iDreamPost

ఈ వరల్డ్‌ కప్‌ పోయిందని బాధపడకండి.. ఇక నుంచి ఏడాదికో కప్పు ఉంది!

  • Author Soma Sekhar Published - 08:43 AM, Thu - 23 November 23

వరల్డ్ కప్ పోయిందని బాధపడే ఫ్యాన్స్ కు ఓ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. వచ్చే ఏడాది నుంచి ఐసీసీ మెగాటోర్నీలు ఉన్నాయి. దీంతో భారత్ తన ఐసీసీ కప్ ఆకలి తీర్చుకోవాలని భావిస్తోంది.

వరల్డ్ కప్ పోయిందని బాధపడే ఫ్యాన్స్ కు ఓ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. వచ్చే ఏడాది నుంచి ఐసీసీ మెగాటోర్నీలు ఉన్నాయి. దీంతో భారత్ తన ఐసీసీ కప్ ఆకలి తీర్చుకోవాలని భావిస్తోంది.

  • Author Soma Sekhar Published - 08:43 AM, Thu - 23 November 23
ఈ వరల్డ్‌ కప్‌ పోయిందని బాధపడకండి.. ఇక నుంచి ఏడాదికో కప్పు ఉంది!

వరల్డ్ కప్ 2023.. భారతీయులకు ఓ పీడకలనే మిగిల్చింది. తాజాగా జరిగిన ఈ విశ్వ సమరంలో 10 వరుస విజయాలతో దూసుకెళ్లిన టీమిండియాకు ఫైనల్లో షాకిచ్చింది ఆస్ట్రేలియా. టోర్నీ మెుత్తం అదరగొట్టిన భారత బ్యాటర్లు కీలక మ్యాచ్ లో చేతులెత్తేశారు. బౌలర్లు కూడా దారుణంగా విఫలం కావడంతో.. 140 కోట్ల భారతీయుల కల కలగానే మిగిలిపోయింది. ఇక ఈ ఓటమిని తట్టుకోలేక కొందరు క్రికెట్ లవర్స్ ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డ విషాద సంఘటనలను మిగిల్చింది ఈ వరల్డ్ కప్. అయితే వరల్డ్ కప్ పోయిందని బాధపడే ఫ్యాన్స్ కు ఓ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. వచ్చే ఏడాది నుంచి ఐసీసీ మెగాటోర్నీలు ఉన్నాయి. దీంతో భారత్ తన ఐసీసీ కప్ ఆకలి తీర్చుకోవాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

ప్రపంచ కప్ ఫైనల్లో టీమిండియా ఓటమిని ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు ఫ్యాన్స్. ఈసారి కచ్చితంగా వరల్డ్ కప్ గెలుస్తారని ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులపై నీళ్లు చల్లుతూ.. టైటిల్ ఎగరేసుకుపోయింది కంగారూ టీమ్. ఇక ఈ బాధలో నుంచి తేరుకోవడానికి భారతీయులకు కొంత సమయం పడుతుంది. ఇదిలా ఉండగా.. వరల్డ్ కప్ పోయిందని తీవ్ర నిరాశలో ఉన్న ఫ్యాన్స్ కు ఇది ఒక విధంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అదేంటంటే? వచ్చే సంవత్సరం నుంచి ఎన్నో వరల్డ్ కప్ టోర్నీలు జరగబోతున్నాయి. వీటిల్లో గెలిచి.. వరల్డ్ కప్ నెగ్గలేకపోయిన బాధను కొంతలో కొంతైనా తగ్గించుకోవాలని భారత జట్టుతో పాటు ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. మరి ఆ ఏఏ మెగాటోర్నీలు ముందున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. 2024 జూన్ లో వెస్టిండీస్, యూఎస్ఏ వేదికగా ఐసీసీ టీ20 వరల్డ్ కప్ జరగబోతోంది. ఆ తర్వాత నెక్ట్స్ ఇయరే అంటే 2025 ఫిబ్రవరిలో పాక్ వేదికగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఉండబోతోంది. మిగతా ట్రోఫీల విషయానికి వస్తే..

  • 1. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 (ఇండియా-శ్రీలంకలో)
  • 2. వన్డే వరల్డ్ కప్ 2027 అక్టోబర్-నవంబర్ (సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా)
  • 3. ఒలింపిక్స్ 2028 జులై (యూఎస్ఏ)
  • 4. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2028 (ఆస్ట్రేలియా-న్యూజిలాండ్)
  • 5. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2029 (ఇండియా)
  • 6. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2030 (యూకే)
  • 7. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2031 (ఇండియా-బంగ్లాదేశ్)

 

View this post on Instagram

 

A post shared by cric666 (@cric666official)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి