iDreamPost

ఈ యువతి కసబ్ ని పట్టించింది.. కానీ ప్రభుత్వం తనను మర్చిపోయింది.. నేటికి కూడా

  • Published Nov 27, 2023 | 2:17 PMUpdated Nov 27, 2023 | 2:17 PM

26/11 ఉగ్రదాడి దేశాన్ని నేటికి కూడా వెంటాడే ఓ పీడకలలా మిగిలిపోయింది. ఈ దారుణానికి ఒడికట్టిన ఉగ్రవాది కసబ్ ను ఉరి తీశారు. అయితే కసబ్ కు ఉరి శిక్ష పడేలా చేసిన బాలికకు సాయం చేస్తానని మాట ఇచ్చిన ప్రభుత్వం ఇంకా దాన్ని నిలుపుకోలేదు. ఆ వివరాలు.

26/11 ఉగ్రదాడి దేశాన్ని నేటికి కూడా వెంటాడే ఓ పీడకలలా మిగిలిపోయింది. ఈ దారుణానికి ఒడికట్టిన ఉగ్రవాది కసబ్ ను ఉరి తీశారు. అయితే కసబ్ కు ఉరి శిక్ష పడేలా చేసిన బాలికకు సాయం చేస్తానని మాట ఇచ్చిన ప్రభుత్వం ఇంకా దాన్ని నిలుపుకోలేదు. ఆ వివరాలు.

  • Published Nov 27, 2023 | 2:17 PMUpdated Nov 27, 2023 | 2:17 PM
ఈ యువతి కసబ్ ని పట్టించింది.. కానీ ప్రభుత్వం తనను మర్చిపోయింది.. నేటికి కూడా

26/11 ముంబయి కాల్పుల ఘటనతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనలో 58 మంది మరణించగా వందలాది మంది గాయపడ్డారు. ఈ నరమేధానికి నిన్నటితో అనగా నవంబర్ 26, ఆదివారంతో 15 ఏండ్లు పూర్తయ్యాయి. ఈ ఘటన చోటు చేసుకున్న సమయంలో ఒక బాలిక పేరు దేశవ్యాప్తంగా మారు మోగిపోయింది. ఎందుకంటే నాటి మారణహోమంలో ప్రాణాలతో బయటపడినవారిలో చాలామంది ఉగ్రవాదులను గుర్తుపట్టలేదు. మరికొందరు గుర్తుపెట్టినా బయటకు వచ్చి చెప్పేంత ధైర్యం చేయలేదు. కానీ ఒక బాలిక మాత్రం నిర్భయంగా ముందుకు వచ్చి.. సాక్ష్యం చెప్పింది. అయితే నేటికి కూడా ప్రభుత్వం ఆ బాలికకు సాయం చేయలేదు. ఇంతకు ఆ బాలిక ఎవరు.. ప్రస్తుతం తను ఏం చేస్తుంది వంటి వివరాలు..

26/11 దాడిగా పిలిచే నాటి మారణహోమం.. భారతదేశాన్ని వెంటాడే ఓ పీడకలలా మిగిలిపోయింది. ఆ దాడిలో పాల్గొన్న టెర్రరిస్ట్ అజ్మల్ కసబ్ కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పింది దేవిక అనే బాలిక. అప్పుడు ఆమె వయసు కేవలం 9 సంవత్సరాలు మాత్రమే. నాటి ఘటనలో ఆమె కాలిలో బుల్లెట్ దిగి.. తీవ్ర గాయం అయ్యింది. అయినా సరే ఏమాత్రం భయపడకుండా.. కర్రల సాయంతోనే కోర్టుకి వచ్చి.. అతడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పింది దేవిక. ఫలితంగాను ఉగ్రవాది కసబ్ కు నాడు ఉరిశిక్ష పడింది.

ఈ క్రమంలో కసబ్ కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన దేవిక ధైర్యాన్ని ప్రశంసించిన నాటి ప్రభుత్వం.. ఆమెకు అనేక హామీలిచ్చింది. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు.. ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చింది. కానీ నేటి వరకు కూడా వాటిని నెరవేర్చలేదు. ఇప్పుడు దేవిక వయసు 24 సంవత్సరాలు.. చదువు కూడా పూర్తి చేసే ప్రయత్నంలో ఉంది. కానీ నేటికి కూడా ప్రభుత్వం నుంచి తనకు ఎలాంటి సాయం అందలేదు.  మరి ఇంకెన్నాళ్లు ఇలా నాన్చుతుందో చూడాలి.

ఎవరీ దేవిక..

దేవిక తండ్రి నట్వర్‌లాల్ ముంబయిలోని కొలబాలో డ్రై‌ఫ్రూట్స్ వ్యాపారం చేసేవాడు. నవంబరు 26, 2008లో ఆమె పుణెలో ఉన్న తన పెద్ద అన్నను చూసేందుకు తండ్రి, చిన్న అన్నతో కలిసి రైల్వే స్టేషన్‌కు వచ్చింది. ఇంతలో భారీగా పేలుళ్లు. ఈ ఘటనలోనే ఓ బుల్లెట్ దేవిక కుడి కాలులోకి దూసుకెళ్లింది. దీంతో, ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది. దాదాపు ఆరు సర్జరీల తర్వాత కోలుకుంది. పోలీసుల విచారణలో ఆమె ఉగ్రవాది కసబ్‌ను గుర్తించింది.

అయితే మొదట్లో ఆమె ధైర్యాన్ని అంతా మెచ్చుకున్నారు. క్రమేనా ఆమెను, ఆమె కుటుంబికులను దూరంగా ఉంచడం మొదలుపెట్టారు. చివరికి దేవిక పెద్ద అన్నయ్య తన వివాహానికి కూడా తన కుటుంబ సభ్యులను ఎవరిని పిలవలేదు. ఈ ఘటన తర్వాత దేవిక తండ్రి దుకాణం మూయక తప్పలేదు.

ఈ ఘటన వల్ల దేవిక అనేక స్కూల్స్ మారాల్సి వచ్చింది. తను 26/11లో ప్రత్యక్ష సాక్షి అని తెలిసి చాలా స్కూల్లలో సీటు ఇవ్వలేదు. దీంతో కొన్నాళ్లు ఆమె చదువుకు కూడా దూరమైంది. కొంతమంది సామాజికవేత్తలు పోరాటంతో ఆమెకు సీటు లభించింది. అయితే, స్కూల్లో విద్యార్థులు, టీచర్లు ఆమెతో మాట్లాడటానికి ఇష్టపడేవారు కాదు. కానీ అన్ని అడ్డంకులను దాటుకుని చదువును కొనసాగిస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి