iDreamPost

కరోనాతో బిజెపి మాజీ ఎంపి మృతి: రాజకీయ నేతల్లో కలవరం

కరోనాతో బిజెపి మాజీ ఎంపి  మృతి: రాజకీయ నేతల్లో కలవరం

దేశాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. దాదాపు 15 రాష్ట్రాల్లో కరోనా విలయ తాండవం చేస్తుంది. సామన్య ప్రజలు నుంచి రాజకీయ నేతలు, పోలీసులు, డాక్టర్లు, సినీ ప్రముఖులు, వ్యాపార వేత్తలు, సెలబ్రిటీలు ఇలా అన్ని వర్గాల ప్రజలపై కరోనా విశ్వరూపం దాల్చుతుంది.

అయితే ఇటివలి రాజకీయ నేతల్లో కరోనా కలవరం పెట్టిస్తుంది. తమిళనాడులోని డిఎంకె ఎమ్మెల్యే జె.అంబఝగన్ కరోనా సోకి మృతి చెందారు. అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ బిజెపి కౌన్సిలర్ గయప్రసాద్ కనోజియా కరోనాతోనే మృతి‌ చెందారు. తెలంగాణలో అధికార టిఆర్ఎస్ ఇద్దర ఎమ్మెల్యేలకు, తమిళనాడులో అన్నాడిఎంకె ఎమ్మెల్యేకు, మహారాష్ట్రలో మంత్రులకు, ఢిల్లీలో బిజెపి అధికార ప్రతినిధికి కరోనా సోకింది. ఇలా రాజకీయ నేతల్లో కరోనా కలవరం పెడుతుంది. కరోనా సోకి కొంత మంది రాజకీయ నేతలు కోలుకుంటుంటే, మరికొంత మంది మరణిస్తున్నారు.

మహారాష్ట్రలో అయితే ఈ వైరస్ విలయతాండవం చేస్తోంది. తాజాగా ముంబాయికి చెందిన బిజెపి మాజీ ఎంపి హరిభావ్ జావలే కరోనాతో మరణించారు. మంగళవారం ఆయన మృతి చెందనట్లు అధికారులు వెల్లడించారు. మహారాష్ట్రలోని జల్గావ్‌కు చెందిన జావలే.. ఈ నెల ఆరంభంలో కరోనా బారినపడ్డారు. ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బందిపడిన జావలే వెంటిలేటర్‌ అమర్చేలోపే మృతిచెందినట్లు సమాచారం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి