iDreamPost

కుక్కకు అంత్యక్రియలు.. ఊరు మొత్తం కదలి వచ్చింది!

Funeral for The Dog: ఈ మద్య ఇంట్లో పెంచుకుంటున్న మూగ జీవాలను తమ కుటుంబ సభ్యుల్లా చూసుకుంటున్నారు. వాటికి పుట్టిన రోజు, సీమంతం ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Funeral for The Dog: ఈ మద్య ఇంట్లో పెంచుకుంటున్న మూగ జీవాలను తమ కుటుంబ సభ్యుల్లా చూసుకుంటున్నారు. వాటికి పుట్టిన రోజు, సీమంతం ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

కుక్కకు అంత్యక్రియలు.. ఊరు మొత్తం కదలి వచ్చింది!

మనుషులకు కొన్ని సాదు జంతువులకు పూర్వకాలం నుంచి ఎంతో అనుబంధం ఉంది. ముఖ్యంగా కుక్కలు, ఆవులు, బర్రెలు, మేకలు, కుందేళ్ల, పిల్లలు కొన్ని రకాల పక్షుల ఇంట్లో పెంచుకుంటారు. వీటన్నింటిలో కుక్కలకు ప్రత్యేక స్థానం ఉంది. మనుషులతో కుక్కలు ఎంతో విశ్వాసంగా ఉంటాయి. కొస్త ప్రేమగా చూసుకొని తిండి పెడితే చాలు తోక ఊపుకుంటూ వెంట తిరుగుతాయి. యజమాని కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్దపడతాయి. ఎప్పుడూ ఇంటికి కాపలా కాస్తుంటాయి. అందుకే చాలా రకాల కుక్కలను ఇంట్లో పెంచుకుంటారు. వాటికి పుట్టిన రోజు వేడుకలు, చనిపోతే అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. అలాంటి ఘటనే తూర్పు గోదావరి జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే..

తూర్పుగోదావరి జిల్లా పెంటపల్లిలో పెనుగుల రవీంద్ర, బేబీ కుటుంబం ఎంతో ముద్దుగా పెంచుకుంటున్న ఆరేళ్ల భీమ్ అనే శునకం చనిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయారు. ఎంతో అభిమానంతో చూసుకుంటూ వచ్చామని.. ఇంటి సభ్యుల్లో ఒకరిగా తమ భీమ్ ని పెంచుకున్నామని కన్నీరుమున్నీరయ్యారు. కుక్కతో గడిపిన క్షణాలు గుర్తుకు తెచ్చుకొని వెక్కి వెక్కి ఏడ్చాడు రవీంద్ర, బేబీ దంపతుల కుమారుడు నూతన్. జంతువులపై ప్రేమతో ఆరేళ్ల క్రితం భీమ్ ని తెచ్చుకొని పెంచుకున్నామని అన్నారు. ప్రతి సంవత్సరం భీమ్ కి పుట్టిన రోజు ఎంతో ఘనంగా జరిపించేవాళ్లమని.. ఇప్పుడు అది లేదని గుర్తుకు తెచ్చుకుంటే కన్నీళ్లు ఆగడం లేదని నూతన్ అంటున్నాడు.

భీమ్ అనే హచ్ కుక్క చనిపోయిన తర్వాత మనుషులకు చేసిన విధంగా దాని అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు, చుట్టాలు, గ్రామస్థులు అందరూ కలిసి కుక్క పోటోకి పూల మాళ వేసి నివాళులర్పించారు. కుక్కను బాణా సంచాలతో, పూలు జల్లుతూ స్మశానవాటిక వద్దకు తీసుకు వచ్చి అంత్యక్రియలు జరిపించారు. మరో రెండు రోజుల్లో ఫ్లేక్సీ ఏర్పాటు చేసి దానికి పెద్దకర్మ కూడా నిర్వహిస్తామని.. ప్రతి ఒక్కరూ వచ్చి భీమ్ ఆత్మకు శాంతి కలిగేలా చూడాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఎంతో విశ్వాసం చూపించే కుక్క ఆ కుటుంబ సభ్యులకు ఉన్న ప్రేమను చూసి గ్రామస్థులు చలించిపోయారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి