iDreamPost

కర్నూలు to వైజాగ్ 3000

కర్నూలు to వైజాగ్ 3000

వినువీధిలో విహరించాలన్న జిల్లా ప్రజల కల సాకారం అయింది. విమానాశ్రయం ప్రారంభమైన మూడో రోజే రాకపోకలు మొదలయ్యాయి. కర్నూలు నుంచి మొదటి విమాన సర్వీసు కర్నూలు-విశాఖపట్నం మధ్య నిన్న ఉదయం 10:30 గంటలకు ప్రారంభమైంది. మొదట ల్యాండైన విమానం బెంగళూరు- కర్నూలు సర్వీసు కావడం విశేషం. మొదటి రోజు మొత్తం 260 మంది ప్రయాణం చేశారు.

ఎన్నో ఏళ్ల కల సాకారమైంది. సొంత జిల్లాకు విమానంలో వెల్లలనుకునే వారి ఆశలు సఫలీకృతమయ్యాయి. ఓర్వకల్లు విమానాశ్రయం కర్నూలు-విశాఖపట్నం, కర్నూలు-బెంగళూరు, కర్నూలు-చెన్నై సర్వీసులు మొదటి రోజు నడిచాయి. మొదటి రోజే ప్రాయాణించడానికి ప్రయాణికులు పోటీ పడ్డారు. 20 రోజుల ముందే టిక్కెట్ బుక్ చేసుకున్నారు. బుకింగ్ ఓపెన్ చేయగానే టిక్కెట్లన్నీ బుక్ అవ్వడం విశేషం.

జిల్లా వాసులు విద్య, ఉద్యోగ, వ్యాపార అవసరాల కోసం ఎక్కువగా బెంగళూరు, హైదరా బాద్‌, విజయవాడ, చెన్నై నగరాలకు వెళుతుంటారు. కర్నూలు నుంచి రోడ్డు ప్రయాణం చేస్తే కనీసం అయిదారు గంటల సమయం పడుతుంది. కర్నూలు నుంచి బెంగళూరుకు 359 కి.మీ. దూరం ఉంది. ప్రయాణ సమయం దాదాపు ఆరుగంటలు. విమాన మార్గం ద్వారా కేవలం గంటా పది నిముషాల్లో చేరుకోవచ్చు. కర్నూలు నుంచి చెన్నై నగరానికి 490కి.మీ. దూరం. రోడ్డు మార్గం ద్వారా ప్రయాణిస్తే ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు పడుతుంది. అదే విమానమైతే గంటా ఇరవై నిముషాల్లో చేరుకోవచ్చు. కర్నూలు నుంచి విశాఖపట్నం మధ్య దూరం 700 కి.మీ. కాగా, ప్రయాణ సమయం దాదాపు 15 గంటలు పడుతుంది. విమాన ప్రయాణమైతే రెండు గంటల పది నిముషాల్లో చేరుకోవచ్చు. అత్యవసర పనులు ఉన్నవారికి విమాన ప్రయాణం అనుకూలంగా ఉంది. కర్నూలు -బెంగళూరుకి రూ.2,077, కర్నూలు- చెన్నై రూ.2,555, కర్నూలు-విశాఖపట్నం రూ.3,000గా టికెట్ ధర నిర్ణయించారు.

సర్వీసులు ఇలా…

6ఈ7911 – సోమ, బుధ, శుక్ర, ఆదివారాలు బెంగళూరులో 09.05కి టేక్ ఆఫ్ అయి కర్నూలుకి 10.10కి చేరుకుంటుంది.

6ఈ7912 సోమ, బుధ, శుక్ర, ఆదివారాలు కర్నూలులో 10.30కి టేక్ ఆఫ్ అయ్యి విశాఖపట్నంకి 12.40కి చేరుకుంటుంది.

6ఈ7913 సోమ, బుధ, శుక్ర, ఆదివారం- విశాఖపట్నంలో 13.00కి స్టార్ట్ అయితే కర్నూలుకి 14.55 చేరుకుంటుంది.

6ఈ7914 సోమ, బుధ, శుక్ర, ఆదివారం కర్నూలులో 15.15 బయలుదేరి బెంగళూరుకి 16.25 కి చేరుకుంటుంది.

6ఈ7915 మంగళ, గురు, శని, ఆదివారాలు చెన్నైకి 14.50కి బయలుదేరి కర్నూలుకు 16.10కి చేరుకుంటుంది.

6ఈ7916 మంగళ, గురు, శని, ఆదివారాలు కర్నూలులో 16.30కి స్టార్ట్ అయితే చెన్నైకి 17.50కి చేరుకుంటుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి