iDreamPost

ఐదు గ్రామాలు అమరావతి నుంచి డీ – నోటిఫైడ్

ఐదు గ్రామాలు అమరావతి నుంచి డీ – నోటిఫైడ్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐదు గ్రామాలను రాజధాని పరిధి నుంచి తొలగిస్తూ వాటిని సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది.

రాజధాని పరిధిలోని 25 గ్రామ పంచాయతీలు,వాటిలోని 29 మధుర గ్రామాలు అమరావతి కేపిటల్‌ సిటీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే వీటిలోని నవులూరు, బేతపూడి, ఎర్రబాలెం, పెనుమాక, ఉండవల్లి పంచాయతీలను మంగళగిరి, తాడేపల్లి పురపాలక సంఘాల్లో విలీనం చేస్తూ ప్రభుత్వం జీవోలు ఇచ్చింది. తాడేపల్లి మండలంలో ఎనిమిది, మంగళగిరి మండలంలో ఐదు పంచాయతీలను తాడేపల్లి, మంగళగిరి పురపాలక సంఘాల్లో విలీనం కోసం గుంటూరు కలెక్టర్‌ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు వచ్చాయి.

ఈ మేరకు 2020 జనవరి 10న ప్రభుత్వ ఆదేశాలపై పది రోజుల వ్యవధిలో తాడేపల్లి పురపాలక సంఘ అధికారులు, 11 రోజుల వ్యవధిలో మంగళగిరి పురపాలక అధికారులు… కౌన్సిల్‌ తీర్మానాలు చేసి (రెండూ ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్నాయి) పంచాయతీల విలీనానికి సమ్మతిని తెలుపుతూ ప్రభుత్వానికి తిరిగి సమాచారాన్ని పంపారు. దీనిపై పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ అంతేవేగంగా స్పందించి పురపాలక సంఘాల్లో పంచాయతీల విలీనానికి ప్రకటన (డీ-నోటిఫైడ్‌) చేసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి