iDreamPost

కాలేజ్‌ హాస్టల్‌లో దారుణం.. విద్యార్థులు తినే భోజనంలో కప్ప!

కాలేజ్‌ హాస్టల్‌లో దారుణం.. విద్యార్థులు తినే భోజనంలో కప్ప!

కొన్ని కాలేజీలు, స్కూళ్లలోని హాస్టల్‌లలో వసతులు ఎలా ఉంటాయో ప్రత్కేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ఆహరంలో నాణ్యత దారుణంగా ఉంటుంది. తినే ఆహారంలో పురుగులు, ఇతర చిన్న చిన్న  జీవులు రావటం అన్నది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అయితే, కొన్ని కొన్ని సార్లు పెద్ద పెద్ద  జీవులు కూడా దర్శనం ఇస్తున్నాయి. తాజాగా, ఒరిస్సా, భువనేశ్వర్‌లోని కళింగ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ టెక్నాలజీలో దారుణం చోటుచేసుకుంది.

విద్యార్థులు తినే భోజనంలో ఏకంగా పెద్ద కప్ప వెలుగుచూసింది. దీంతో విద్యార్థులు ఒక్కసారిగా షాక్‌ తిన్నారు. హాస్టల్‌ సిబ్బందితో గొడవ పెట్టుకున్నారు. అరయాన్స్‌ అనే వ్యక్తి ఇందుకు సంబంధించిన వివరాలను, ఫొటోలను తన ట్విటర్‌ ఖాతా ద్వారా వెల్లడించాడు. ‘‘ దేశంలోని అద్భుతమైన ఇంజనీరింగ్‌ కాలేజీల్లో కేఐఐటీ భువనేశ్వర్‌కు 42వ ర్యాంకు వచ్చింది. విద్యార్థుల తల్లిదండ్రులు వారి ఇంజనీరింగ్‌ చదువుల దాదాపుగా 17.5 లక్షల రూపాయలు చెల్లిస్తున్నారు. కానీ, పిల్లలకు కాలేజీ హాస్టల్‌లో ఇలాంటి ఆహారాన్ని పెడుతున్నారు’’ అని పేర్కొన్నాడు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్వీట్‌ సోసల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ట్వీట్‌పై స్పందిస్తున్న నెటిజన్లు ‘‘ ఇలాంటి జరగటం కొత్తేమీ కాదు.. ప్రతీ హాస్టల్‌లో ఏదో ఒక సమయంలో ఇలాంటివి వెలుగు చూస్తున్నాయి’’.. ‘‘ అంత డబ్బులు పెట్టి చదివిస్తే.. కొంచెం కూడా శుభ్రత ఉండదు. పిల్లల గురించి పట్టించుకునే నాథుడే ఉండడు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ సంఘటనపై కాలేజీ యజమాన్యం స్పందించింది. సంఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి