iDreamPost

బాబు మాటని లెక్క చేయని గంటా! లైన్ లో మరి కొంతమంది నేతలు!

Ganta Srinivasa Rao, Chandrababu: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి ఆదేశిస్తే.. గీత దాటే వారు ఉండరు. అది ఒకప్పుడు మాట.. కానీ నేడు పరిస్థితులు మారాయి. ఆయన గీసిన గీతను దాటి ఎవరికి వారే సొంత గీతను గీసుకుంటున్నారు టీడీపీ నేతలు. తాజాగా గంటా శ్రీనివాస్ రావు వ్యాఖ్యలు బాబుకు గంట మోగించని టాక్ వినిపిస్తోంది.

Ganta Srinivasa Rao, Chandrababu: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి ఆదేశిస్తే.. గీత దాటే వారు ఉండరు. అది ఒకప్పుడు మాట.. కానీ నేడు పరిస్థితులు మారాయి. ఆయన గీసిన గీతను దాటి ఎవరికి వారే సొంత గీతను గీసుకుంటున్నారు టీడీపీ నేతలు. తాజాగా గంటా శ్రీనివాస్ రావు వ్యాఖ్యలు బాబుకు గంట మోగించని టాక్ వినిపిస్తోంది.

బాబు మాటని లెక్క చేయని గంటా! లైన్ లో మరి కొంతమంది నేతలు!

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో ఇక్కడి రాజకీయం రసవత్తరంగా మారుతోంది. 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా అధికార వైఎస్సార్ సీపీ ఎన్నికల సమరంలో దూసుకెళ్తోంది. ఇదే సమయంలో పొత్తులలో భాగంగా సీట్ల విషయంలో టీడీపీ,జనసేన పార్టీలు కాలయాపన చేస్తున్నాయి. ఇదే వారి కొంప ముంచుతుంది. ఇప్పటి వరకు ఎవరికి ఎన్ని సీట్లు, ఎక్కడి నుంచి ఎవరు పోటీ అనే విషయంపై క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో పలు నియోజకవర్గాల్లో ఎవరికి వారే తామే అభ్యర్థి అంటే  తామే అని జనసేన,  టీడీపీ నేతలు ప్రకటించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు చెప్పిన మాటలను ఆ పార్టీ నేతలు విన్నకుండా షాకులు ఇస్తున్నారు. తాజాగా టీడీపీ గంట శ్రీనివాస్ కూడా అదే పరోక్షంగా బాబుకు గంట మోగించారు.

గంట శ్రీనివాస రావు.. టీడీపీ కీలక నేతల్లో ఒకరు.  ఎన్నికలు  జరిగిన ప్రతిసారి ఆయన కొత్త నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అలానే 2019 విశాఖ నార్త్ అసెంబ్లీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. అయితే తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణను టార్గెట్ గా చేసుకుని  టీడీపీ అధిష్టానం గంటాను చీపురపల్లికి వెళ్లాలని సూచించింది. అయితే విశాఖ జిల్లాను వదిలి వెళ్లడం ఆయనకు ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే చంద్రబాబు మరోస్థానం నుంచి పోటీచేయాలని ఆదేశించడంపై గంటా గరం గరం అవుతున్నారు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. తనకు మాత్రం  ఈసారి విశాఖపట్నం నుంచే పోటీ చేయాలని ఉందని చెప్పుకొచ్చారు.

గురువారం గంటా  శ్రీనివాస రావు మీడియా తో మాట్లాడుతూ..”నాకు విశాఖపట్నం జిల్లాలోనే పోటీ చేయాలని ఉంది.  నేను విశాఖ నార్త్ నుంచి పోటీ చేయడం లేదు. విశాఖ నార్త్ కు వేరే ఇన్ ఛార్జ్ ని పెట్టమన్నాను. అలానే నన్ను చీపురుపల్లి వెల్లమని పార్టీ ఆదేశించింది. కానీ అక్కడి వెళ్లడంపై నేను నిర్ణయం తీసుకోలేదు. అది నాకు 150 కిలోమీటర్ల దూరం. అంతేకాక జిల్లా కూడా వేరు కావడంతో ఆలోచనలో పడ్డాను” అని చెప్పుకొచ్చారు.

అలానే ఇంకా టీడీపీ, జనసేన సీట్ల లెక్కతేలలేదని, కేవలం నాలుగు సీట్లపై మాత్రమే స్పష్టత వచ్చిందని తెలిపారు. వారం రోజుల్లో జాబితా ప్రకటించే అవకాశం ఉందని గంట పేర్కొన్నారు. తానైతే విశాఖ జిల్లాలోనే పోటీ చేయాలని అనుకుంటున్నట్లు స్పష్టం చేశారు.  తనను విశాఖ జిల్లా నుంచి పంపేద్దాం అనుకుంటుంటే.. పార్టీ నాయకులకు  తన అభిప్రాయాలను చెప్తానని స్పష్టం చేశారు. రెండు రోజుల్లో నిర్ణయం ఏంటన్నది చెప్తానని గంటా పరోక్షంగా బాబుకు హెచ్చరికలు పంపారు. ప్రతీ ఎన్నికల్లో తాను నియోజవర్గం మారుతున్నానని, కానీ ఈసారి మాత్రం విశాఖ జిల్లాలోనే పోటీ చేయాలని ఉందని గంటా శ్రీనివాసరావు అంటున్నారు.

మొత్తంగా సౌండ్ లేకుండానే బాబుకు గంటా శ్రీనివాస రావు వార్నింగ్ బెల్ మోగించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయా పడుతున్నారు. ఒకప్పటిలా చంద్రబాబు ఆదేశాలను పాటించే  పరిస్థితులు ప్రస్తుతం టీడీపీలో లేవనేది చాలా మంది అభిప్రాయం. ఇంకా చెప్పాలంటే.. అభ్యర్థులను ప్రకటించేది కూడా ఆయన చేతుల్లోనే లేదని, అందుకే తమకు టికెట్ దక్కదని చిన్న లీక్ బయటకు వచ్చిన టీడీపీ నేతలు చంద్రబాబుకే పరోక్ష హెచ్చరికలు పంపుతున్నారు. ఇప్పటికే పలువురు సీనియర్లు చంద్రబాబు మాటలను లెక్కచేయడం లేదనే టాక్ వినిపిస్తోంది. గంటా ఆలోచనకు వ్యతిరేకంగా టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటే గట్టి ఎదురు దెబ్బ తప్పదని ఆయన వ్యాఖ్యలతో స్పష్టమైంది. అధికార వైఎస్సార్ సీపీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తుంటే.. టీడీపీ,జనసేన అధినేతలు మాత్రం అసంతృప్తులను బుజ్జగించలేక తలలు పట్టుకుంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి