iDreamPost

టీ20 వరల్డ్ కప్ గెలవాలంటే అదొక్కటే మార్గం.. ద్రవిడ్ కు ప్రత్యేక సలహా ఇచ్చిన దిగ్గజ క్రికెటర్!

టీమిండియా దిగ్గజ ప్లేయర్ నవ్ జ్యోత్ సింగ్ సిద్దూ భారత్ టీ20 వరల్డ్ కప్ గెలవాలంటే అదొక్కటే మార్గం అంటూ.. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కు ప్రత్యేక సలహా ఇచ్చాడు. ఆ స్పెషల్ అడ్వైస్ ఏంటో చూద్దాం పదండి.

టీమిండియా దిగ్గజ ప్లేయర్ నవ్ జ్యోత్ సింగ్ సిద్దూ భారత్ టీ20 వరల్డ్ కప్ గెలవాలంటే అదొక్కటే మార్గం అంటూ.. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కు ప్రత్యేక సలహా ఇచ్చాడు. ఆ స్పెషల్ అడ్వైస్ ఏంటో చూద్దాం పదండి.

టీ20 వరల్డ్ కప్ గెలవాలంటే అదొక్కటే మార్గం.. ద్రవిడ్ కు ప్రత్యేక సలహా ఇచ్చిన దిగ్గజ క్రికెటర్!

ఐపీఎల్ 2024 సీజన్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. కానీ అందరి చూపు మాత్రం జూన్ నుంచి ప్రారంభం అయ్యే టీ20 వరల్డ్ కప్ పైనే ఉంది. వెస్టిండీస్-అమెరికా వేదికలుగా ఈ టోర్నీ స్టార్ట్ కానుంది. ఇక ఈసారి ఎలాగైనా టీ20 కప్ కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది టీమిండియా. ఇప్పటికే రెండు ట్రోఫీలు చేజార్చుకున్న భారత్.. ఈ కప్ ను మాత్రం వదలుకోకూడదని గట్టి నిర్ణయానికి వచ్చింది. అందుకోసం ఎప్పటి నుంచి ప్రణాళికలను రచిస్తూ వస్తోంది. జట్టు కూర్పుపై గత కొన్ని నెలల నుంచి ప్రయోగాలు చేస్తూ వస్తోంది బీసీసీఐ. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజ ప్లేయర్ నవ్ జ్యోత్ సింగ్ సిద్దూ భారత్ టీ20 వరల్డ్ కప్ గెలవాలంటే అదొక్కటే మార్గం అంటూ.. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కు ప్రత్యేక సలహా ఇచ్చాడు. మరి ఆ మార్గం ఏంటి? చూద్దాం పదండి.

ఐపీఎల్ 2024 సీజన్ సగం పూర్తైంది. ఇక ఇప్పుడు అందరి చూపు టీ20 వరల్డ్ కప్ పైనే. ఇప్పటికే పలువురు మాజీ క్రిటర్లు, క్రికెట్ అనలిస్టులు టీమిండియా జట్టు ఎలా ఉండాలో అంచనా వేసి.. ఆటగాళ్ల పేర్లను ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో భారత మాజీ ఆటగాడు నవ్ జ్యోత్ సింగ్ సిద్దూ కూడా టీమిండియా జట్టు కూర్పుపై తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ఈ సందర్భంగా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కు ప్రత్యేక సలహాలు, సూచనలు కూడా ఇచ్చాడు. ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఈ విధంగా బదులిచ్చాడు సిద్దూ..

“టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలవాలంటే? కోచ్ రాహుల్ ద్రవిడ్ కు నేనిచ్చే సలహా ఒక్కటే. ఐదు వికెట్లు తీసిన స్పెషలిస్ట్ బౌలర్ ను జట్టులో ఉంచాలి. ఇందులో ఎలాంటి రాజీ పడొద్దు. రాజీ పడితే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ద్రవిడ్ ఇది గుర్తుంచుకోవాలి” అంటూ తన సలహాను ఇచ్చాడు. ఈ సందర్భంగా టీ20 వరల్డ్ కప్ కోసం తాను ఎంపిక చేసిన జట్టును ప్రకటించాడు. అందులో రవీంద్ర జడేజా, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్, మోసిన్ ఖాన్, మయాంక్ యాదవ్ లను తన టీమ్ లో బౌలర్లుగా తీసుకున్నాడు. మరి టీమిండియాలో 5 వికెట్లు తీసే స్పెషలిస్ట్ బౌలర్లు ఉండాలన్న మాజీ క్రికెటర్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి