iDreamPost

సికింద్రాబాద్ నవకేతన్ కాంప్లెక్స్ లో భారీ అగ్ని ప్రమాదం..

సికింద్రాబాద్ నవకేతన్ కాంప్లెక్స్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కాంప్లెక్స్ లోని మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి, అగ్ని కీలలు ఎగిసిపడి 5వ అంతస్తు వరకూ మంటలు వేగంగా వ్యాపించాయి.

సికింద్రాబాద్ నవకేతన్ కాంప్లెక్స్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కాంప్లెక్స్ లోని మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి, అగ్ని కీలలు ఎగిసిపడి 5వ అంతస్తు వరకూ మంటలు వేగంగా వ్యాపించాయి.

సికింద్రాబాద్ నవకేతన్ కాంప్లెక్స్ లో భారీ అగ్ని ప్రమాదం..

ఇటీవలి కాలంలో అగ్ని ప్రమాదాలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. ఆకాస్మాత్తుగా జరుగుతున్న ఫైర్ ఆక్సిడెంట్ లతో జనం భయాందోళనకు గురవుతున్నారు. కొంత కాలం క్రితం సికింద్రాబాద్ లోని స్వప్నలోక్ కాంప్లెక్స్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగి పలువురు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని నవకేతన్ కాంప్లెక్స్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో అక్కడున్న జనం ప్రాణ భయంతో పరుగులు పెట్టారు. మంటలు దట్టంగా వ్యాపించడంతో ఆ ప్రాంతమంతా పొగ కమ్మేసింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు.

సికింద్రాబాద్ నవకేతన్ కాంప్లెక్స్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కాంప్లెక్స్ లోని మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి, అగ్ని కీలలు ఎగిసిపడి 5వ అంతస్తు వరకూ మంటలు వేగంగా వ్యాపించాయి. అక్కడున్న వారు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫైర్ ఇంజన్లతో సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది ఎగిసిపడుతున్న మంటలను ఆర్పుతున్నారు. అగ్నిప్రమాదం కారణంగా సమీప ప్రాంతాల్లో దట్టమైన పొగ కమ్ముకుంది. కాగా ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి