iDreamPost

సంగం డైయిరీ వ్యవహారంలో కొత్త ట్విస్ట్‌

సంగం డైయిరీ వ్యవహారంలో కొత్త ట్విస్ట్‌

సంగం డైయిరీ వ్యవహారంలో సరికొత్త ట్విస్ట్‌ చోటు చేసుకుంది. టీడీపీ మాజీ ప్రజా ప్రతినిధి ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ చైర్మన్‌గా ఉన్న సంగం డెయిరీలో అవినీతి, అక్రమాలు చేటుచేసుకున్నాయని నిర్థారణ కావడంతో ప్రభుత్వం ఈ డెయిరీని ఏపీ డెయిరీ అభివృద్ధి కార్పొరేషన్‌ పరిధిలోకి తీసుకువస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంపై కోర్టులకు వెళ్లే అలవాటు ఉన్న టీడీపీ నేతలు.. సంగం వ్యవహారంలోనూ కోర్టును ఆశ్రయించారు. డెయిరీని ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావడాన్ని సవాల్‌ చేస్తూ డెయిరీ డైరెక్టర్లు హైకోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో 19ను కొట్టివేయాలని ఆ పిటిషన్‌లో కోరారు.

సంగం డెయిరీలో అక్రమాలు, అవకతవకలు జరిగాయనే ఫిర్యాదుపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు. దర్యాప్తులో అక్రమాలు, నిధులు దారి మళ్లించడం సహా అనేక అక్రమాలు జరిగాయని ఏసీబీ అధికారులు తేల్చారు. ఈ వ్యవహారంపై డెయిరీ చైర్మన్, టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధుళిపాళ్ల నరేంద్ర కుమార్, సహా డెయిరీ ఉన్నత స్థాయి సిబ్బందిపై కేసులు నమోదు చేశారు. వారిని అరెస్ట్‌ చేసి.. రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం ధూళిపాళ్ల రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్నారు. తనపై ఏసీబీ పెట్టిన కేసును కొట్టివేయాలని ఆయన కూడా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

సంగం డెయిరీ భవిష్యత్, పాడి రైతుల ప్రయోజనాల దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం.. డెయిరీని ఆంధ్రప్రదేశ్‌ డెయిరీ డెవెలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ పరిధిలోకి తీసుకువస్తూ నిన్న సోమవారం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జీవో 19ను జారీ చేసింది. డెయిరీ రోజు వారీ కార్యకలాపాలను పర్యవేక్షించే బాధ్యతలను తెనాలి సబ్‌కలెక్టర్‌కు అప్పగించింది. ఈ నిర్ణయంపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. తాజాగా ఈ రోజు డెయిరీ డైరెక్టర్లు కోర్టును ఆశ్రయించారు. మరి కోర్టులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.

Also Read : అవినీతి ఎఫెక్ట్ : ధూళిపాళ్ల చేజారిన సంగం డెయిరీI

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి