iDreamPost

మధ్యతరగతి వాళ్లకి 6 లక్షల్లోపే బెస్ట్ TATA కారు!

చాలామంది కారు కొనాలి అనుకునే సమయంలో టాటా కంపెనీ గురించి అసలు తెలుసుకోరు. ఎందుకంటే అవి కాస్త ఖరీదుగా ఉంటాయని అనుకుంటారు. కానీ, టాటా కంపెనీలో కూడా ఎన్నో బడ్జెట్ కార్స్ ఉన్నాయి.

చాలామంది కారు కొనాలి అనుకునే సమయంలో టాటా కంపెనీ గురించి అసలు తెలుసుకోరు. ఎందుకంటే అవి కాస్త ఖరీదుగా ఉంటాయని అనుకుంటారు. కానీ, టాటా కంపెనీలో కూడా ఎన్నో బడ్జెట్ కార్స్ ఉన్నాయి.

మధ్యతరగతి వాళ్లకి 6 లక్షల్లోపే బెస్ట్ TATA కారు!

కారు అనేది ఇప్పుడు అందరికీ అవసరంగా మారిపోయింది. కాకపోతే కొనాలి అంటే మాత్రం మనం బడ్జెట్లో ఉండాలి. తక్కువ ధరలో ఉండాలి అని అనుకుంటారు. చాలామందికి మన బడ్జెట్లో ఎంతో మంచి కార్లు అందుబాటులో ఉన్నాయని కూడా తెలియదు. అయితే టాటా కంపెనీ నుంచి మధ్యతరగతి వాళ్లు కూడా కొనుగోలు చేసే రేంజ్ లో మంచి బడ్జెట్ కార్లు మార్కెట్ లో ఉన్నాయి. వాటిలో టాటా టియాగో గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఈ హ్యాచ్ బ్యాక్ లో మంచి ఫీచర్స్ ఉన్నాయి. మైలేజ్ పరంగా కూడా ఈ కారుకు మంచి మార్కులు పడతాయి. మరి.. ఈ కారు ధర ఎంత? స్పెసిఫికేషన్స్ ఏంటో చూద్దాం.

ఈ టాటా టియాగో 2023 మోడల్ ఇప్పుడు బీఎస్ 6 ఇంజిన్ తో అప్ గ్రేడ్ అయ్యి వస్తోంది. ఇంక ఈ హ్యాచ్ బ్యాక్ ఎక్స్ షోరూమ్ ధర విషయానికి వస్తే.. రూ.5 లక్షల 60 వేల నుంచి ప్రారంభం అవుతుంది. గరిష్టంగా రూ.8 లక్షల 14 వేల వరకు ఎక్స్ షోరూమ్ ధర ఉంది. ఈ కారులో మీకు మొత్తం 14 వేరియంట్స్ లభిస్తున్నాయి. వేరియంట్ మారేకొద్దీ ఫీచర్స్ అప్ గ్రేడ్ కావడం మాత్రమే కాదు.. కారు ధర కూడా మారుతూ ఉంటుంది. ఎక్స్ షోరూమ్ ధరకు ఆన్ రోడ్ ధరకు కాస్త వ్యత్యాసం ఉంటుంది. ఈ కారు బేసిక్ మోడల్ ఆన్ రోడ్ ధర చూస్తే.. రూ.6 లక్షల 68 వేల వరకు ఉంది. ఈ టాటా టియాగోలో పెట్రోల్, సీఎన్జీ ఫ్యూయల్ ఆప్షన్స్ ఉన్నాయి. కంపెనీ వాళ్లే మంచి, సేఫ్టీ సెట్టింగ్స్ తో సీఎన్జీ మోడల్ ను అందిస్తున్నారు. అలాగే మీకు మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్సిషన్స్ కూడా లభిస్తాయి. 1199 సీసీ ఇంజిన్ తో వస్తోంది.

ఇంక మైలేజ్ విషయానికి వస్తే.. ఈ కారు పెట్రోల్ మాన్యువల్ ట్రాన్సిషన్ అయితే లీటరుకు రూ.19 కిలోమీటర్లు ఇస్తుందని కంపెనీ క్లయిమ్ చేస్తోంది. కస్టమర్స్ అయితే 18 నుంచి 19 కిలోమీటర్లు మైలేజ్ ఇస్తున్నట్లు చెబుతున్నారు. ఇంక పెట్రోల్ ఆటోమేటిక్ మోడల్ చూస్తే.. లీటరుకు 19 కిలోమీటర్లు ఇస్తుందని కంపెనీ క్లయిమ్ చేస్తోంది. వినియోగదారులు 18.5 కిలోమీటర్లు ఇస్తుందని చెబుతున్నారు. ఇంక టాటా టియాగో సీఎన్జీ మాన్యువల్ మోడల్ అయితే 26 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందని కంపెనీ క్లయిన్ చేస్తోంది. ఈ టాటా టియాగో 5 సీటర్ హ్యాచ్ బ్యాక్ మొత్తం ఫ్లేమ్ రెడ్, ఓపల్ వైట్, డైటోనా గ్రే, ఆరిజోనా బ్లూ, మిడ్ నైట్ ప్లమ్ అనే ఐదు కలర్ ఆప్షన్స్ తో వస్తోంది. ఫ్లేమ్ రెడ్, ఆరిజోనా బ్లూ కలర్స్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. ఈ కారు విషయంలో సేఫ్టీ గురించి మరీ మరీ మాట్లాడుకోవాలి.

ఈ ప్రైస్ రేంజ్ లో మీకు అదిరిపోయే సేఫ్టీ ఫీచర్స్ ని అందిస్తున్నారు. ముఖ్యంగా గ్లోబల్ ఎన్ క్యాప్ రేటింగ్ లో ఈ టాటా టియాగో కారుకు 4 స్టార్ రేటింగ్ లభించింది. అంటే మీ కుటుంబానికి ఈ కారు ఎంతో సురక్షితమైనది అర్థం. ఇంటీరియర్, డ్యాష్ బోర్డు డిజైన్ కూడా ఎంతో బాగుంటుంది. టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, పవర్ ఛార్జింగ్ సాకెట్, కప్ హోల్డర్స్ వంటి ఎన్నో ఫీచర్స్ ఉంటాయి. కాకపోతే బడ్జెట్ వెహికిల్ కాబట్టి కచ్చితంగా హార్డ్ ప్లాస్టిక్ ఎక్కువగా ఉంటుంది. సీఎన్జీ తీసుకుంటే మాత్రం మీకు ఎలాంటి బూట్ స్పేస్ లభించదనే చెప్పాలి. ఇంక పెట్రో వర్షన్ అయితే మాత్రం మీకు ఈ హ్యాచ్ బ్యాక్ లో 242 లీటర్స్ డీసెంట్ బూట్ స్పేస్ లభిస్తుంది. మరి.. ఈ టాటా టియాగో కారు మీకు ఎలా అనిపించింది? ఒకవేళ మీ దగ్గర టాటా టియాగో మీ ఎక్స్ పీరియన్స్ ఎలా ఉంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి