iDreamPost

విద్యార్థునులకు మెట్రోలో ఉచిత ప్రయాణం!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నిక నవంబర్ 30 జరగనున్నాయి. గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహిళ ఓటర్లను ఆకర్షించేందుకు వారికి పలు హామీలను ఇస్తున్నాయి ప్రధాన పార్టీలు.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నిక నవంబర్ 30 జరగనున్నాయి. గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహిళ ఓటర్లను ఆకర్షించేందుకు వారికి పలు హామీలను ఇస్తున్నాయి ప్రధాన పార్టీలు.

విద్యార్థునులకు మెట్రోలో ఉచిత ప్రయాణం!

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అనేక రకాల సౌకర్యాలు కల్పిస్తుంటాయి. ముఖ్యంగా మహిళలు, బాలికలకు, వృద్ధులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తుంటాయి. ఇక ఎన్నికల వేళ పార్టీలు అనేక ఉచిత హామీలు ప్రకటిస్తుంటాయి. ఇప్పటికే కర్నాటక రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించారు. అలానే ఆడవారికి మరికొన్ని పథకాలు ఆ రాష్ట్రంలో అమలు అవుతున్నాయి. ఇక తెలంగాణలో విద్యార్థులనులకు  మెట్రోలో ఉచిత ప్రయాణం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించబోతుంది. ఇప్పటికే ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేసింది. తాజాగా విద్యార్థులకు మెట్రోలో ఉచిత ప్రయాణం కల్పిస్తామని తెలిపేందుకు సిద్ధమయ్యారు.

తెలంగాణలో ఎన్నిక వాతావరణం చాలా హీట్ మీద ఉంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక మేనిఫెస్టోలో లో కూడా పోటీపడి హామీలను ప్రకటించారు. ఇక కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల పేరుతో మేనిఫెస్టోను విడుదల చేసింది. విద్యార్థినిలకు స్కూటీలు, ఇస్తామని, ల్యాప్ టాప్ లిస్తామని అంటున్నా కాంగ్రెస్ పార్టీ.. వారికే మరో కీలక హామీ ఇవ్వబోతోంది. 14 ఏళ్లు నిండి, చదువుకుంటున్నా బాలికలందరికీ మెట్రో ప్రయాణాన్ని ఉచితం చేస్తామని కాంగ్రెస్ చెప్పబోతోంది. పదో తరగతి నుంచి పీహెచ్డీ చేసే విద్యార్థినుల వరకు అన్ని స్థాయిల్లోని  వారికి ఈ సౌకర్యాన్ని వర్తింపజేస్తామని చెపుతోంది. ఈ మేరకు తన ఎన్నికల మేనిఫెస్టోలో హామీలను పొందుపర్చాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.  ఈ నేపథ్యంలోనే ప్రజా మేనిఫెస్టో పేరుతో తయారవుతున్న ఈ ప్రణాళిక కోసం కాంగ్రెస్ పార్టీ తన కసర్తును పూర్తి చేసింది.

మాజీ మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో కమిటీ ఇప్పటికే పలుమార్లు సమావేశమై అనేక అంశాల విషయంలో తుది రూపు తీసుకొచ్చింది. ఈ కమిటీ తయారు చేసిన ముసాయిదా మేనిఫెస్టోను టీపీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జీ మాణిక్ రావ్ ఠాక్రే,పార్టీ వ్యూహా కర్త సునీల్  ల పరిశీలనకు పంపారని, ఈ నెల 14న పార్టీ మేనిఫెస్టో అధికారికంగా విడుదలవుతుందని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. ఈ  సారి ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించే పథకాలకు కాంగ్రెస్ అధిక ప్రాధాన్యమిస్తోంది. మహిళలు, వృద్ధులు, పేద వర్గాలకు చెందిన ఓట్లను రాబట్టుకునే పనిలో కాంగ్రెస్  ఉంది. మేనిఫెస్టోలో కూడా అన్ని వర్గాల ఓట్లు సంపాదించేలా పథకాలను ప్రతిపాదిస్తోంది. ఏపీలో అమలవుతున్న అమ్మ ఒడి తరహా పథకాన్ని ప్రతిపాదించే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి