iDreamPost

Geethanjali: గీతాంజలి మళ్లీ రాబోతుంది రిలిజ్‌ డేట్‌ ఫిక్స్‌.. ఎప్పుడంటే!

  • Published Feb 28, 2024 | 2:18 PMUpdated Feb 28, 2024 | 2:22 PM

టాలీవుడ్ హీరోయిన్ గీతాంజలి తాజాగా నటిస్తున్న చిత్రం "గీతాంజలి మళ్ళీ వచ్చింది". ఈ సినిమా గురించి ఈ మధ్య ఎక్కువగా వార్తలు వింటున్నాం. ఇక ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్.

టాలీవుడ్ హీరోయిన్ గీతాంజలి తాజాగా నటిస్తున్న చిత్రం "గీతాంజలి మళ్ళీ వచ్చింది". ఈ సినిమా గురించి ఈ మధ్య ఎక్కువగా వార్తలు వింటున్నాం. ఇక ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్.

  • Published Feb 28, 2024 | 2:18 PMUpdated Feb 28, 2024 | 2:22 PM
Geethanjali: గీతాంజలి మళ్లీ రాబోతుంది రిలిజ్‌ డేట్‌ ఫిక్స్‌.. ఎప్పుడంటే!

2014లో వచ్చిన గీతాంజలి సినిమాకు మంచి ఆదరణ లభించింది. టెలివిజన్ ఎప్పుడు వేసిన కూడా మంచి టీఆర్పి రేటింగ్ తో దూసుకుపోతూ ఉంటుంది. ఇక మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత “గీతాంజలి మళ్ళీ వచ్చింది” అనే టైటిల్ తో .. ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాకు నిర్మాతగా కోన వెంకట్ వ్యవహరిస్తున్నారు. అయితే, ఒకప్పుడు మంచి విజయాలతో స్టార్ స్టేటస్ ను చూసిన కోన వెంకట్ గత కొంతకాలంగా సరైన హిట్స్ చూడలేదనే చెప్పి తీరాలి. అయితే, ఆయన వరుస ప్లాప్స్ లో ఉన్న కూడా .. హిట్ సాధించిన సినిమా అంటే అది “గీతాంజలి” సినిమానే. ఇక అదే ఆయన చివరి హిట్ కూడా అయింది. ఇక ఇప్పుడు మళ్ళీ అదే సినిమాకు సిక్వెల్ గా “గీతాంజలి మళ్ళీ వచ్చింది” అంటూ .. ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అయితే, తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్.

“గీతాంజలి మళ్ళీ వచ్చింది” సినిమా ట్రైలర్ కొన్ని చర్చల మధ్య ఇటీవల రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ మధ్య కాలంలో హర్రర్ చిత్రాలకు బాగా క్రేజ్ పెరగడంతో.. అందరు ఇదే బాటలో సాగుతున్నారు. అయితే, తెలుగులో ఈ మధ్య కాలంలో వచ్చిన హర్రర్ చిత్రాలన్నీ కూడా సీరియస్ యాక్షన్ తో సాగిపోయినవే. కానీ, గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమాలో మాత్రం హర్రర్ కామెడీ ఉండబోతుందట. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ ను చూసిన ఆడియన్స్ ఈ సినిమాపై భారీ ఎక్స్పెక్టషన్స్ పెట్టుకున్నారు. అసలు ఈ సినిమా ట్రైలర్ ను కొత్తగా స్మశానంలోనే లాంచ్ చేద్దాం అనుకుని. కొన్ని డిస్కషన్స్ తర్వాత ప్లేస్ మార్చుకున్నారు. ఇక తాజాగా ఈ సినిమా థియేటర్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాను ఏప్రిల్ 11న తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

కాగా, “గీతాంజలి మళ్ళీ వచ్చింది” చిత్రంలో శ్రీనివాస్‌ రెడ్డి కథనాయకుడిగా నటిస్తుండగా.. అంజలి లీడ్ రోల్ చేయనున్నారు. ఇక వీరితో పాటు సత్యం రాజేశ్‌, షకలక శంకర్‌, అలీ కొన్ని ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. అంతేకాకుండా ఈ సినిమా అంజలి 50వ సినిమాగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టనుందనే టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాకు శివతుర్లపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఎంవీవీ సినిమాస్‌ బ్యానర్‌తో కలిసి కోన ఫిలిం కార్పొరేషన్‌ బ్యానర్‌పై.. కోన వెంకట్ ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ సినిమా విడుదల తర్వాత ఎటువంటి టాక్ సంపాదించుకుంటుందో వేచి చూడాలి. మరి, “గీతాంజలి మళ్ళీ వచ్చింది” మూవీ రిలీజ్ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి