ తిన్నాడు. ఆ తర్వాత పెళ్లి మండపంలో హైడ్రామా చోటుచేసుకుది.

కేరళకు చెందిన అక్షయ్ సంవత్సరం క్రితం ఓ పెళ్లి వెబ్ సైట్ ద్వారా మైసూర్ కు చెందిన యువతితో పరిచయం ఏర్పర్చుకున్నాడు. ఆ తర్వాత పరిచయం కాస్త ప్రేమగా మారింది. అలా కొంత కాలం తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఆ తర్వాత ఆ యువతికి కనిపించకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ప్రియుడి అసలు రంగు తెలుసుకున్న ఆ యువతి గతేడాది డిసెంబర్ లో కేరళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక ఈ కేసు నుంచి తప్పించుకున్న అక్షయ్ మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యాడు. తన ప్రేమ వ్యవహారాన్ని బయటపడకుండా చాకచక్యంగా వ్యవహరించి మంగళూరులోని బీరి గ్రామానికి చెందిన యువతితో పెళ్లి నిశ్చయించుకున్నాడు.

శుక్రవారం కర్ణాటక-కేరళ సరిహద్దు బీరిలోని ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాల్‌లో పెళ్లి చేసేందుకు కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. బంధువులు, సన్నిహితుల మధ్య అక్షయ్ వధువు మెడలో తాళి కట్టాడు. ఈ సమయంలోనే మాజీ ప్రియురాలు పెళ్లి మండపంలోకి ఎంటర్ అయి బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. పెళ్లి మండపంలో చోటుచేసుకున్న ఈ హైడ్రామాతో వధువు, కుటుంబ సభ్యులు షాకయ్యారు. కల్యాణమండపంలో అక్షయ్ మాజీ ప్రియురాలు ప్రత్యక్షమై తనను ప్రేమించి మరొకరి మెడలో తాళి కడతావా అంటూ నిలదీసింది. అక్కడి నుంచి తప్పించుకునేందుకు అక్షయ్ తనకు ఆరోగ్యం బాగోలేదని ఆస్పత్రికి తీసుకెళ్లాలని నాటకానికి తెరలేపాడు. దీంతో బంధువులు అక్షయ్‌ను తమ వెంట తీసుకుని అక్కడి నుంచి జారుకున్నారు. మరి ఒకరిని ప్రేమించి.. మరొకరితో పెళ్లికి సిద్ధమైన ఆ యువకుడిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి