iDreamPost

Gaddam Prasad Kumar: తెలంగాణ కొత్త స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్.. బ్యాగ్రౌండ్ ఇదే!

  • Published Dec 07, 2023 | 1:17 PMUpdated Dec 07, 2023 | 1:17 PM

తెలంగాణ అసెంబ్లీ నూతన స్పీకర్ గా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ని నియమిస్తూ.. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఆయనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవే..

తెలంగాణ అసెంబ్లీ నూతన స్పీకర్ గా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ని నియమిస్తూ.. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఆయనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవే..

  • Published Dec 07, 2023 | 1:17 PMUpdated Dec 07, 2023 | 1:17 PM
Gaddam Prasad Kumar: తెలంగాణ కొత్త స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్.. బ్యాగ్రౌండ్ ఇదే!

తెలంగాణ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ పేరు ఖరారయినట్లు సమాచారం. వికారాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికయిన గడ్డం ప్రసాదరావుని స్పీకర్‌గా నియమించేందుకు పార్టీ నిర్ణయం తీసుకుంది. దళిత సామాజికవర్గానికి చెందిన గడ్డం ప్రసాదరావు 2008లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై కేబినెట్ మంత్రిగా కూడా పనిచేశారు. ముందు నుంచి కాంగ్రెస్ పార్టీనే నమ్ముకుని ఉన్నారు. పార్టీ పట్ల ఆయన చూపిన విధేయతకు గాను.. అధిష్టానం.. గడ్డం ప్రసాద్ ను స్పీకర్ పదవికి ఎంపిక చేసినట్లు తెలిసింది. అంతేకాక అభిప్రాయ సేకరణలో భాగంగా.. స్పీకర్ పదవికి గడ్డం ప్రసాద్ కుమార్ అయితేనే బాగుంటుందని ఎక్కువ మంది నేతలు అనడంతో అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం.

గడ్డం ప్రసాద్ వ్యక్తిగత వివరాలు..

తెలంగాణ నూతన స్పీకర్ గా ఎన్నికైన గడ్డం ప్రభాకర్ స్వస్థలం వికారాబాద్ జిల్లా, మర్పల్లి గ్రామం. 1964లో ఆయన జన్మించారు. తాండూర్ లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అనగా 2008లో ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి.. తన సమీప ప్రత్యర్థి టీడీపీ నేత బి. సంజీవరావుపై గెలిచి.. తొలిసారి అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అలానే 2009లో జరిగిన ఎన్నికల్లో.. మరోసారి కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచి.. టీఆర్ఎస్ అభ్యర్థి ఎ.చంద్రశేఖర్ పై విజయం సాధించి.. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు.

దాంతో 2012లో గడ్డం ప్రసాద్ కుమార్ కు మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో టెక్స్ టైల్ శాఖ మంత్రి బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వత జరిగిన 2014, 2018 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ.. ఆయనను పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించింది. 2022, డిసెంబర్ 10న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఇక తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో.. వికారబాద్ నుంచి విజయం సాధించడంతో.. ఆయనకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గా అవకాశం కల్పించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి