iDreamPost

టీమిండియా సెలక్టర్లకు కొంచెం కూడా తెలివి లేదు! భారత మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్

  • Author Soma Sekhar Published - 04:14 PM, Mon - 19 June 23
  • Author Soma Sekhar Published - 04:14 PM, Mon - 19 June 23
టీమిండియా సెలక్టర్లకు కొంచెం కూడా తెలివి లేదు! భారత మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియాపై ఓటమితో భారత జట్టుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా కెప్టెన్సీ విషయంలో బోర్డులో పెద్ద ఎత్తున చర్చ కూడా నడుస్తోంది. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి మరో ఆటగాడికి జట్టు పగ్గాలు అందించాలని చాలా మంది మాజీలు తమ అభిప్రాయాలను వ్యక్త పరిచారు. ప్రస్తుతం కెప్టెన్సీ మార్పుపై బీసీసీఐ నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. ఎందుకంటే తర్వరలోనే వన్డే వరల్డ్ కప్ జరగనుంది. ఈ టోర్నీ తర్వాతే బీసీసీఐ ఏదైనా నిర్ణయం తీసుకునే ఛాన్సులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే టీమిండియా సెలక్టర్లపై షాకింగ్ కామెంట్స్ చేశాడు టీమిండియా మాజీ ఆటగాడు దిలీప్ వెంగ్ సర్కార్.

టీమిండియా సెలక్షన్ కమిటీలో ఉన్న సెలక్టర్లకు క్రికెట్ పై కనీస అవగాహన లేదన్నారు టీమిండియా మాజీ ఆటగాడు దిలీప్ వెంగ్ సర్కార్. ఇక సెలక్షన్ కమిటీకి కొంచం కూడా తెలివిలేనట్లుగా అనిపిస్తోందని మండిపడ్డాడు. కొన్ని సిరీస్ లకు ప్రధాన ఆటగాళ్లు లేనప్పుడు వారి స్థానంలో శిఖర్ ధావన్ ను కెప్టెన్ గా నియమించారు. ఇదే సెలక్టర్లు చేసిన ఘోరమైన తప్పుగా వెంగ్ సర్కార్ అభిప్రాయపడ్డాడు. శిఖర్ స్థానంలో మరో యంగ్ క్రికెటర్ కు పగ్గాలు అందిస్తే.. ఫ్యూచర్ కెప్టెన్ రాటుతేలేవాడుగా అని వెంగ్ సర్కార్ పేర్కొన్నాడు. కానీ బీసీసీఐ అలా ఆలోచించలేదు.

ఇక రోహిత్ శర్మ తర్వాత టీమిండియాకు సారథి ఎవరు? అంటే ఏం పేరు చెబుతారో సెలక్టర్లకే తెలియాలని ఈ సందర్భంగా వెంగ్ సర్కార్ ప్రశ్నించాడు. ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డుగా కీర్తి ఘడించిన బీసీసీఐ కనీసం బెంచ్ బలాన్ని కూడా పెంచుకోవడం లేదని వెంగ్ సర్కార్ విమర్శించాడు. మీడియా హక్కుల ద్వారా వేల కోట్లు సంపాదించడం కాదు.. జట్టు కూర్పుపై కూడా దృష్టి సారించాలంటూ విమర్శల వర్షం కురిపించాడు వెంగ్ సర్కార్. మరి ఈ విమర్శలను బీసీసీఐ ఏ విధంగా తీసుకుంటుందో వేచి చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి