iDreamPost

మూడు కాదు.. నాలుగో ఆప్షన్‌ కూడా ఉంది..!

మూడు కాదు.. నాలుగో ఆప్షన్‌ కూడా ఉంది..!

ప్రతి ఒక్కరికీ సొంత ఇళ్లు ఓ కల. పేద, మధ్య తరగతి ప్రజలు తమ జీవితాంతం అద్దె ఇళ్లలోనే కాలం వెల్లదీస్తుంటారు. అలాంటి వారందరికి సొంత గూడును కల్పించే దిశగా, సొంత ఇంటి కలను నిజం చేసేలా ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకానికి శ్రీకారం చుట్టారు. అపార్ట్‌మెంట్‌ తరహా విధానానికి చెక్‌ పెడుతూ.. వేర్వేరుగా ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ ప్రణాళికలు రచించారు. ఇళ్ల స్థలాలు ఇవ్వడంతోపాటు అక్కడ 1.80 లక్షల రూపాయలతో ఇళ్లు నిర్మించేందుకు సంకల్పించారు. రెండు దశల్లో నిర్మించబోయే ఇళ్లలో ఇప్పటికే 15.60 లక్షల ఇళ్లకు శంకుస్థాపనలు జరిగాయి. వచ్చే ఏడాది నాటికి ఈ ఇళ్ల నిర్మాణం పూర్తి కానుంది.

సొంత స్థలంలో సొంత ఇళ్లు, బెడ్‌ రూం, హాలు, వంట గది, బాత్‌ రూం, వరండా.. అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అయితే ఇళ్ల నాణ్యత ఎలా ఉంటుందోనన్న ఓ సందేహం. అంతేకాకుండా నచ్చినట్లుగా ఉంటుందా..? లేదా..? అనే ఆందోళనలు లబ్ధిదారుల్లో ఉన్నాయి. దీనికి కూడా పరిష్కారం చూపించారు సీఎం జగన్‌. ఇళ్ల నిర్మాణంలో లబ్ధిదారులకు మూడు అవకాశాలు ఇచ్చారు. ఒకటి – ప్రభుత్వం చూపిన నమూనా మేరకు అవసరమైన సామాగ్రి ప్రభుత్వం సరఫరా చేస్తుంది. లేబర్‌ ఛార్జీలు లబ్ధిదారుల చేతికే ఇస్తుంది. వారే దగ్గరుండి ఇళ్లు కట్టించుకోవచ్చు. రెండు – లబ్ధిదారులే ఇంటి నిర్మాణ సామాగ్రిని తెచ్చుకుని కట్టుకోవచ్చు. పనుల పురోగతిని బట్టీ దశల వారీగా నగదు ఇస్తుంది. మూడు – ప్రభుత్వమే స్వయంగా ఇళ్లు కట్టి ఇస్తుంది. ఇందులో ఏ ఆప్షన్‌నైనా అబ్ధిదారులు ఎంపిక చేసుకోవచ్చు.

ఈ మూడే కాదు.. నాలుగో ఆప్షన్‌ కూడా ఉంది. ప్రభుత్వం ఒక్కొక్క ఇంటిపై 1.80 లక్షల రూపాయలు వెచ్చిస్తోంది. దీనికి అదనంగా మరి కొంత జత చేసుకుని ఇళ్లు నిర్మించుకునే అవకాశం కూడా ప్రభుత్వం లబ్ధిదారులు కల్పించింది. 340 చదరపు అడుగుల విస్తీర్ణంలో మంచి ఇళ్లు కట్టుకోవచ్చు. కొంత ఆర్థిక స్తోమత ఉన్న లబ్ధిదారులు రెండో ఆప్షన్‌ను ఎంచుకోవడం ద్వారా తమ కలల ఇంటిని సాకారం చేసుకుంటున్నారు. ప్రభుత్వం చూపిన నమూనాలోనే.. పిల్లర్లు, టైల్స్, వంటగదిలో అలమరాలు, బెడ్‌ రూంలో సీలింగ్, కలప సామాగ్రి వినియోగం.. ఇలా లబ్ధిదారులు తమ ఇంటిని తమకు నచ్చినట్లుగా నిర్మించుకుంటున్నారు. ఇప్పటికే పలువురు లబ్ధిదారులు ఈ దిశగా తమ ఇంటిని నిర్మించుకున్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం, కొమెరపూడి గ్రామానికి చెందిన నరాల రత్నకుమారి ప్రభుత్వం తనకు కేటాయించిన స్థలంలో నిబంధనల ప్రకారం ప్రభుత్వం ఇచ్చిన 1.80 లక్షల రూపాయలకు అదనంగా మరో 1.20 లక్షల రూపాయలు వెచ్చించి.. మొత్తం 3 లక్షల రూపాయలతో తమ కలల ఇంటిని సాకారం చేసుకున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి