iDreamPost

25 వేల కోట్ల ఆస్తి.. సగంపైగా దానం! అద్దె ఇంట్లోనే నివాసం! నిఖిల్ కామత్ లైఫ్ స్టోరీ!

  • Published Apr 03, 2024 | 7:32 PMUpdated Apr 03, 2024 | 7:32 PM

Forbes 2024 List: 2024 ఏడాదికి గాను ఫోర్బ్స్ బిలయనీర్ల జాబితా విడుదల చేసింది. వారిలో ఓ వ్యక్తి వివరాలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయి.

Forbes 2024 List: 2024 ఏడాదికి గాను ఫోర్బ్స్ బిలయనీర్ల జాబితా విడుదల చేసింది. వారిలో ఓ వ్యక్తి వివరాలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయి.

  • Published Apr 03, 2024 | 7:32 PMUpdated Apr 03, 2024 | 7:32 PM
25 వేల కోట్ల ఆస్తి.. సగంపైగా దానం! అద్దె ఇంట్లోనే నివాసం! నిఖిల్ కామత్ లైఫ్ స్టోరీ!

ప్రపంచ ధనవంతుల జాబితా, ఫోర్బ్స్ బిలియనీర్ లిస్ట్ అనగానే మన దేశానికి సంబంధించి ముందుగా గుర్తుకు వచ్చే పేర్లు ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీలే. ఈ జాబితాలో రతన్ టాటా, అజిమ్ ప్రేమ్ జీ వంటి వారి పేర్లు అసలు రావు. ఎందుకంటే.. వారి సంపాదనలో సగానికి పైగా సమాజం కోసమే ఖర్చు చేస్తారు. అయితే అది వారి వ్యక్తిగత అభిప్రాయం. ఇక ఆ విషయం వదిలిస్తే.. తాజాగా 2024 సంవత్సరానికి గానూ ఫోర్బ్స్ బిలియనీర్స్ జాబితాను విడుదల చేసింది. ఎప్పటిలానే రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ భారత్‌లో అత్యంత ధనవంతుడిగా తన స్థానాన్ని స్థిరపర్చుకున్నారు.

ఫోర్బ్స్ జాబితా ప్రకారం ముఖేష్ అంబానీ సంపద 116 బిలియన్ డాలర్లుగా వెల్లడైంది. భారత కరెన్సీలో ఇది రూ. 9.68 లక్షల కోట్లుగా ఉంది. ఇక భారత్‌లో బిలియనీర్ల జాబితాలో రెండో స్థానంలో అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ ఉన్నారు. ఈయన సంపద 84 బిలియన్ డాలర్లుగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే ఈయన 17వ స్థానంలో ఉన్నారు.

Flipkart founder

ఇక ఈ ఏడాది ఫోర్బ్స్ జాబితాలో స్థానం దక్కించుకున్న ఓ వ్యక్తి వివరాలు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఎందుకంటే ఆయనకు ఎలాంటి అధికారిక డిగ్రీలు లేవు.. సంపదలో సగం దానం చేస్తానని మాటిచ్చాడు. నేటికి కూడా అద్దె ఇంట్లోనే నివాసం ఉంటూ.. వేల కోట్ల రూపాయలకు అధిపతి అయ్యి ఉండి కూడా అత్యంత సామాన్య జీవితం గడుపుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.

ఆయనే జెరోధా కోఫౌండర్లలో ఒకరైన 37 ఏళ్ల నిఖిల్ కామత్. ఈయన 3.1 బిలియన్ డాలర్ల సంపదతో ఫోర్బ్స్ జాబితాలో 1062వ స్థానంలో నిలిచారు. భారత కరెన్సీలో చూసుకుంటే.. ఈయన సంపద రూ. 25 వేల కోట్ల కంటే ఎక్కువే ఉంటుంది. ఇండియా యంగెస్ట్ బిలియనీర్స్ జాబితాలో నిఖిల్ కామత్ తొలి స్థానం దక్కించుకున్నారు.

నిఖిల్ కామత్ గురించి చెప్పాలంటే..

నిఖిల్ కామత్.. 2010లో తన సోదరుడు నితిన్ కామత్‌తో కలిసి స్టాక్ బ్రోకరేజీ సంస్థ జెరోధాను స్థాపించాడు. తక్కువ కాలంలోనే ఇది గొప్ప స్థాయికి చేరుకుని.. భారత బ్రోకరేజీ మార్కెట్లో అగ్రగామిగా కొనసాగుతోంది. బెంగళూరు ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థకు.. 10 మిలియన్లకు పైగా క్లయింట్లు ఉన్నారని ఫోర్బ్స్ వెల్లడించింది. ఇక నిఖిల్ కామత్ వ్యక్తిగత జీవితం వివరాలకు వస్తే..

Flipkart founder

10వ తరగతి వరకే చదువు..

నిఖిల్ కామత్ 1986, సెప్టెంబర్ 5న జన్మించారు. 10వ తరగతి వరకే చదువుకున్నారు. ఈయనకు ఎలాంటి అధికారిక డిగ్రీ కూడా లేకపోవడం గమనార్హం. కెరీర్ ప్రారంభంలో కాల్ సెంటర్లో పని చేస్తూనూ.. ఈక్విటీ ట్రేడింగ్ చేసేవారు. తర్వాతే తన సోదరుడితో కలిసి జెరోధాను స్థాపించారు. కామత్ 2023 జూన్‌లో.. తన సంపద మొత్తంలో సగం వరకు సమాజానికి విరాళంగా ఇస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఇలా ది గివింగ్ ప్లెడ్జ్ (సంపద దానం కోసం చేసే ప్రమాణం) చేసిన వారిలో భారత్ లో అతి చిన్న వయసు వ్యక్తి కూడా ఈయనే.

వ్యాపారం ద్వారా వేల కోట్లు సంపాదించినా ఇప్పటికీ నిఖిల్ అద్దె ఇంట్లోనే ఉంటున్నట్లు తెలుస్తోంది. స్థిరాస్తిలో పెట్టుబడి పెట్టేందుకు ఈయన వ్యతిరేకం. రియల్ ఎస్టేట్ ధరలు ఎక్కువగా ఉన్నాయని.. అందుకే అద్దె ఇంట్లో ఉంటున్నట్లు గతంలో ఓసారి చెప్పుకొచ్చారు నిఖిల్ కామత్. ఈయన తన 17 వ ఏట.. తొలి సాలరీ అందుకున్నాడు. బెంగళూరులోని 24/7 అనే కాల్ సెంటర్లో పనిచేసే సమయంలో మొదటి నెల 8 వేల రూపాయల జీతం తీసుకున్నాడట. ఎలాంటి డిగ్రీలు లేకపోయిన వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించి.. ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు నిఖిల్ కామత్.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి