iDreamPost

బ్రేకింగ్: గంటా శ్రీనివాస రావు రాజీనామాకు ఆమోదం!

Ganta Srinivasa Rao: మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంట శ్రీనివాస రావు రాజీనామాకు ఆమోదం లభించింది. ఆయన రాజీనామను ఆమోదిస్తూ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆఫీస్ ను ప్రకటన వెలువడింది.

Ganta Srinivasa Rao: మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంట శ్రీనివాస రావు రాజీనామాకు ఆమోదం లభించింది. ఆయన రాజీనామను ఆమోదిస్తూ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆఫీస్ ను ప్రకటన వెలువడింది.

బ్రేకింగ్: గంటా శ్రీనివాస రావు రాజీనామాకు ఆమోదం!

టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు..తన సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన రాజీనామాను అసెంబ్లీ స్వీకర్ తమ్మినేని సీతారాం ఆమోదించారు. ఈ మేరకు స్పీకర్ కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. 2019 ఎన్నికల్లో గంటా శ్రీనివాస్ రావు విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి గెలుపొందారు. ప్రస్తుతం విశాఖ నార్త్ అసెంబ్లీ శాసన సభ్యుడిగా ఉన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రయివేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధపడింది. దానికి వ్యతిరేకంగా రాజీనామా చేశానని గంటా రెండేళ్ల క్రితం చెప్పారు. అయితే కార్మికులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా చేయలేదని ఆనాడు ప్రచారం జరిగింది.

రాజకీయాల్లో తన ఉనికి కాపాడుకునేందుకు గంటా డ్రామా ఆడారని చాలా మంది అభిప్రాయపడ్డారు. అంతేకాక ఆయన నిలకడలేని వ్యక్తి అని, పలు పార్టీల్లో చేరి బయటికొచ్చిన చరిత్ర ఉందని పలువురు అంటుంటారు. గంట శ్రీనివాస రావు 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంతో ఆయనకు మంత్రి పదవి వచ్చింది. ఆ తరువాత జరిగిన పరిణామాలతో టీడీపీ చేరి 2014లో ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా చంద్రబాబు హాయాంలో మంత్రిగా పని చేశారు.

2019లో కూడా విశాఖ నార్త్ నుంచి టీడీపీ తరపున పోటీ చేసి.. ఎమ్మెల్యేగా గెలిచి..కొనసాగుతున్నారు. అయితే ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేయాలో అర్థం కాక తర్జనభర్జన పడుతున్నారని టాక్ వినిపిస్తోంది. గత ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో గట్టెక్కారు. దీంతో జనానికి తనపై అయిష్టత ఏర్పడిందని భావించి సరైన అసెంబ్లీ స్థానం కోసం వెతుకులాటలో ఉన్నారని పొటికల్ సర్కిల్ లో టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో గంటా రాజీనామాకు ఆమోదముద్ర పడటం విశాఖ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. మరి.. గంటా రాజీనామా ఆమోదం పొందడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి