iDreamPost

మాజీ ముఖ్యమంత్రి కారుకు యాక్సిడెంట్.. ముందు సీట్లో కూర్చొవడంతో..

ర్యాష్ డ్రైవింగ్, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, ఓవర్ స్పీడ్, నిద్ర మత్తులో వాహనాలు నడపడం రోడ్డు ప్రమాదాలకు కారణాలవుతున్నాయి. ఈ ప్రమాదాల కారణంగా పిల్లలు అనాథలుగా, తల్లిదండ్రులు బిడ్డలు లేని వారిగా బతుకుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి

దేశంలో అనారోగ్యాల బారిన పడిన వారితో పోలిస్తే.. రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వారి సంఖ్య ఎక్కువ ఉంటుందనేది చేదు వాస్తవం. రెప్పపాటులో జరిగే ఈ ప్రమాదాల కారణంగా అనేక మంది ప్రాణాలు విడుస్తున్నారు. కుటుంబాలకు కుటుంబాలు ఛిన్నాభిన్నం అవుతున్నాయి. ర్యాష్ డ్రైవింగ్, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, ఓవర్ స్పీడ్, నిద్ర మత్తులో వాహనాలు నడపడం రోడ్డు ప్రమాదాలకు కారణాలవుతున్నాయి. ఈ ప్రమాదాల కారణంగా పిల్లలు అనాథలుగా, తల్లిదండ్రులు బిడ్డలు లేని వారిగా బతుకుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. ప్రముఖులు సైతం రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి విదితమే. తాజాగా ఒకప్పటి ముఖ్యమంత్రి రోడ్డు ప్రమాదం బారిన పడ్డారు.

ఉత్తరాఖండ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత హరీశ్ రావత్ పెను ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న కారు మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో హరీశ్ రావత్ స్వల్ప గాయలతో బయటపడ్డారు. హల్వ్థానీ నుండి కాశీపూర్ వెళుతుండగా.. ఉద్ధమ్ సింగ్ నగర్ జిల్లాలో ఆయన ప్రయాణీస్తున్న కారు బాజ్ పూర్ రైల్వే క్రాసింగ్ సమీపంలో వాహనాన్ని ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించగా.. ప్రమాదవ శాత్తు డివైడర్‪ను ఢీ కొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో ముందు సీట్లో కూర్చున్న రావత్‌కు స్వల్పగాయాలయ్యాయి. కారు డివైడర్ ను ఢీ కొనడంతో తనకు స్వల్ప గాయాలయ్యాయని, ఆసుపత్రికి వెళ్లగా.. అంతా బాగానే ఉందన్నారని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ట్విట్టర్ (ఎక్స్)లో పోస్టు చేశారు రావత్.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి