iDreamPost

వీడియో: కోహ్లీ లేని లోటు ఒక్క షాట్‌తో తీర్చిన బుమ్రా! చూస్తే ఫిదా..

  • Published Mar 08, 2024 | 7:09 PMUpdated Mar 08, 2024 | 7:09 PM

Jasprit Bumrah Cover Drive: జస్ప్రీత్‌ బుమ్రా.. ఈ పేరు చెప్పగానే అందరికీ యార్కర్లు, బౌన్సర్లు గుర్తుకు వస్తాయి. కానీ, ఇప్పటి నుంచి బుమ్రా అంటే కేవలం బౌలింగ్‌ మాత్రమే కాదు.. ఈ మాట ఎందుకు అంటున్నామో తెలియాలంటే.. పూర్తిగా చదవండి.

Jasprit Bumrah Cover Drive: జస్ప్రీత్‌ బుమ్రా.. ఈ పేరు చెప్పగానే అందరికీ యార్కర్లు, బౌన్సర్లు గుర్తుకు వస్తాయి. కానీ, ఇప్పటి నుంచి బుమ్రా అంటే కేవలం బౌలింగ్‌ మాత్రమే కాదు.. ఈ మాట ఎందుకు అంటున్నామో తెలియాలంటే.. పూర్తిగా చదవండి.

  • Published Mar 08, 2024 | 7:09 PMUpdated Mar 08, 2024 | 7:09 PM
వీడియో: కోహ్లీ లేని లోటు ఒక్క షాట్‌తో తీర్చిన బుమ్రా! చూస్తే ఫిదా..

ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదోవ టెస్టులో టీమిండియా పటిష్టస్థితిలో నిలిచింది. గురువారం ప్రారంభమైన మ్యాచ్‌లో టాస్‌ తొలి ఇన్నింగ్స్‌కు దిగిన ఇంగ్లండ్‌ను కేవలం 218 పరుగులకే ఆలౌట్‌ చేసిన భారత్‌.. తొలి ఇన్నింగ్స్‌కు దిగి ఇంగ్లండ్‌పై ఆధిపత్యం చెలాయించింది. రోహిత్‌ శర్మ, శుబ్‌మన్‌ గిల్‌ సెంచరీలతో చెలరేగగా.. యశస్వి జైస్వాల్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, దేవదత్‌ పడిక్కల్‌ హాఫ్‌ సెంచరీలతో సత్తా చాటడంతో టీమిండియా భారీ స్కోర్‌ దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే టీమిండియా 255 పరుగుల లీడ్‌ సాధించింది. అయితే.. టీమిండియా ఇన్నింగ్స్‌లో బౌలర్ల కూడా బ్యాట్‌తో సత్తా చాటుతున్నారు.

కుల్దీప్‌ యాదవ్‌, జస్ప్రీత్‌ బుమ్రాలు రెండో రోజే టీమిండియా ఆలౌట్‌ కాకుండా అడ్డుకున్నారు. కుల్దీప్‌ యాదవ్‌ 55 బంతుల్లో 2 ఫోర్లతో 27 పరుగులు, బుమ్రా 55 బంతుల్లో 2 ఫోర్లతో 19 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. మూడో రోజు కూడా వీరిద్దరు బ్యాటింగ్‌ కొనసాగిస్తారు. అయితే.. ఈ మ్యాచ్‌లో బుమ్రా ఆడిన ఒక షాట్‌ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఆ షాట్‌ చూస్తే ఏ క్రికెట్‌ అభిమానికైనా టీమిండియా స్టార్‌ బ్యాటర్‌, గాడ్‌ ఆఫ్‌ కవర్‌ డ్రై విరాట్‌ కోహ్లీ గుర్తుకు రావాల్సిందే. పైగా బుమ్రా ఆ కవర్‌ డ్రై ఆడింది స్టార్‌ బౌలర్‌ మార్క్‌ వుడ్‌ బౌలింగ్‌లో. ఇన్నింగ్స్‌ 118వ ఓవర్‌లో తొలి బంతికే బుమ్రా అద్భుతమైన కవర్‌ డ్రైవ్‌ ఆడాడు. ఆ షాట్‌ చూస్తూ.. ఎవరు కూడా బుమ్రా ఒక బౌలర్‌ అని అనుకోరు. కచ్చితంగా ఒక స్కిల్డ్‌ క్వాలిటీ బ్యాటర్‌ అనే అనుకుంటారు. అంత పర్ఫెక్ట్‌గా కవర్‌ డ్రై కొట్టాడు బుమ్రా. ప్రస్తుతం బుమ్రా కొట్టిన ఆ కవర్‌ డ్రైవ్‌ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 218 పరుగులకే ఆలౌట్‌ అయింది. ఓపెనర్‌ జాక్‌ క్రాలే ఒక్కడే 79 పరుగులతో రాణించాడు. మిగతా బ్యాటర్లంతా విఫలం అయ్యారు. టీమిండియా బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ 5, రవిచంద్రన్‌ అశ్విన్‌ 4, జడేజా ఒక వికెట్‌ సాధించారు. ఇక తొలి ఇన్నింగ్స్‌కు దిగిన టీమిండియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్లు కోల్పోయి 473 పరుగులు చేసింది. ప్రస్తుతం టీమిండియా 255 పరుగుల లీడ్‌లో ఉంది. మూడో రోజు ఈ లీడ్‌ మరింత పెరగొచ్చు. ప్రస్తుతం కుల్దీప్‌ యాదవ్‌ 27 పరుగులతో అలాగే జస్ప్రీత్‌ బుమ్రా 19 పరుగులతో నాటౌట్‌గా మిగిలారు. మరి ఈ మ్యాచ్‌లో మార్క్‌ వుడ్‌ బౌలింగ్‌తో బుమ్రా కొట్టిన కవర్‌ డ్రైవ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి