iDreamPost

Gangubai Kathiawadi Report : గంగూబాయ్ కటియావాడి రిపోర్ట్

అలియా భట్ టైటిల్ రోల్ పోషించగా అజయ్ దేవగన్ స్పెషల్ క్యామియో చేసిన ఈ మూవీకి దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ కావడంతో హైప్ ఎక్కడికో వెళ్లిపోయింది.

అలియా భట్ టైటిల్ రోల్ పోషించగా అజయ్ దేవగన్ స్పెషల్ క్యామియో చేసిన ఈ మూవీకి దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ కావడంతో హైప్ ఎక్కడికో వెళ్లిపోయింది.

Gangubai Kathiawadi Report : గంగూబాయ్ కటియావాడి రిపోర్ట్

పాండెమిక్ తర్వాత విడుదలైన బాలీవుడ్ బిగ్ మూవీగా భారీ అంచనాలతో నిన్న రిలీజైన సినిమా గంగూబాయ్ కటియావాడి. అలియా భట్ టైటిల్ రోల్ పోషించగా అజయ్ దేవగన్ స్పెషల్ క్యామియో చేసిన ఈ మూవీకి దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ కావడంతో హైప్ ఎక్కడికో వెళ్లిపోయింది. హిందీతో పాటు తెలుగు వెర్షన్ కూడా వచ్చింది కానీ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ తాకిడి ముందు మల్టీ ప్లెక్స్ ఆడియన్స్ తప్ప ఎవరూ దీన్ని అంతగా పట్టించుకోలేదు. ఆర్ఆర్ఆర్ హీరోయిన్ అనే కార్నర్ కూడా అంతో ఇంతో బజ్ వచ్చేందుకు ఉపయోగపడింది. నార్త్ లో మంచి ఓపెనింగ్స్ తెచ్చుకున్న ఈ లేడీ గ్యాంగ్ స్టర్ డ్రామా ఎలా ఉందో రిపోర్ట్ లో చూద్దాం

సాంప్రదాయ కుటుంబానికి చెందిన గంగ(అలియా భట్)కు సినిమా హీరోయిన్ కావాలన్నది లక్ష్యం. ప్రేమించిన ప్రియుడు మోసం చేసి ముంబైకు తీసుకెళ్లి కామాటిపుర వేశ్యావాటికలో అమ్మేస్తాడు. మొదట ఇష్టం లేకపోయినా పేరు మార్చుకుని తర్వాత పడుపు వృత్తిలో రాటుదేలుతుంది గంగూబాయ్. ఓ అనూహ్య సంఘటన వల్ల ఆమెకు పవర్ ఫుల్ లీడర్ రహీం(అజయ్ దేవగన్)మద్దతు దక్కుతుంది. తర్వాత ఆ వాడకు ప్రెసిడెంట్ అవుతుంది. అక్కడి పిల్లలు, వాళ్ళ తల్లులు బాగోగుల కోసం ప్రధానమంత్రి దాకా వెళ్తుంది గంగూ బాయ్. ఈ ప్రయాణం ఎలా సాగింది, చివరికి ఆమె అనుకున్నది సాధించిందా లేదా అనేది తెరమీద చూడాలి.

ఇది పూర్తిగా అలియా భట్ వన్ విమెన్ షో. తన వయసు, శరీరాకృతికి మించిన బరువైన పాత్ర ఇచ్చినప్పటికీ అద్భుతమైన పెర్ఫార్మన్స్ తో కట్టిపడేసింది. వందకు వంద మార్కులు కొట్టేసింది. దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఎంతసేపూ గంగూబాయ్ ని ఒక ఉన్నతమైన వ్యక్తిత్వంగా చూపించాలని పడిన తాపత్రయంలో డ్రామాను తగ్గించేసి ఎమోషన్స్ కి పెద్ద పీఠ వేయడంతో చాలా ల్యాగ్ వచ్చేసింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో అధిక శాతం డ్రైగా సాగుతుంది. పాటలే బలమైన భన్సాలీ ఇందులో తనే కంపోజ్ చేసిన మ్యూజిక్ తో మేజిక్ చేయలేకపోయారు. ఆర్ట్ వర్క్ మాత్రం అదిరిపోయింది. ఆర్టిస్టులందరూ చాలా సహజంగా కుదిరారు. గంగూబాయ్ జీవితాన్ని పూర్తి స్థాయిలో సరిగా ఆవిష్కరించలేదన్న అసంతృప్తి మాత్రం కలుగుతుంది. ఓటిటి హక్కులు నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది

Also Read : Bheemla Nayak : ఈవెంట్ సక్సెస్ చేశారు – ఇక సినిమాదే బాధ్యత

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి