iDreamPost

తండ్రి ఎవరో చెప్పుకోలేని స్థితి చంద్రబాబుది: పేర్ని నాని

తండ్రి ఎవరో చెప్పుకోలేని స్థితి చంద్రబాబుది: పేర్ని నాని

ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కేంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ లు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. అయితే విమర్శలకు అధికార పార్టీ మంత్రులు, ముఖ్యనేతలు స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తుంటారు. ముఖ్యంగా మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, కురసాల కన్నాబాబు వంటి వారు చంద్రబాబుపై విరుచకపడుతుంటారు. తాజాగా మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని.. చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. తన తండ్రి ఎవరో చెప్పుకోలేని ధౌర్బాగ్యస్థితిలో బాబు ఉన్నారని మండిపడ్డారు.

పేర్ని నాని మాట్లాడుతూ..” గత 40 ఏళ్లలో చంద్రబాబు ఏనాడూ తన తండ్రి ఎరో ఈ ప్రపంచానికి చెప్పుకున్న దాఖలాలు లేవు. తన తండ్రి ఎవరో చెప్పుకోలేని  దౌర్భాగ్య స్థితిలో చంద్రబాబు ఉన్నాడు. తాను రాజశేఖర్ రెడ్డి, విజయమ్మల కుమారుడినని సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పుకుంటారు. తల్లిదండ్రుల పేర్లు చెప్పుకోలేని చంద్రబాబు సీఎం జగన్ గురించి తప్పుగా మాట్లాతుడుతున్నాడు. తల్లి,తండ్రి చనిపోతే తలకొరివి పెట్టలేని వాడు..నేటికి ఎన్టీఆర్ అల్లుడినని చంద్రబాబు చెప్పుకుంటాడు.

నేను ఫలానా వాడి కొడుకుని అని చెప్పుకోలేని వాడు కూడా తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు. రాజకీయాల్లో చంద్రబాబు ఉండటం అనవసరం. చంద్రబాబు తలక్రిందులుగా తపస్సు చేసినా వైఎస్సార్ సీపీ జెండాను కూడా టచ్ చేయలేడు. చంద్రబాబు బతుకుంతా  ప్రజలకు తెలుసని, అధికారంలో రావడానికి అరచేతిలో వైకుంఠం చూపిస్తాడు. 80 ఏళ్ల ముసలినక్క చంద్రబాబు వయసుకు తగ్గ మాటలు మాట్లాడితే బాగుంటుంది” అని పేర్ని నాని ఎద్దేవా చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి