iDreamPost

ప్రియురాలి కంప్లైంట్ తో బయటపడిన ఎమ్మెల్యే రాసలీలలు.. తొందరపాటు చర్య అంటున్న ఎమ్మెల్యే

ప్రియురాలి కంప్లైంట్ తో బయటపడిన ఎమ్మెల్యే రాసలీలలు.. తొందరపాటు చర్య అంటున్న ఎమ్మెల్యే

ప్రియురాలి కంప్లైంట్ తో ఎమ్మెల్యే రాసలీలలు బయటపడ్డాయి. ప్రేమపేరుతో మోసంచేశాడని పేర్కొంటూ సోమాలిక దాస్ (29) అనే యువతి ఒడిశాలోని జగత్‌సింఘ్‌పూర్‌ జిల్లా తిర్తోల్‌ ఎమ్మెల్యే, బీజేడీ నాయకుడు బిజయశంకర దాస్‌ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. సోమాలిక ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పలు సెక్షన్ల కింద ఎమ్మెల్యేపై కేసులు నమోదు చేసి, విచారణ చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను పరిశీలించగా.. ఎమ్మెల్యే బిజయశంకర దాస్ – సోమాలిక పరస్పర అంగీకారంతో రిజిస్టర్ వివాహం చేసుకోవాలని భావించారు. అందుకోసం జగత్ సింగ్ పూర్ జిల్లా రిజిస్టార్ కార్యాలయంలో వివాహానికి కావాల్సిన కాగితాలతో రిజిస్టర్ మ్యారేజ్ కు మే 17 – 2022 న దరఖాస్తు చేసుకున్నారు.

జూన్ 17వ తేదీకి వివాహానికి దరఖాస్తు చేసుకుని నెలరోజులు కావడంతో సోమాలిక రిజిస్టర్ ఆఫీసుకు వెళ్లింది. ప్రియుడి కోసం ఎదురుచూసింది. మూడు గంటలపాటు అతని కోసం ఎదురుచూసి.. ఫోన్ చేసినా స్పందించకపోవడంతో నిరాశకుగురైంది. అతని వైఖరితో షాకయింది. ఇద్దరి అంగీకారంతోనే వివాహానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నాక.. బిజయశంకర్ అక్కడికి రాకపోవడంపై అనుమానం వ్యక్తం చేసింది. అతను కిడ్నాప్ అయి ఉండాలి లేదా.. తనను మోసం చేసి ఉండాలని ఆవేదన చెందింది. వెంటనే జరిగినదంతా వివరిస్తూ.. పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు చేసింది. కాగా.. నిన్న సోమాలిక ఎమ్మెల్యేపై మరో ఆరోపణ చేసింది. అతను ఐదుగురితో కలిసి సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నాడని పోలీసులకు మరో కంప్లైంట్ చేసింది. పోలీసులు తనకు న్యాయం చేస్తారని భావిస్తున్నానని అంటూ.. ప్రియుడితో చనువుగా దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఎమ్మెల్యే బిజయ్ శంకరదాస్ సోమాలిక ఫిర్యాదులపై స్పందించారు. ఇదంతా ఆమె తొందరపాటు చర్యేనని, ప్రకటించిన మేరకు సోమాలికను పెళ్లాడుతానని ఆదివారం బహిరంగంగా ప్రకటించారు. రిజిస్టర్ మ్యారేజ్ కు దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లో ఎప్పుడైనా పెళ్లిచేసుకునే వీలుందన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. మరో 60 రోజులు గడువు ఉండగా.. మంచిరోజు, ముహూర్తం చూసుకుని పెళ్లి చేసుకోనున్నట్లు స్పష్టం చేశారు. తన తల్లి ఆరోగ్యం కూడా బాలేనందున పెళ్లికి సమయం పడుతుందని ఎమ్మెల్యే బిజయ్ చెప్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి